మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన కుషాక్ మరియు స్లావియా వంటి కార్లతో, దేశీయ విపణిలో మంచి బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంది. స్కోడా కార్లకు డిమాండ్ స్థిరంగా ఉన్న నేపథ్యంలో, గత నెలలో ఈ బ్రాండ్ అమ్మకాలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, స్కోడా ఆటో ఇండియా మే 2022 నెలలో 4,604 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో (మే 2021లో) కంపెనీ విక్రయించిన 716 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, స్కోడా కస్టమర్లు ఇప్పుడు కారు డెలివరీ తీసుకోవడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. స్కోడా లేటెస్ట్ కార్లయిన కుషాక్ ఎస్‌యూవీ మరియు స్లావియా సెడాన్లు గత నెలలో అమ్మకాల వృద్ధికి అత్యధికంగా సహకరించాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్ సంక్షోభం ఉన్నప్పటికీ, కంపెనీ తమ అన్ని కార్లను సమయానికి డెలివరీ చేస్తోందని స్కోడా తెలిపింది.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

అయితే, చిప్ సరఫరా లేకపోవడంతో కంపెనీ కుషాక్ మరియు స్లావియా మోడళ్లలో కొన్ని ఫీచర్లను తొలగించింది. స్లావియా మరియు కుషాక్ కార్లలో కంపెనీ 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను తొలగించి దాని స్థానంలో 8 ఇంచ్ యూనిట్లను అందిస్తోంది. కస్టమర్లు కావాలనుకుంటే, డీలర్‌షిప్ సహాయంతో స్టాండర్డ్ సైజ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

స్కోడా స్లావియా సెడాన్ లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను డౌన్‌గ్రేడ్ చేయడంతో పాటుగా కంపెనీ దాని ధరను కూడా భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. కస్టమర్లంతా స్కోడా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ, ట్విట్టర్ పోస్టులు పెడుతున్నారు. తమ ట్వీట్స్ లో స్కోడా ఆటో బాస్ జాక్ హోలిస్ ని కూడా ట్యాగ్ చేస్తున్నారు. అయితే, ఇందులో కొన్ని ట్వీట్ లకు జాక్ హోలిస్ ఓపికగా సమాధానం ఇచ్చారు.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీ-కండక్టర్ చిప్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, డౌన్‌గ్రేడ్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చవకదేమీ కాదని, యూరప్ మార్కెట్లో కస్టమర్లు దీనిని చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా, ఈ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్ థర్డ్ పార్టీకి చెందినది కాదని, ఇదొక గ్లోబల్ యూనిట్ అని, చిప్ కొరత కారణంగా కస్టమర్ల బుకింగ్స్ మరింత ఆలస్యం కాకుండా చూసేందుకు, వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాక్ హోలిస్ వివరించారు.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

ఇదిలా ఉంటే, స్కోడా తమ స్లావియా సెడాన్ ధరలను గరిష్టంగా రూ. 60,000 వరకూ పెంచింది. చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) కొన్ని నెలల క్రితమే భారత మార్కెట్లో తమ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) మిడ్-సైజ్ సెడాన్ ను విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ సెడాన్ ధర రూ. 10.69 లక్షలతో ప్రారంభమై రూ. 15.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉండేది. ధరల పెరుగుదల తరువాత స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది మరియు ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 18.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

ఇక స్కోడా కుషాక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఇటీవలే భారతదేశంలో కుషాక్ ఆంబిషన్ క్లాసిక్‌ను రూ. 12.69 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ఇది యాక్టివ్ మరియు యాంబిషన్ వేరియంట్‌ల మధ్య అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో విడుదల చేయబడింది. స్కోడా కుషాక్ ఈ విభాగంలో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు టాటా హారియర్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

స్కోడా స్లావియా మరియు కుషాక్ యొక్క యాంబిషన్ మరియు స్టైల్ ట్రిమ్‌లు 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందగా, బేస్ వేరియంట్ యాక్టివ్ మాత్రం 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్‌ను పొందుతుంది. ఇందులోని 10 ఇంచ్ యూనిట్ ఎనిమిది స్పీకర్లతో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కోసం వైర్‌లెస్ సపోర్ట్‌తో కూడిన కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

స్కోడా అందిస్తున్న కుషాక్ ఎస్‌యూవీలో కంపెనీ ఇటీవలే కుషాక్ మోంటే కార్లో వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 15.99 లక్షల నుండి రూ. 19.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంచబడింది. ఇది టాప్-స్పెక్ స్టైలింగ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది మరియు మోంటే కార్లో ఎడిషన్ 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ TSI ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మే 2022 నెలలో దుమ్ము దులిపి దంచి కొట్టిన స్కోడా ఆటో.. కుషాక్, స్లావియా కార్లకు భారీ డిమాండ్..!

స్టాండర్డ్ కుషాక్ తో పోల్చుకుంటే, ఈ మోంట్ కార్లో ఎడిషన్ కుషాక్ లో ఫుల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు మరియు హెడ్‌ల్యాంప్‌లు (ఫాలో మీ హోమ్ ఫీచర్‌తో), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్ వూఫర్‌తో కూడిన 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda auto india sold 4640 cars in may 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X