ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ప్రస్తుతం, భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో కూడా తన సత్తా ఏంటో చూపేందుకు సిద్ధమైంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) టీజర్ ఫొటోలను కూడా వెల్లడి చేసింది. ఈ టీజర్ ఫొటోలు రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ గురించి అనేక వివరాలను వెల్లడిస్తున్నాయి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా చవకైనదేమీ కాదు.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car)ను ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ విభాగంలో విడుదల చేయనున్నామని కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ వెల్లడించారు. నిన్న భారతదేశపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తమ రాబోయే ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి మరిన్ని కొత్త టీజర్‌ లను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా, భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రీమియం సెగ్మెంట్లో ఈ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నామని, కాబట్టి దీని ధర కూడా రూ. 50 లక్షల వరకు ఉంటుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ మీడియాకు తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

మరికొద్ది నెలల్లో ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ప్రపంచానికి పరిచయం చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఓ నివేదిక ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును 2024లో విడుదల చేయాలని చూస్తోంది. సరసమైన ఓలా ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి దీని ధర షాకింగ్‌గానే ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం ఈ ఎలక్ట్రిక్ కారు కోసం అధిక డిమాండ్‌ను ఆశిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

మరో గుడ్‌న్యూస్ ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారుతో పాటు బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై కూడా దృష్టి సారిస్తోందని భవీష్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో లాంచ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము తీసుకురాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో విడుదల చేసిన రెండు మూడేళ్లలో దాని ఉత్పత్తిని 1 మిలియన్ యూనిట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

పూర్తి చార్జ్ పై 500 కిలోమీటర్ల రేంజ్

ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో విడుదల కానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు దాని భారీ ప్రైస్ ట్యాగ్‌కు తగినట్లుగానే అనేక ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో అందించబోయే ఫీచర్ల గురించి ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ, భవీష్ అగర్వాల్ మాత్రం ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ గురించి వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని భవిష్ పేర్కొన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న ఇతర ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ కంటే ఇది చాలా ఎక్కువ. ఓలా ఎలక్ట్రిక్ కారు సుధీర్ఘమైన రేంజ్‌ను అందించే బ్యాటరీనే కాకుండా, అత్యంత చురుకైన ఎలక్ట్రిక్ మోటారును కూడా కలిగి ఉంటుంది. భవీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఆయన చెప్పారు. అయితే, ఓలా ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో టీజర్ల రూపంలో ఒక్కొక్కటిగా కంపెనీ ఈ కారుకి సంబంధించిన వివరాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మరియు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ అగ్రస్థానంలో ఉంది. కంపెనీ ఇటీవల ఇందులో ప్రవేశపెట్టిన లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోవడానికి 9 సెకన్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఓలా నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ కన్నా అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ఓలా ఎలక్ట్రిక్ కార్ డిజైన్ ఎలా ఉంటుంది?

ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి కంపెనీ గత కొన్ని వారాలుగా విడుదల చేస్తూ వచ్చిన టీజర్‌‌ల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు కూప్ బాడీ స్టైల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముందు వైపు సెడాన్ మాదిరిగా పొడవాటి బానెట్ ను కలిగి ఉండి, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ ను కలిగి ఉంటుంది. కారు వెనుక భాగంలోని రూఫ్, బూట్‌తో విలీనమైనట్లుగా కనిపిస్తుంది.అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ చాలా షార్ప్‌గా మరియు స్పోర్టీగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!

ఇంకా ఈ టీజర్లలో కారు ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్స్ మరియు ఆ రెండింటినీ కలుపుతున్నట్లుగా అనిపించే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, వెనుక భాగంలో టెయిల్ లైట్‌ మరియు ఎల్ఈడి లైట్ బార్స్ వంటి డిజైన్ హైలైట్స్ వెల్లడయ్యాయి. టెస్లా ఎలక్ట్రిక్ కారు మాదిరిగా ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ మరియు పారదర్శక రూఫ్‌టాప్ (గ్లాస్ టాప్) ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఈ కారులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ola electric car will be launched in premium ev segment with a hefty price tag
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X