ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు తయారీపై దృష్టి పెట్టింది. ఓలా ఎలక్ట్రిక్ తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. తొలుత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారవుతున్న కొత్త ఫ్యూచర్ ఫ్యాక్టరీలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి కూడా జరుగుతుందని మునుపటి నివేదికలు ధృవీకరించాయి. అయితే, ఓలా ఇప్పుడు తమ ఫ్యూచర్ కార్ ఫ్యాక్టరీ కోసం అనేక ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఓలా ఎలక్ట్రిక్ అతి తక్కువ సమయంలోనే భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులలో ఒకటిగా అవతరించింది. అయితే, ఇటీవలి కాలంలో ఓలా స్కూటర్‌లతో జరిగిన కొన్ని సంఘటనల వలన కంపెనీ అనేక ఎదురుదెబ్బలు మరియు కఠినమైన విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనే తమ ఉద్దేశాలను చాలా స్పష్టంగా తెలియజేసింది.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

కాగా, ఇప్పుడు ఇందుకు సంబంధించి ఓ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ పనులు ప్రారంభించింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కావల్సిన భూమి కోసం కంపెనీ వెతుకుతున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే తమిళనాడులో 500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన మెగా ఫ్యాక్టరీలో ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీలోనే ఓలా తమ ఎలక్ట్రిక్ కారును తయారు చేయవచ్చని మొదట్లో అందరూ భావించారు. అయితే, కంపెనీ ఇప్పుడు వేరే రాష్ట్రాలలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి ఓలా నుండి రాబోయే ఫ్యూచర్ ఫ్యాక్టరీ, తమిళనాడు ఫ్యాక్టరీ కన్నా మరింత పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఓలా దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో తమ ఎలక్ట్రిక్ కార్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి భూ సేకరణ కోసం ప్రస్తుతం తమిళనాడుతో పాటు మరో ఐదు రాష్ట్రాలను పరిశీలిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్లు సమాచారం.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఓలా ఎలక్ట్రిక్ బడ్జెట్ కు సరిపోయే ఆస్తుల సర్వే ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, నెల రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తన రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. జనవరి 2022లో ఓలా ఎలక్ట్రిక్ కారు యొక్క మొదటి స్కెచ్‌ను ఆ కంపెనీ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. అప్పటి నుండి, ఈ ఎలక్ట్రిక్ మార్కెట్లో చాలా హైప్‌ని సృష్టిస్తోంది.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఈ స్కెచ్ ను బట్టి చూస్తుంటే, ఓలా ఎలక్ట్రిక్ కారు చాలా ఫ్యూచరిస్టిక్ గా మరియు స్టైలిష్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇది హ్యాచ్‌బ్యాక్ రూపంలో ఎక్కువ మందికి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండేలా కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది మరియు మనదేశంలో ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యాయి మరియు కొత్తగా మరిన్ని మోడళ్లు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ప్రస్తుతం, దేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు రూ. 12 లక్షల నుండి కోటి రూపాయాలకు పైగా ఉన్నాయి. మన మార్కెట్లో ఇంకా సరసమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను రాలేదు. బహుశా సరసమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను తాకిన మొదటిది కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అవుతుందేమో. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే మంచి అనుభవం గడించిన ఓలా ఎలక్ట్రిక్, భవిష్యత్తులో తీసుకురాబోయే కారు విషయంలో తన అనుభవాన్నంతా రంగరించి, అనేక జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

ఓలా తమిళనాడులోని ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్‌ను రికార్డు సమయంలో ఏర్పాటు చేసింది. ఈ మెగా ఫ్యాక్టరీ యొక్క విస్తారమైన విస్తీర్ణం బ్రాండ్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పకనే చెబుతుంది. మరి ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓలా ఏర్పాటు చేయబోయే కొత్త ఫ్యూచర్ ఫ్యాక్టరీ కూడా అంతే వేగంగా అమల్లోకి వస్తుందో లేదో వేచి చూడాలి.

ఓలా స్కూటర్ సక్సెస్ అయింది.. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారుపై దృష్టి పెట్టిన కంపెనీ!

రూ.10,000 వరకూ పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు..

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం స్కూటర్ ఓలా ఎస్1 ప్రో ధరను దాదాపు రూ.10,000 వరకూ పెంచింది. తాజా ధరల పెరుగుదల అనంతరం మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ధర రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే ప్రయోజనాలను బట్టి, ఆయా రాష్ట్రాలలో ఈ స్కూటర్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. కాగా, ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఓలా ఎస్1 స్కూటర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఓలా ఎస్ 1 ప్రో 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Ola electric eyes to set up new future factory for its upcoming electric car
Story first published: Sunday, May 29, 2022, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X