ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

భారతీయులకు ఈ పండుగ సీజన్ చాలా సెంటిమెంట్‌తో కూడుకున్నది. అందుకే, చాలా మంది ఈ పండుగ సీజన్‌లో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో ఓ కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు వెచ్చించే ధరకు తగిన విలువను అందించే టాప్ 5 కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara)

మారుతి సుజుకి నుండి మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మొట్టమొదటిసారిగా వచ్చిన ఎస్‌యూవీ గ్రాండ్ విటారా. అంతేకాదు, ఇది దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి స్ట్రాంగ్-హైబ్రిడ్ ఎస్‌యూవీ. జపనీస్ కంపెనీ టొయోటా భాగస్వామ్యంతో మారుతి సుజుకి ఈ కారుని అభివృద్ధి చేసింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే, ఈ కారుని ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన అవసరం లేదు.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారా లీటరు పెట్రోల్ పై గరిష్టంగా 27 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కాకుండా ఇందులో మైల్డ్ హైబ్రిడ్ సెటప్ కూడా ఉంది. మార్కెట్లో గ్రాండ్ విటారా ధరలు రూ.10.45 లక్షల నుండి రూ.19.49 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

గ్రాండ్ విటారాలో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పానోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఫుల్-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్ మరియు ఎత్తు-సర్దుబాటు డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Hyryder)

గ్రాండ్ విటారా మాదిరిగానే టొయోటా కూడా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పేరుతో ఓ హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. గ్రాండ్ విటారా మరియు హైరైడర్ రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయబడ్డాయి. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించే విడిభాగాలు మరియు ఫీచర్లు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది. టొయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ హైరైడర్ ధరలు గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరల కన్నా తక్కువగా ఉంటాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

ప్రస్తుతం, మార్కెట్లో టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క బేస్ వేరియంట్ (ఇ, మైల్డ్-హైబ్రిడ్) ధరలు రూ.10.48 లక్షలు కాగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర (వి, స్ట్రాంగ్-హైబ్రిడ్) రూ.18.99 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రెండూ కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తాయి. కాకపోతే, ఇవి మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి రెండు కొత్త మోడళ్లు కావడంతో, వీటి వెయిటింగ్ పీరియడ్ కూడా కాస్తంత అధికంగానే ఉంటుంది.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

హైరైడర్ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ వీల్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి, ఏబిఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు పార్కింగ్ సెన్సార్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

కియా కారెన్స్ (Kia Carens)

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ అందిస్తున్న లేటెస్ట్ ఎమ్‌పివి కియా కారెన్స్. సెల్టోస్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన కియా కారెన్స్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 7-సీటర్ ఎమ్‌పివి. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండే ఈ 7-సీటర్ కారులో కంపెనీ అనేక ఫీచర్లను అందిస్తోంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది కేవలం రూ.8.99 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదలైంది. అయితే, కియా ఈ మోడల్ మార్కెట్లో విడుదల చేసిన ఆరు వారాలకే దాని ప్రారంభ ధరను రూ.9.59 లక్షలకు పెంచింది.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

అధిక డిమాండ్ కారణంగా ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ 75 వారాల వరకూ ఉన్నట్లు సమాచారం. కియా కారెన్స్ ఎమ్‌పివిలోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

అంతేకాకుండా, ఈ కారులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి స్మార్ట్ ఫీచర్లు మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా నుండి మార్కెట్లోకి వచ్చిన అధునాతన ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్. లేటెస్ట్ డిజైన్ మరియు లగ్జరీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. కొత్త తరం స్కార్పియో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మార్కెట్లో కొత్త తరం స్కార్పియో-ఎన్ ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 19.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

మహీంద్రా స్కార్పియో-ఎన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్సన్లలో లభిస్తుంది. ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)

ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా పాత మోడలే అయినప్పటికీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఈ మోడల్ ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతోంది. హ్యుందాయ్ క్రెటా ఖచ్చితంగా ధరకు తగిన విలువను అందిస్తుందని చెప్పవచ్చు. ఈ కారు యొక్క ఎంట్రీ-లెవల్ వేరియంట్, EX కూడా కావల్సిన అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది రెండు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. దీని పెట్రోల్ ఆప్షన్ రూ. 11.38 లక్షలు మరియు డీజిల్ ఆప్షన్ ధర రూ. 12.32 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

ఈ దీపావళికి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ధరకు తగిన విలువను అందించే ఈ టాప్ 5 కార్లను చూడండి..

హ్యుందాయ్ క్రెటాలో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, రిమోట్ లాకింగ్, పవర్ విండోస్, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిరర్ర్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కంపెనీ ఇటీవలే ఇందులో క్రెటా ఎన్-లైన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. క్రెటా ఎన్ లైన్‌ లోని ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 360 డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Planing to buy a car during this festive season here is the top 5 value for money cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X