స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో భారత మార్కెట్లో విక్రయిస్తున్న సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ (Skoda Kushaq) లో కంపెనీ రెండు కొత్త వేరియంట్‌లను పరిచయం చేసింది. ఇందులో ఓ కొత్త బేస్ వేరియంట్‌ కూడా ఉంది. ఈ వేరియంట్ రాకతో, స్కోడా కుషాక్ ధరలు ఇప్పుడు రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. స్కోడా కుషాక్ యొక్క రెండు కొత్త వేరియంట్లలో 'యాక్టివ్ పీస్' మరియు 'యాంబిషన్ క్లాసిక్' ఉన్నాయి.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

ముందుగా స్కోడా కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు దీని ధర 'యాక్టివ్' ట్రిమ్ స్థాయి కంటే దాదాపు రూ. 1.20 లక్షలు తక్కువగా ఉంటుంది. ఈ ధర ట్యాగ్‌ను ఉంచడానికి, స్కోడా ఈ వేరియంట్ లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు స్పీకర్‌లను తొలగించింది. ఇందులోని 1.0 లీటర్ 3 సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

ఇక రెండవ కొత్త వేరియంట్ అయిన స్కోడా కుషాక్ యాంబిషన్ క్లాసిక్ ట్రిమ్ విషయానికి వస్తే, ఇది 'యాంబిషన్' ట్రిమ్ స్థాయి కంటే దిగువన ఉంటుంది మరియు ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్ కూడా అదే 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం ఈ వేరియంట్ ధర యాంబిషన్ ట్రిమ్ స్థాయి కంటే రూ. 50,000 వరకు తక్కువగా ఉంటుంది మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్, మైస్కోడా కనెక్ట్ వంటి ఫీచర్లను కోల్పోతుంది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ యొక్క కొత్త యాంబిషన్ క్లాసిక్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 12.69 లక్షలు కాగా ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 14.09 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). స్కోడా కుషాక్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులోని అధిక వేరియంట్లలో 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను అందిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

ఈ రెండు పెట్రోల్ ఇంజన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తాయి. ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా కంపెనీ తమ స్కోడా కుషాక్‌ను తయారు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై తయారు చేశారు. ఈ ఎస్‌యూవీ తయారీలో ఉపయోగించే విడిభాగాలలో 95 శాతం భాగాలను స్థానికంగానే సేకరిస్తోంది. భవిష్యత్తులో దీనిని 100 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా, త్వరలోనే కంపెనీ ఈ మోడల్‌లో కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ కూడా విడుదల చేయాలని చూస్తోంది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ గా అందుబాటులోకి రానుంది. స్టాండర్డ్ కుషాక్ తో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ల పరంగా మార్పులను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా బ్లాక్డ్-అవుట్ ట్రీట్‌మెంట్ ను పొందుతుంది మరియు స్పోర్టియర్ అప్పీల్ కోసం కొత్త 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. స్కోడా కుషాక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌ల మాదిరిగా కాకుండా, కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్ రెడ్ మరియు వైట్ అనే రెండు ఎక్స్టీరియర్ కలర్లకు మాత్రమే పరిమితం చేయబడుతుందని సమాచారం.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

ఈ స్పోర్టీ థీమ్ ఇంటీరియర్‌లో కూడా కొనసాగుతుంది. ఈ డ్యూయల్-టోన్ థీమ్‌లో క్యాబిన్ అప్‌హోలెస్ట్రీ, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, సీట్లు మరియు ఇన్ఫోటైన్‌మెంట్ గ్రాఫిక్స్ మొదలైనవి ఉంటాయి. ఈ మార్పులతో పాటు, స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ లో స్కోడా స్లావియా సెడాన్ లో ఉపయోగించిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

స్కోడా కుషాక్ డిజైన్ ను గమనిస్తే, ఈ కారు ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్ వండి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, సైడ్‌లో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు పై భాగంలో సన్‌రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.

స్కోడా కుషాక్ (Skoda Kushaq)లో రెండు కొత్త వేరియంట్స్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

ఇక ఇందులో లభించే ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, బ్రేక్ డిస్క్ వైపింగ్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda adds two new variants in kushaq suv price starts from rs 10 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X