కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో (Skoda Auto) గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Skoda Kushaq) దేశీయ విపణిలో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అమ్ముడైంది. ఈ ఏడాది కాలంలో భారత మార్కెట్లో స్కోడా కుషాక్ అమ్మకాలు 30వేల యూనిట్లకు చేరువలో ఉన్నాయి. స్కోడా తమ కుషాక్ ఎస్‌యూవీ ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ వస్తోంది.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

స్కోడా ఈ ఏడాది మే 2022 నెలలో కుషాక్ ఎస్‌యూవీలో యాక్టివ్ పీస్ అనే బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను పరిచయం చేసింది. కాగా, ఇప్పుడు కంపెనీ ఇదే వేరియంట్ ను సైలెంట్ గా అప్‌డేట్ చేసింది. స్కోడా కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్ ఇప్పుడు ట్రైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు కొత్త హెడ్‌లైనర్‌తో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ఈ ఎంట్రీ-లెవల్ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

కుషాక్ యాక్టివ్ పీస్ బేస్ వేరియంట్ కావడంతో ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్పీకర్లు వంటి ఫీచర్లు ఉండవు. అయినప్పటికీ, ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మాత్రం ఉంటాయి. టచ్‌స్క్రీన్ లేకుండా ఈ ఫీచర్ ఏం చేసుకోవాలి అని పొరపాటు పడకండి, ఒకవేళ మీరు భవిష్యత్తులో ఈ వేరియంట్ లో స్కోడా నుండి కానీ లేదా థర్డ్ పార్టీ నుండి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ హెడ్-యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే, దానిని కనెక్ట్ చేసుకోవడానికి ఈ కంట్రోల్స్ ఉపయోగపడుతాయి.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

ఇక టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే లభించేది. అయితే, ఇప్పుడు ఇది ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ నాలుగు టైర్లలో ఉండే గాలి పీడనాన్ని స్క్రీన్‌పై తెలియజేస్తుంది. అలాగే, టైరు పంక్చర్ అయినా లేదా ఏదైనా టైరులో గాలి తగ్గినట్లు అనిపించినా అది వెంటనే డ్రైవరును హెచ్చరిస్తుంది. యాక్టివ్ పీస్ వేరియంట్లో ఈ రెండు మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

స్కోడా కుషాక్ జూన్ 2021లో భారతదేశంలో మొదటిసారిగా విడుదలైంది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ రూ. 10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 17.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ ఏడాది మేలో కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే నెలలో కంపెనీ ఇందులో యాక్టివ్ పీస్ అనే బేస్ వేరియంట్ ను రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

స్కోడా కుషాక్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటిది 113 బిహెచ్‌పి పవర్ ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేసే 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. రెండవది 148 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. స్కోడా కుషాక్ మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్‌లలో అందుబాటులోకి ఉంటుంది. వీటిలో యాక్టివ్ పీస్, యాంబియంట్, యాంబిషన్ మరియు స్టైల్ అనే ట్రిమ్‌లు ఉన్నాయి.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. స్కోడా కుషాక్ డిజైన్ ను గమనిస్తే, ఇది ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. కారు ముందు వైపు ఫ్రంట్ బంపర్ ఎగువన క్రోమ్ సరౌండెడ్ గ్రిల్ మరియు దిగువన పెద్ద ఎయిర్ డ్యామ్ ఉంటాయి. బంపర్ క్రింది భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ మరియు బానెట్ పై మజిక్యులర్ క్రీజ్ లైన్స్ తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది.

కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!

ఈ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఇన్-కార్ వై-ఫై, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఈ కారులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఇబిడి విత్ ఏబిఎస్ మొదలైనవి కూడా ఉన్నాయి. - స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ గురించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq active peace variant gets tpms and new headliner details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X