భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

భారతదేశంలో ఆల్-టెర్రైన్ వాహనాలను విక్రయిస్తున్న ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ పోలారిస్ (Polaris), దేశీయ మార్కెట్లో మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. పొలారిస్ ఇండియా, భారత మార్కెట్లో తమ కొత్త ఆల్-టెర్రైన్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) మోడల్ ను విడుదల చేసింది. ఈ వాహనం చూడటానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ, భారత మార్కెట్లో దీని ధర రూ. 59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ ఆల్-టెర్రైన్ వాహనం ప్రత్యేకంచి ఆఫ్-రోడింగ్ డ్రైవ్‌ల కోసం రూపొందించబడింది.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పొలారిస్ విజయవాడ డీలర్‌షిప్ హెడ్ ప్రకాశరావు వాహనం యొక్క మొదటి యూనిట్‌ను దాని యజమానికి అందజేశారు. ఇదొక ఫోర్-వీల్ డ్రైవ్ ఆల్-టెర్రైన్ వెహికల్. రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ 1,880 మిమీ పొడవును మరియు 406 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ డ్రైవ్‌ను ఇష్టపడే వ్యక్తుల కోసం తయారు చేయబడింది. దీనిని పర్వతాలు మరియు రాళ్ళతో నిండిన రోడ్లపై, అలాగే మంచు ప్రాంతాలలో నడపవచ్చు.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (Polaris RZR Pro R Sport) ఆల్-టెర్రైన్ వెహికల్ చాలా శక్తివంతమైన ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇందులో 2 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 222 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ లాక్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌ లను కూడా ఉంటుంది. ఇదొక టూ-సీటర్ వెహికల్, ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. చూడటానికి చాలా ఫంకీగా కనిపించే ఈ ఏటివి (ఆల్-టెర్రైన్-వెహికల్) ని నడపడం ద్వారా కస్టమర్లు కొత్త సాహసాన్ని అనుభవిస్తారని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పోలారిస్ ఇండియా ఇప్పటికే భారతదేశంలో ఐదు ఇతర ఆల్-టెర్రైన్ వాహనాలను కూడా విక్రయిస్తోంది. వాటి డిజైన్ మరియు ఫీచర్లను బట్టి, ఇవి వేర్వేరు విభాగాలలో ఉపయోగించబడుతాయి. ఈ ఐదు పోలారిస్ ఏటివి మోడళ్లలో రేజర్ (RZR), రేంజర్ (Ranger), జనరల్ (General), స్పోర్ట్స్‌మ్యాన్ (Sportsman), యూత్ (Youth) మోడళ్లు ఉన్నాయి. వీటిలో రేజర్ కొత్తగా వచ్చిన రేజర్ ఆర్ స్పోర్ట్ మోడల్ యొక్క లో-ఎండ్ వెర్షన్ గా ఉంటుంది. ఇది కూడా బహుళ ఆఫ్-రోడ్ ప్రయోజనాలను ఉద్దేశించి డిజైన్ చేయబడింది.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇకపోతే, పోలాసిర్ రేంజర్ అగ్రికల్చర్ మరియు గోల్ఫ్ కార్ట్ వంటి ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినది. ఇందులో వెనుక భాగంలో పికప్ బెడ్ కూడా ఉంటుంది, యూజర్లు అందులో కొంత సమానును రవాణా చేసే అవకాశం ఉంటుంది. ఫోర్డ్ జనరల్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ కోసం ఉద్దేశించబడిన ఆల్-టెర్రైన్ వాహనం. ఇది ఎలాంటి రోడ్లపై అయినా ముందుకు సాగిపోతుంది మరియు ఇందులో మీ క్యాంపింగ్ ఎక్విప్‌మెంట్ ను స్టోర్ చేసుకోవడానికి, వెనుక భాగంలో చిన్నపాటి పికప్ బెడ్ కూడా ఉంటుంది.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పోలారిస్ స్పోర్ట్స్‌మ్యాన్ అనేది మోటార్‌సైకిల్ లాంటి హ్యాండ్లింగ్ ను కలిగి ఉండే ఆల్-టెర్రైన్ వాహనం. ఇది ప్రత్యేకించి ఆఫ్-రోడ్ మోటార్‌స్పోర్ట్ లు మరియు అడ్వెంచర్ రైడ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇక పోలారిస్ అందిస్తున్న చివరి ఆల్-టెర్రైన్ వాహనం పోలారిస్ యూత్. పేరుకి తగినట్లుగానే ఇది యువత కోసం ప్రత్యేకంగా ఆధునిక టెక్నాలజీ మరియు అత్యుత్తమ సేఫ్టీతో రూపొందించబడిన ఏటివి. ఆఫ్-రోడ్ మోటార్‌స్పోర్ట్ లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పొలారిస్ ఇండియా అనేది అమెరికన్ ఆటోమోటివ్ తయారీదారు పొలారిస్ ఇండస్ట్రీస్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ. ఈ కంపెనీ భారతదేశంలో ఆల్ టెర్రైన్ వెహికల్స్ (ATV) తో సహా అధిక నాణ్యత గల ఆఫ్-రోడ్ వెహికల్స్ (ORV) ను కూడా తయారు చేస్తుంది. దేశీయ మార్కెట్లో కొత్త రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ లాంచ్‌ గురించి పొలారిస్ ఇండియా సేల్స్ హెడ్ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "భారతదేశం కోసం సరికొత్త రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామని, ఈ రోజు తమ మొదటి డెలివరీ మార్కెట్ సామర్థ్యాన్ని నిర్ధారిస్తుందని మరియు తాము తమ ప్రపంచ స్థాయి ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ వాహనంతో భారత మార్కెట్‌కు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని" చెప్పారు.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పెట్రోలింగ్‌ కోసం ఉపయోగించబడుతున్న పోలారిస్ ఏటివిలు

భారతదేశంలో పోలారిస్ ఏటివి (ఆల్ టెర్రైన్ వాహనాల) ను కేవలం ఆఫ్-రోడ్ మోటార్‌స్పోర్ట్స్ మరియు సరదా అడ్వెంచర్ రైడ్స్ కోసం మాత్రమే కాకుండా, పోలీసులు పెట్రోలింగ్ వాహనంగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. గత సంవత్సరం, రిలయన్స్ ఫౌండేషన్ 10 అత్యాధునిక ఆల్-టెర్రైన్ పొలారిస్ వాహనాలను ముంబై పోలీసులకు విరాళంగా ఇచ్చింది. మన దేశమే కాకుండా అనేక ఇతర దేశాల పోలీసులు తమ తమ పెట్రోలింగ్ వాహనాలలో పొలారిస్ యొక్క ఆఫ్-రోడ్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ (RZR Pro R Sport) విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పొలారిస్ ఆల్-టెర్రైన్ వెహికల్స్ (ATVలు) 2-అంగుళాల ఎల్‌సిడి రైడర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, సీట్‌బెల్ట్ రిమైండర్ లైట్ మరియు సింగిల్ అనలాగ్ డయల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. తీరప్రాంతాలను పర్యవేక్షించేందుకు గుజరాత్ పోలీసులు 2013 నుంచి పొలారిస్ ఆల్-టెర్రైన్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. గుజరాత్ పోలీసులు పెట్రోలింగ్ కోసం Polaris RZR S 800 ATVని ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
Polaris india launches rzr pro r sport price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X