6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు రోజురోజుకి మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్యను చాలా వరకు తగ్గించడం. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త మరియు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారై సంఖ్యను తప్పకుండా తగ్గిస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, ప్యాసింజర్ కార్లలో తప్పకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని గురించి చాలా సార్లు ప్రస్తావించింది. అయితే ఈ నిబంధన తప్పకుండా అమలులోకి తీసుకురావడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే అన్ని ప్యాసింజర్ కార్లను 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందించడానికి కొంత సమయం పడుతుంది. కావున కేంద్ర తప్పకుండా 2023 అక్టోబర్ నాటికి ఇది అమలు కావాలంటూ నిర్ణయించింది.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

2023 అక్టోబర్ నుంచి అన్ని ప్యాసింజర్ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి మరియు ఉంటాయి. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఇందులో భాగంగానే వాహనాల్లో ప్రయాణించేవారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా గతంలో తెలియజేసారు.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎక్కువమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల రక్షణకు పెద్ద పీట వేయడానికి కార్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలి అని ఆదేశించింది.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

రోడ్డు ప్రమాదల్లో ఎక్కువమంది మరణించడానికి కారణం ఎక్కువ సంఖ్యలో ఎయిర్ బ్యాగులు లేకపోవడమే. కావున వాహన తయారు సంస్థలు కూడా తమ వాహనాల్లో తప్పకుండా ఆరు ఎయిర్ బ్యాగులను అందించాలి. ఈ ఆరు ఎయిర్‌బ్యాగుల్లో రెండు ఫ్రంట్, రెండు షోల్డర్ మరియు రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

అన్ని ప్యాసింజర్ వాహనాల్లో తప్పకుండా 6 ఎయిర్ బ్యాగులు అమలులోకి వస్తే తప్పకుండా రోడ్డు ప్రమాదాల్లో మరణాలరేటు తగ్గుతుంది. ఇప్పుడు తెరపైకి వచ్చిన ఈ ఎయిర్‌బ్యాగుల నిబంధన అన్ని కార్లకు వర్తిస్తుంది. అంటే ఇందులో చిన్న కార్ల దగ్గర నుంచి 6 సీటర్ మరియు 7 సీటర్ కార్ల వరకు ఉంటాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న చాలా ప్యాసింజర్ కార్లలో కేవలం 2 ఎయిర్ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆధునిక లగ్జరీ కార్లలో ఇప్పుడు కూడా ఎక్కువ ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. కానీ 2023 అక్టోబర్ నాటికి అన్ని కార్లలో తప్పకుండా 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో అందుబాటులో ఉన్న కార్లలో చాలా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికి కూడా అన్ని కార్లలోనూ అన్ని సేఫ్టీ ఫీచర్స్ అందించడం లేదు. ఎక్కువ ఖరీదైన కార్లలో మాత్రమే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ విధానానికి ఇక మంగళం పాడే సమయం వచ్చేసింది.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

2020 విడుదలైన ఒక నివేదిక ప్రకారం కారులో ఎయిర్‌బ్యాగ్స్ లేకపోవడంతో వల్ల ఏకంగా 13,022 మంది మరణించారని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కూడా సైడ్‌ ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం కారణంగా 4,424 మంది మరణించారు. ఈ కేసులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి అని కేంద్రం నిర్ణయించింది.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

అయితే కార్ కంపెనీలు వెల్లడించిన సమాచారం ప్రకారం, అన్ని కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులను ప్రవేశపెడితే తప్పకుండా ధరలు పెరుగుతాయని తెలిపాయి. ఈ కారణంగా చాలా వరకు దేశీయ మార్కెట్లో కార్ల ధరలు పెరుగుతాయి. సుమారు ఇప్పుడున్న ధరలకంటే కూడా రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించాయి.

6 ఎయిర్‌బ్యాగ్‌ల నిర్ణయంలో తగ్గేదేలే అంటున్న కేంద్రం.. అప్పటి నుంచి తప్పనిసరిగా అమలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎయిర్‌బ్యాగ్స్ అనేవి ప్రమాదంలో ప్రయాణికులను కాపాడే రక్షణ కవచాలు. కావున కారులో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉంటే ప్రమాదంలో మరణించేవారు సంఖ్య తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా చాలా ఉపయోగకరమైన నిబంధన. అయితే కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాహన తయారీ సంస్థలు ఏ విధంగా స్వాగతిస్తాయో తెలియాల్సి ఉంది.

Most Read Articles

English summary
Six airbags mandatory in cars from 2023 october 1st says nitin gadkari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X