ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో తన రెండు కార్యకలాపాలను మూసివేసినట్లు ఒక సంచలన ప్రకటన చెసింది. ఎలక్ట్రిక్ వాహనరంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో పాత కార్ల బిజినెస్‌ ప్లాట్‌ఫామ్ 'ఓలా కార్స్‌'తో (Ola Cars) పాటు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన 'ఓలా డ్యాష్' (Ola Dash) ను కూడా మూసివేసినట్లు తాజాగా ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఓలా కంపెనీ దేశీయ మార్కెట్లో వివిధ రంగాలలో పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో రైడ్-షేరింగ్ (ఓలా క్యాబ్స్), యూజ్డ్ కార్లు (ఓలా కార్లు), క్విక్-కామర్స్ (ఓలా డాష్) మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్రొడక్షన్ వంటివి ఉన్నాయి. అయితే కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపైనే తన దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ కార్ యొక్క టీజర్ కూడా ఇటీవల విడుదల చేసింది.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఓలా కార్ల ప్లాట్‌ఫామ్ 8 నెలల క్రితమే ప్రారంభమైంది, అయితే ఈ బిజినెస్ ప్రారభించిన కేవలం సంవత్సరానికే నిలిపివేయడం అనేది గమనార్హం. కంపెనీ ఇప్పటికే ఓలా కేఫ్, ఫుడ్ పాండా మరియు ఓలా ఫుడ్స్ వంటివి పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు ఈ జాబితాలో ఓలా డ్యాష్‌ మరియు ఓలా కార్స్‌ కూడా చేరాయి.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఓలా కార్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, కేపబిలిటీస్‌ అనేవి ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ & సర్వీస్ నెట్‌వర్క్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించనున్నామని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క క్విక్ కామర్స్ మార్కెట్ 2025 నాటికి 15 రెట్లు వృద్ధిని నమోదు చేయనున్న సమయంలో ఓలా డ్యాష్‌ని కంపెనీ నిలిపివేసింది.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించడం వల్ల, ఇప్పుడు ఈ రంగం వైపే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటోంది మరియు ఆరంగంలోనే తన ఉత్పత్తులను వేగవంతం చేస్తోంది. రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని ఓలా ఎలక్ట్రిక్ శాశించే అవకాశం ఉంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఇదిలా ఉండగా కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన విజయాన్ని తీసుకురావడం వల్ల, త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున దేశీయ విఫణిలో ఓలా ఎలక్ట్రిక్ యొక్క మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే నెల ఆగస్టు 15 న వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు 2023 నాటికి మార్కెట్లో విక్రయానికి సిద్దమవుతాయి. మొత్తానికి వచ్చే సంవత్సరానికి ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లో వినియోగదారులకు అందించనుంది.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మరిన్ని రంగాలలో ముందుకు వెళ్ళడానికి ఇటీవల స్టోర్‌డాట్‌లో కూడా పెట్టుబడి పెట్టింది. ఇది ఇజ్రాయెల్ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ, ఇది ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో బ్యాటరీలలో అగ్రగామిగా ఉంది. కంపెనీ ఇందులో పెట్టుబడులు పెట్టడం అనేది రానున్న రోజుల్లో తన ఎలక్ట్రిక్ వాహనాలను పటిష్టంగా తయారు చేయడానికి అని తెలుస్తోంది.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారతీయ మార్కెట్ కోసం విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క మొట్టమొదటి టీజర్ ఫోటోలను అధికారికంగా విడుదల చేసింది. రానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు తమిళనాడులో కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీలో తయారు చేయబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ సీఈఓ అధికారికంగా వెల్లడించాడు.

ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఓలా కార్స్‌ (Ola Cars) మరియు ఓలా డ్యాష్ (Ola Dash) నిలిపివేయడం అనేది కొత్త ప్లాట్‌ఫామ్ లో అడుపెట్టానికి సంకేతం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలు మరి కొద్దీ రోజుల్లోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంటుంది. అప్పటివరకు మరింత అప్డేటెడ్ సమాచారం కోసం మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ola plans to shut down ola cars and ola dash business reason details
Story first published: Wednesday, June 29, 2022, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X