ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో కేవలం ఒకే ఒక ఉత్పత్తితో సంచలనం సృష్టించిన దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో కూడా తన సత్తా ఏంటో చూపేందుకు సిద్దమైంది. గత కొంత కాలంగా ఓ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు దానికి సంబంధించిన మొట్టమొదటి అధికారిక టీజర్ చిత్రాలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ నుండి రాబోయే ఈ ఎలక్ట్రిక్ కారు తమిళనాడులో కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుందని సమాచారం.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

అంతకుముందు, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, ఆకాష్ తివారీ అనే ఓ ట్విట్టర్ యూజర్ ని అడ్రస్ చేస్తూ, సమీప భవిష్యత్తులో తమ కంపెనీ అభివృద్ధి చేయాలనుకుంటున్న ఎలక్ట్రిక్ కారును ప్రణాళికను సూచించాడు. అంటే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలనే ఓలా ఎలక్ట్రిక్ ప్లాన్స్ ను ఆయన స్పష్టంగా తెలియజేశారు మరియు ఈ ఎలక్ట్రిక్ కారును వీలైనంత త్వరగా భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి కంపెనీ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు ఈ స్టేట్‌మెంట్ రుజువు చేస్తోంది.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

ఓలా ఎలక్ట్రిక్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసిన టీజర్‌ ఫొటోలను చూస్తే, కంపెనీ నుండి రాబోయే ఈ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు నుండి ఏమేమి ఆశించవచ్చనే దాని గురించి ఒక స్పష్టమైన సమాచారం తెలుస్తోంది. ఈ టీజర్‌ను చూస్తుంటే, ఓలా ఎలక్ట్రిక్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు చాలా తక్కువ-స్లాంగ్‌తో, వెడల్పాటి మరియు కూప్ లాంటి రూఫ్‌లైన్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది 2-డోర్ స్పోర్ట్స్ కారు మాదిరిగా కాకుండా 4-డోర్ల సెడాన్ రూపంలో ఉంటుందని తెలుస్తోంది.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ కారులో పెద్ద బూట్ కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కారు ముందు మరియు వెనుక వెనుక భాగాలలో పూర్తి-వెడల్పుతో కూడిన ఎల్ఈడి ఉంది. అలాగే, ఓలా ఎలక్ట్రిక్ కారును సాధ్యమైనంత వరకు ఏరోడైనమిక్‌గా స్లిప్పరీగా ఉండేలా చేయడానికి కంపెనీ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇంటర్నెట్‌లో విడుదలైన టీజర్ చిత్రాలు మినహా, ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి కంపెనీ మరే ఇతర వివరాలను వెల్లడి చేయలేదు. అయితే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు తగినట్లుగా రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రియల్ టైమ్ రేంజ్ మరియు సుమారు 70kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని మేము ఆశిస్తున్నాము.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

అంతేకాకుండా, ఓలా యొక్క రాబోయే ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని మరియు కేవలం 8 సెకన్ కన్నా తక్కువ వ్యవధిలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుందని కూడా మేము ఆశిస్తున్నాము. ఓలా ఎలక్ట్రిక్ కారు రియర్ వీల్ డ్రైవ్ సెటప్ ను కలిగి ఉంటుందని అంచనా. ఇందులో ఓ ఆల్-వీల్-డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, ధరను పరిగణలోకి తీసుకుని కంపెనీ దీనిని టాప్-ఎండ్ వేరియంట్ కు మాత్రమే పరిమితం చేయడమా లేక అసలు ఆఫర్ చేయకపోవడమా అనేది వేచి చూడాలి.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ కారు యొక్క ఇంటీరియర్ వివరాలు వెల్లడి కానప్పటికీ, రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు క్యాబిన్‌ చాలా సింపుల్ గా మరియు అంతే ఫ్యూచరిస్టిక్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం ఫుల్లీ లోడెడ్ టెక్నాలజీ మరియు కొన్ని అసాధారణ డిజైన్ మెరుగులతో నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే, ఓలా ఎలక్ట్రిక్ భద్రత విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందని మరియు వినియోగదారులు NCAP రేటింగ్‌లకు తగిన మొత్తంలో శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును అత్యధిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దవచ్చని భావిస్తున్నారు.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

ఇటీవలి కాలంలో ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారులో కూడా ఇదే తరహా స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. వీటిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, పెడస్టేరియన్ రికగ్నిషన్, రోడ్ సైన్ రికగ్నిషన్ మరియు హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి సాంకేతికతలతో లెవల్-2 సెమీ-అటానమస్ డ్రైవింగ్‌ టెక్నాలజీ ఫీచర్లను ఆశించవచ్చు.

ఇదుగిదిగో ఓలా ఎలక్ట్రిక్ కార్.. మొట్టమొదటి టీజర్ చిత్రాలను ఆవిష్కరించిన కంపెనీ!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మూవ్ ఓఎస్ 2.0 (Move OS 2.0) విడుదల

ఇదిలా ఉంటే, ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కూడా కంపెనీ ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) ద్వారా ఓ కొత్త అప్‌డేటెడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ను అందుబాటులోకి తెచ్చింది. మూవ్ ఓఎస్ 2.0 పేరుతో పిలువబడే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఓలా ఎస్1 ప్రో యొక్క రైడింగ్ అనుభన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ కొత్త ఎకో మోడ్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, డిజిటల్ లాక్ / అన్‌లాక్ మరియు మ్యూజిక్ ఆన్ ది గో అనే ఐదు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేసింది. - వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ola electric teases its first electric car design and other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X