Just In
- 41 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 4 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
స్లావియా, కుషాక్ల హోరు.. జూన్ 2022 నెలలో స్కోడా అమ్మకాల జోరు.. ఏకంగా 720 శాతం వృద్ది!
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో (Skoda Auto) ఇటీవల కాలంలో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడం మరియు ఇక్కడి వినియోగదారుల అభిరుచి మరియు బడ్జెట్ కు అనుగుణంగా సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో, కంపెనీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి స్కోడా అందిస్తున్న స్లావియా (Skoda Slavia) మరియు కుషాక్ (Skoda Kushaq) అమ్మకాలు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో, జూన్ 2022 నెలలో స్కోడా ఆటో మొత్తం 6,023 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలోని అమ్మకాలతో పోలిస్తే, ఇవి 720 శాతం పెరిగాయి.

భారత మార్కెట్లో స్కోడా కుషాక్ మరియు స్కోడా స్లావియా కార్ల విడుదలతో ఈ చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ట్రాక్షన్‌ను పొందింది. ఇవి రెండూ కూడా "ఇండియా 2.0" వ్యాపార వ్యూహంలో భాగంగా భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ క్రింద తయారు చేయబడిన మొదటి రండు వాహనాలు. కంపెనీ వీటి తయారీలో ఉపయోగించే భాగాలను దాదాపు 95 శాతం స్థానికంగానే సేకరించడం వలన ఉత్పత్తి ఖర్చులను తగ్గి, సరసమైన ధరలకే విడుదల చేసేలా కంపెనీని ప్రేరేరిపించాయి.

జూన్ 2022లో స్కోడా భారతదేశంలో మొత్తం 6,023 యూనిట్ల కార్లను విక్రయించింది. జూన్ 2021లో స్కోడా కేవలం 734 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో కంపెనీ వార్షిక అమ్మకాలు 720 శాతానికి పైగా పెరిగాయి. ఈ కంపెనీ నెలవారీ అమ్మకాలు కూడా వృద్ధి బాటలోనే ఉన్నాయి. స్కోడా ఇండియా మే 2022లో 4,604 యూనిట్లను విక్రయించగలిగింది, ఇది జూన్ 2022లో కంపెనీ విక్రయించిన 6,000 లకు యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 30 శాతానికి పైగా నెలావారీ వృద్ధి చెందాయి.

ఇటీవల తమిళనాడులోని ఓ స్కోడా డీలర్షిప్ గత నెలలో ఒకే రోజున 125 యూనిట్ల స్కోడా స్లావియా సెడాన్లను డెలివరీ చేసింది. ఇవి రికార్డు స్థాయిలో లేనప్పటికీ, 125 యూనిట్ల స్కోడా స్లావియా సెడాన్ లను డెలివరీ చేయడం ఈ డీలర్షిప్ యొక్క ప్రశంసనీయమైన విజయం. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఎస్జిఏ కార్స్ వీటిని డెలివరీ చేసింది. ఈ 'మెగా డెలివరీ ఈవెంట్'ను భారతదేశంలో ఇటీవల విడుదల చేసిన స్కోడా స్లావియా సెడాన్ పొందిన ట్రాక్షన్కు నిదర్శనంగా చూడవచ్చు.

భారతదేశంలో స్కోడా నుండి అత్యంత పాపులర్ అయిన ర్యాపిడ్ (Skoda Rapid) స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన 'స్కోడా స్లావియా' (Skoda Slavia), ఈ విభాగంలో ర్యాపిడ్ కన్నా అనేక రెట్లు మెరుగ్గా డిజైన్ చేయబడింది. భారత మార్కెట్లో స్కోడా స్లావియా సెడాన్ ను తొలిసారిగా విడుదల చేసినప్పుడు కంపెనీ దీనిని రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో విక్రయించింది. కాగా, ఇటీవలే కంపెనీ దీని ధరను భారీగా పెంచేసింది.

ధరల పెంపు అనంతరం స్కోడా స్లావియా సెడాన్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.10.99 (ఎక్స్-షోరూమ్) కి చేరుకుంది. స్కోడా స్లావియా 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) మరియు 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ ఇటీవలే ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను డౌన్‌గ్రేడ్ చేసింది.

స్కోడా స్లావియా లోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఇదివరకు ఆఫర్ చేసిన 10 ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే యూనిట్‌ని తొలగించి దాని స్థానంలో డౌన్‌గ్రేడ్ చేయబడిన 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఈ మార్పు కారణంగా, కస్టమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కంపెనీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో యాక్టివ్ వేరియంట్ ఒక్కటే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో లభించేది, మిగిలిన అన్ని వేరియంట్లు 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో లభించేవి. అయితే, ఇప్పుడు హై-ఎండ్ వేరియంట్లన్నీ కూడా 10 ఇంచ్ టచ్ స్క్రీన్కు బదులుగా చిన్న 8 ఇంచ్ స్క్రీన్‌ను పొందుతాయి.

సెమీ-కండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చిన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను ఇప్పటికే యూరప్ మార్కెట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్ద 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో పోలిస్తే, ఈ కొత్త 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కూడా దాదాపు ఒకేరకమైన ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, ఇది వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్‌ను కోల్పోతుంది. ఈ ఒక్క మార్పు మినహా దాదాపుగా మిగిలిన ఫీచర్లన్నీ కూడా ఈ రెండు యూనిట్లలో ఒకేలా ఉంటాయి.

భారత మార్కెట్లో భారత్‌లో 'స్కోడా కుషాక్ ఎన్ఎస్ఆర్' విడుదల
ఇదిలా ఉంటే, స్కోడా ఆటో దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న 'స్కోడా కుషాక్' (Skoda Kushaq) లో ఓ కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. స్కోడా కుషాక్ ఎన్ఎస్ఆర్ (Skoda Kushaq NSR) పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ధర రూ.15.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్పెషల్ వేరియంట్ స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.