భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది. దీనికి కారణం నిరంతరం పెరుగుదల దిశగా పెరుగుతున్న ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు కావచ్చు, లేదా ఆధునిక కాలంలో ఆధునిక వాహనాలను వినియోగించడానికి ఇష్టపడటం కూడా కావచ్చు. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లోని వాహన తయారీసంస్థలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల తయారీ సంస్థ 'ఒమేగా సెకీ మొబిలిటీ' (Omega Seiki Mobility) మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఒమేగా మొబిలిటీ కంపెనీ 'ఒమేగా స్ట్రీమ్' (Omega Stream) అనే ప్యాసినజర్ ఎలక్ట్రిక్ రిక్షా లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ రిక్షా ధర రూ. 3.40 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ ఎలక్ట్రిక్ రిక్షా కొనుగోలుపైన గవర్నమెంట్ సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది. కావున దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఒమేగా స్ట్రీమ్ ఎలక్ట్రిక్ రిక్షా ఆధునిక డిజైన్ కలిగి అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది. ఇది డీజిల్ రిక్షాలకంటే కూడా ఎక్కువ పరిధిని అందిన్చడమే కాకుండా నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కావున ఈ ఎలక్ట్రిక్ రిక్షా కొనుగోలుదారులు డీజిల్ రిక్షకంటే కూడా 25 శాతం నుంచి 30 శాతం వరకు లాభాన్ని పొందవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఒమేగా స్ట్రీమ్ ఎలక్ట్రిక్ రిక్షా ఐపి65 రేటెడ్ 8.5 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 10కిలోవాట్ పవర్ మరియు 535 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఈ రిక్షా యొక్క బ్యాటరీ 16 యాంపియర్ సాకెట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా పుల్ ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. కావున ఛార్జింగ్ టైమ్ గురించి కూడా కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది రేంజ్ (పరిధి). 'ఒమేగా స్ట్రీమ్' (Omega Stream) ఎలక్ట్రిక్ రిక్షా ఒక పుల్ ఛార్జ్ తో ఏకంగా 110 కిమీ పరిధి అందిస్తుంది. భారతదేశంలోని రోడ్లపైన ప్రయాణించడానికి మరింత అనుకూలంగా ఉండేలా చేయడానికి కంపెనీ ఇందులో 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అందించింది. కావున ఎలాంటి రోడ్డుపై అయినా సజావుగా ముందుకు సాగవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఈ రిక్షా ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ఇందులో ఇంజిన్ లేదు. కావున ఎటువంటి సౌండ్ రాదు. అంతే కాకుండా.. ఎలాంటి కర్బనాలను గాలిలోకి విడుదల చేసే అవకాశం అసలు లేదు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. కావున ఇది తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంది అని ఆశిస్తున్నాము.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

ఒమేగా మొబిలిటీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. సంవత్సరానికి 35,000 నుంచి 40,000 యూనిట్ల స్ట్రీమ్ ఎలక్ట్రిక్ రిక్షాలను అమ్మడానికి లక్ష్యం ఏర్పాటు చేసుకుంద. డీన్ ప్రకారం కంపెనీ అటువైపుగానే అడుగులు వేస్తోంది. ఇందులో 60 శాతం దేశీయ మార్కెట్లో విక్రయించాలని, 40 శాతం ఎగుమతి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

కంపెనీ ఆసియన్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ రిక్షా భారత మార్కెట్లోని పియాజియో ఏప్ ఇసిటీ మరియు మహీంద్రా ట్రియో వంటి ఎలక్ట్రిక్ రిక్షాలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

అంతే కాకుండా కంపెనీ తన కొనుగోలుదారులకు సులభమైన ఫైనాన్స్ ఎంపికలను అందించడానికి బ్యాంకులు మరియు NBFCలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పాటు కంపెనీ యొక్క అంతర్గత ఫైనాన్సింగ్ విభాగం అయిన 'ఆంగ్లియన్ ఫిన్వెస్ట్' ద్వారా కూడా వీటిని సులభంగా పొందవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఒమేగా స్ట్రీమ్' ఎలక్ట్రిక్ రిక్షా.. ధర రూ. 3.40 లక్షలు

'ఒమేగా సెకీ మొబిలిటీ' (Omega Seiki Mobility) భారతీయ మార్కెట్లో త్వరలోనే ఎలక్ట్రిక్ ట్రక్కును కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల తన ఎలక్ట్రిక్ ట్రక్కు యొక్క రోడ్ టెస్టింగ్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు లైట్ వెయిట్ మరియు భారీ వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మాడ్యులర్ ఈవి ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయి. కావున భారతీయ మార్కెట్లో వీటిని సులభముగా వినియోగించుకోవచ్చు. కంపెనీ రానున్న రోజుల్లో తన ఎలక్ట్రిక్ ట్రక్కులను విడుదల చేస్తే మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Omega stream electric passenger three wheeler launched price range details
Story first published: Monday, June 13, 2022, 9:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X