మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'హ్యుందాయ్' (Hyundai). హ్యుందాయ్ కంపెనీ గత ఏడాది కొత్త అల్కాజర్‌ విడుదల చేసింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలతో ముందుకెళ్లిన ఈ కారుకి సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఇందులో అల్కాజర్‌ డ్రైవర్ గా షారూఖ్ ఖాన్ ఉన్నాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

'హ్యుందాయ్ మోటార్ ఇండియా' విడుదల చేసిన ఈ వీడియోలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ మరియు భారతీయ మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, తానియా భాటియా మరియు షఫాలీ వెర్నా ఉన్నారు. ఒకప్పటి నుంచి కూడా హ్యుందాయ్ కంపెనీతో షారుఖ్ ఖాన్ కి అనుభందం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ కూడా చేరారు. షారూఖ్ ఖాన్ హ్యుందాయ్ కంపెనీ యొక్క మొదటి తరం హ్యుందాయ్ శాంట్రో రోజుల నుండి కంపెనీతో కొనసాగుతున్నాడు.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

హ్యుందాయ్ ఇండియా తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని 2021 లో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీమంచి డిజైన్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందుతోంది.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

ఈ కొత్త ఎస్‌యూవీ స్ప్లిట్-స్టైల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, 3 డి హనీకూంబ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్, ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్, 17 మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఫ్లక్స్ స్కఫ్ ప్లేట్, షార్క్ పిన్ వంటి వాటిని కలిగి ఉంది.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో 10.25 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ కమాండర్, త్రీ రో ఎసి వెంట్స్, బ్లైండ్ విండో మానిటర్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి వాటితోపాటు, సీట్ బెల్ట్, ఆటో ఎయిర్ ప్యూరిఫైయర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంది.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్. డ్యూయల్-టోన్ సిగ్నేచర్ వేరియంట్‌, ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు టైటాన్ గ్రేతో మాత్రమే లభిస్తుంది, అయితే సిగ్నేచర్ (ఓ) డ్యూయల్ టోన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. పోలార్ వైట్ విత్ బ్లాక్ ఫాంటమ్ రూఫ్ మరియు టైటాన్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ రూప్.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ ప్రెస్టీజ్, ప్రీమియం మరియు సిగ్నేటర్ అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. ఈ ఎస్‌యూవీని ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌కి విడుదల చేయగా, దాని టాప్ మోడల్ ధరను ఎక్స్‌షోరూమ్‌గా రూ. 20.14 లక్షల వద్ద ఉంచారు.

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్.

మహిళా క్రికెటర్స్ డ్రైవర్‌గా 'షారుఖ్ ఖాన్'.. ఎందుకో వీడియో చూడాల్సిందే

తాజాగా, హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీ కోసం అఫీషియల్ యాక్ససరీ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజీలతో పాటుగా, కంపెనీ ఇతర రిటైల్ యాక్ససరీస్ వివరాలను కూడా వెల్లడి చేసింది. ఈ యాక్ససరీ ప్యాక్‌లలో మొత్తం నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. అవి: డార్క్ ప్యాక్, సుప్రీం ప్యాక్, మెజెస్టిక్ ప్యాక్ మరియు ఎలివేట్ ప్యాక్. ఇవన్నీ కూడా వాహనాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.

Most Read Articles

English summary
Shahrukh khan and women cricket team players in hyundai alcazar tvc details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X