భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా (Skoda) ఇప్పటికే మంచి అమాంకాలతో విజయపథంలో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కంపెనీ దేశీయ మార్కెట్లో 'స్కోడా కుషాక్' (Skoda Kushaq) యొక్క కొత్త వేరియంట్ 'కుషాక్ ఎన్ఎస్ఆర్' (Kushaq NSR) విడుదల చేసింది. దీని ధర భారత మార్కెట్లో 15.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

సాధారణంగా స్కోడా కుషాక్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. గత నెలలో కంపెనీ ఎక్కువ అమ్మకాలను సాధించడానికి కూడా ఈ ఎస్‌యూవీ ఎంతగానో సహకరించింది. అయితే ఇప్పుడు కంపెనీ 'కుషాక్ ఎన్ఎస్ఆర్' తీసుకురావడంతో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. 'ఎన్ఎస్ఆర్' అంటే 'నాన్-సన్‌రూఫ్' అని అర్థం. కావున ఈ కొత్త వేరియంట్ లో సన్‌రూఫ్ ఆప్సన్ లేదు. సాధారణంగా కుషాక్ ఎస్‌యూవీలలో సన్‌రూఫ్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ధర దాని స్టాండర్డ్ మోడల్ 'స్టైల్' వేరియంట్‌ కంటే కూడా రూ. 20,000 తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పటికి కూడా కొనసాగుతున్న సెమీ కండక్టర్ కొరతలు కారణంగా కంపెనీ ఈ కొత్త వేరియంట్ విడుదల చేసినట్లు తెలిసింది. ఇందులో కేవలం సన్‌రూఫ్‌ మాత్రమే కాకుండా ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌ వంటి ఫీచర్స్ కూడా ఈ 'కుషాక్ ఎన్ఎస్ఆర్' లో లేదు.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

ఇందులో పైన చెప్పిన ఫీచర్స్ కాకుండా మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా దాని 'స్టైల్' వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

స్కోడా కుషాక్ రేడు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇందులో మొదటి ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జత చేయబడి ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

స్కోడా కుషాక్‌లో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ భారతీయ మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

ఇదిలా ఉండగా స్కోడా కుషాక్ ధరలు ఇటీవల కాలంలోనే రూ. 20,000 నుంచి రూ. 70,000 వరకు పెరిగాయి. కావున ఇప్పుడు కుషాక్ ప్రారంభ ధరలు రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా టాప్ ఎండ్ మోడల్ వేరియంట్ ధర రూ. 18.79 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

స్కోడా కుషాక్ యొక్క యాక్టివ్ 1.0 లీ టిఎస్ఐ ధర రూ. 30,000 పెరిగింది, కావున ఈ మోడల్ ధర ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ ధర రూ. 20,000 పెరిగి రూ. 12.99 లక్షలకు చేరింది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

ఇక కుషాక్ స్టైల్ 1.0లీ టిఎస్ఐ వేరియంట్ ధర రూ. 40,000 మరియు స్టైల్ 1.5లీ టిఎస్ఐ ధర రూ. 70,000 పెరిగాయి. ఇప్పుడు వీటి ధరలు వరుసగా రూ. 14.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు రూ. 16.49 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరాయి. అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ వేరియంట్ ధర రూ. 40,000 మరియు స్టైల్ 1.5 లీ టిఎస్ఐ డిఎస్జి ధర రూ. 60,000 పెరిగింది.

భారత్‌లో 'స్కొడా కుషాక్ ఎన్ఎస్ఆర్' లాంచ్: ధర రూ. 15.09 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన 'కుషాక్ ఎన్ఎస్ఆర్' కొంత తక్కువ ధరలకు లభించినప్పటికీ ఇందులో కొన్ని ఫీచర్స్ అందుబాటులో లేదు. కావున ఈ కుషాక్ ఎన్ఎస్ఆర్ భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలుగుతుందా.. లేదా అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda introduce new affordable tsi style nsr variant for kushaq suv
Story first published: Thursday, June 16, 2022, 13:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X