భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్ష్ (Porsche), భారత మార్కెట్లో మరో సరికొత్త కారును విడుదల చేసింది. దేశీయ విపణిలో కంపెనీ విడుదల చేసిన పోర్ష్ 718 కేమాన్ జిటి4 ఆర్ఎస్ (Porsche 718 Cayman GT4 RS) ధర రూ. 2.54 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కొత్త GT4 RS ఇప్పటి వరకు ఉన్న పోర్ష్ మిడ్-ఇంజన్ 718 కేమాన్ స్పోర్ట్స్ కారులో అత్యంత హార్డ్‌కోర్ వెర్షన్ గా ఉంటుంది. ఇదొక 2-సీటర్ స్పోర్ట్స్ కార్ మరియు కేవలం కూప్ బాడీ స్టైల్‌లో మాత్రమే అందించబడుతుంది.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

డిజైన్ విషయానికి వస్తే, పోర్ష్ 718 కేమాన్ జిటి4 ఆర్ఎస్ డ్యూయెల్ టోన్ హుడ్, ఫెండర్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఫ్రంట్ లిప్ డిఫ్యూజర్ మరియు పెద్ద రియర్ స్పాయిలర్ వంటి అదనపు ఏరోడైనమిక్ మరియు కూలింగ్ బిట్‌లతో మంచి అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంటుంది. అన్ని లైట్లు ఎల్ఈడి రూపంలో ఉంటాయి. కారు బరువును స్టాండర్డ్ మోడల్ కన్నా తక్కువహా ఉంచేందుకు ఇందులో ఎక్కువ భాగం కార్భన్ ఫైబర్ భాగాలను ఉపయోగించారు. ఫలితంగా, ఇది 35 కిలోలు తేలికైనదిగా ఉంటుంది.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

పోర్ష్ 718 కేమాన్ జిటి4 ఆర్ఎస్ లో కొత్త 911 జిటి3 లో ఉపయోగించిన 4.0 లీటర్ ఇంజన్ నే ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్ ను రీట్యూన్ చేయబడింది. ఇందులోని ఫ్లాట్-సిక్స్ సిలిండర్ ఇంజన్ 8,400 ఆర్‌పిఎమ్ వద్ద 496 బిహెచ్‌పి శక్తిని మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ జిటి4 వెర్షన్ కారుతో పోలిస్తే, ఈ కొత్త కేమాన్ జిటి4 ఆర్ఎస్ అదనంగా 79 బిహెచ్‌పి శక్తిని మరియు 20 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ (PDK) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Porsche 718 Cayman GT4 RS కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 వేగంతో పరుగులు తీస్తుంది. దీని టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 315 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇంటీరియర్స్ లో 18 రకాలుగా సర్దుబాటు చేయగల రెండు విలాసవంతమైన బకెట్ సీట్లు, డ్యూయెల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాపిల్ కార్‌ప్లే ఎనేబుల్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.6 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

కొత్త Porsche 718 Cayman GT4 RS వాలుగా ఉండే రూఫ్‌లైన్, కార్బన్ ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడిన మజిక్యులర్ బానెట్, పెద్ద ఎయిర్ వెంట్‌లు, సర్దుబాటు చేయగల ఫ్రంట్ డిఫ్యూజర్ మరియు స్వెప్ట్-బ్యాక్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. సైడ్స్ లో డోర్-మౌంటెడ్ సైడ్ మిర్రర్స్, ఎయిర్ స్కూప్‌లు మరియు డిజైనర్ మల్టీ-స్పోక్ వీల్స్‌ కనిపిస్తాయి. వెనుక బాగంలో స్వాన్-నెక్డ్ వింగ్, లైట్ విండ్‌స్క్రీన్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు మరియు డ్యూయల్ సర్క్యులర్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉంటాయి.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

ఇంకా ఇందులో బకెట్ సీట్లు, ఎయిర్ ఫిల్టర్, విలాసవంతమైన క్యాబిన్‌, కార్బన్ ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (CFRP), 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ప్రయాణీకుల భద్రత కోసం బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం ప్రత్యేకమైన కస్టమైజేషన్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. వీటి సాయంతో యజమానులు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

రూ. 32 లక్షలతో వీసాచ్ ప్యాకేజ్, రూ. 20 లక్షలకు ఏదైనా కస్టమ్ ఎక్స్టీరియర్ కలర్, రూ. 30 లక్షలకు మెగ్నీషియం వీల్స్, రూ. 30 లక్షలకు సిరామిక్ బ్రేక్‌లు వంటి కాస్మెటిక్ మరియు పెర్ఫార్మెన్స్ ఆధారిత కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా అందిస్తున్నారు. అలాగే, లక్ష రూపాయలకు లైవ్ టీవీ సదుపాయం మరియు రూ. 2.4 లక్షలకు బోస్ సౌండ్ సిస్టమ్ వంటి అదనపు యాక్ససరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీసాచ్ ప్యాకేజీ టైటానియం రోల్ కేజ్‌ను కూడా లభిస్తుంది. హార్డ్‌కోర్ వీసాచ్ ప్యాకేజీలో సాధారణ అల్యూమినియం యూనిట్‌లకు బదులుగా తేలికపాటి 20 ఇంచ్ మెగ్నీషియం వీల్స్ లభిస్తాయి.

భారత మార్కెట్లో Porsche 718 Cayman GT4 RS విడుదల.. ధర జస్ట్ రూ.2.54 కోట్లు మాత్రమే..

పోర్ష్ తమ కొత్త GT4 RS యొక్క ఏరోడైనమిక్ ప్రొఫైల్‌లో చేసిన మార్పుల కారణంగా ఇది స్టాండర్డ్ GT4 మోడల్ తో పోలిస్తే 25 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ ని ఉత్పత్తి చేస్తుంది. పోర్ష్ కేమాన్ జి ఆర్ఎస్ మోడల్ యొక్క పనితీరును మెరుగుపరచేందుకు కంపెనీ దీని ఛాసిస్ లో కూడా కొన్ని ట్వీక్‌ లను చేసింది. సర్దుబాటు చేయగల మరియు సర్క్యూట్-సిద్ధంగా ఉండే ఈ ఛాస్సిస్ RS-నిర్దిష్ట షాక్ అబ్జార్బర్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే, సవరించిన స్ప్రింగ్ మరియు యాంటీ-రోల్ బార్ రేట్లను కలిగి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Porsche india launches 718 cayman gt4 rs price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X