మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

2020 టోక్యో పారాలింపిక్స్‌లో అద్భుతమై ప్రతిభను చూపించిన భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం పతకం చేర్చిన మహిళా షూటర్‌ అవని లేఖారా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈ ఘనత సాధించిన ఒక కొత్త రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించింది. ఇంతటి కొప్పు విజయాన్ని పొందిన 'అవని లేఖారా' కి Mahindra And Mahindra కంపెనీ చైర్మన్ Anand Mahindra ఒక XUV700 గోల్డ్ ఎడిషన్‌ అందిస్తామని అప్పట్లోనే వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు మహీంద్రా చెప్పిన మాట నిలబెట్టుకున్నారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

ఇప్పటివరకు చాలా మంది ఆటగాళ్లకు ఈ XUV700 గోల్డ్ ఎడిషన్‌ SUV అందించబడింది. ఇటీవల, పారాలింపియన్ 'అవనీ లేఖరా' కి కూడా ఈ XUV700 యొక్క గోల్డ్ ఎడిషన్‌ అందించారు. అయితే ఈ ఎడిషన్ తన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడింది. కావున వారి యొక్క వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

అవనీ లేఖ పొందిన XUV700 గోల్డ్ ఎడిషన్, టాప్ స్పెక్ AX7 L వేరియంట్, ఇందులో కస్టమైజ్డ్ ఫ్రంట్ సీట్‌ ఉంటుంది. ఇది కారు నుండి బయకు రావడానికి కూడా అనుకూలంగా తయారుచేయబడింది. వీల్‌చైర్‌లో నిటారుగా కూర్చోవడం సులభం చేస్తుంది. ఇంటీరియర్‌లు బంగారు కలర్ లో ఉండటమే కాకూండా, ఈ కొత్త SUV మొత్తం బ్లాక్ పెయింట్‌ను పొందుతుంది. ఈ విషయాన్నీ అవని లేఖరా కూడా తెలిపింది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

ఈ SUV లో ప్లేయర్ యొక్క విభాగం మరియు క్రీడ దాని ఫ్రంట్ ఫెండర్ యొక్క బ్యాడ్జ్‌లో చూడవచ్చు. ఈ కారణంగానే ఈ SUVలో SH1-10 మీ ఎయిర్ రైఫిల్ అని వ్రాయబడింది. ఈ రకమైన ప్రత్యేకమైన వాహనం మొదటి సారి తాయారు చేసింది. ఇందులోని ప్రత్యేకమైన సీటు ముందుకు మరియు వెనుకకు కదలడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

అంతే కాకుండా ఇది క్రిందికి కూడా వంగి ఉంటుంది, దీని కారణంగా ముందు ప్రయాణీకుడు కూడా బయటకు రావడం చాలా సులభంగా ఉంటుంది. ఈ కారును మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ డిజైన్ చేశారు. ఇప్పటికే ఈ గోల్డ్ ఎడిషన్ కొంతమంది ఆటగాళ్లకు అందించడం జరిగింది. ఇందులో భాగంగానే సుమిత్ యాంటిల్‌కు కూడా ఈ గోల్డ్ ఎడిషన్ ఇవ్వబడింది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

సుమిత్ యాంటిల్‌ పొందిన ఈ గోల్డ్ ఎడిషన్ లో ఫ్రంట్ గ్రిల్, గోల్డ్ కలర్ లో కొత్త మహీంద్రా లోగో మరియు సీటు, IP ప్యానెల్‌లపై గోల్డ్ యాక్సెంట్స్ కూడా చూడవచ్చు. మహీంద్రా XUV700 స్మార్ట్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉన్న విభాగంలో మొదటి SUV. హ్యాండిల్ బయట తెరుచుకుంటుంది మరియు కేవలం ఒక టచ్ తో లోపల మూసివేయబడుతుంది. ప్రస్తుతం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ డోర్ హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

XUV700 వ్యక్తిగతీకరించిన వాయిస్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. సాధారణ వార్ణింగ్ సిస్టం కంటే కంటే వ్యక్తిగత హెచ్చరిక వ్యవస్థలు మరింత ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. కావున ప్రమాదాలు జరిగే అవకాసం చాలా తక్కువగా ఉంటుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

మహీంద్రా XUV700 కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌లను కూడా అందిస్తోంది, ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ డ్రైనెస్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి. SUV గంటకు 80 కిమీ వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. చీకటి రోడ్లలో మరింత కాంతిని అందించడం ద్వారా రాత్రిపూట మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

Mahindra XUV700 SUV లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి ఉన్నాయి.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: అవని లేఖారా ని చేరిన XUV700 గోల్డ్ ఎడిషన్

మహీంద్రా XUV700 లో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్. దీని పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చైనా డీజిల్ ఇంజిన్ 185 బిహెచ్‌పి పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.

Mahindra XUV700 లో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Most Read Articles

English summary
Paralympian avani lekhra gets customised mahindra xuv700 gold edition details
Story first published: Friday, January 21, 2022, 7:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X