స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్కోడా కుషాక్ (Skoda Kushaq) లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. స్కోడా కుషాక్ మోంట్ కార్లో (Skoda Kushaq Monte Carlo) పేరుతో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడల్ కుషాక్‌తో పోల్చుకుంటే, ఈ ప్రత్యేకమైన మోంట్ కార్లో ఎడిషన్ అదనపు ఫీచర్లను మరియు స్పెషల్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ కుషాక్‌లో కనిపించే అన్ని క్రోమ్ మరియు సిల్వర్ ఎలిమెంట్‌లను ఈ మోంట్ కార్లో ఎడిషన్ కుషాక్‌లో పూర్తి నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

ఇందులో ఫ్రంట్ గ్రిల్, సైడ్ మిర్రర్లు, రూఫ్ రెయిల్స్, డోర్ హ్యాండిల్స్ మరియు బంపర్ ఇన్‌సర్ట్‌లు అన్నీ కూడా నలుపు రంగులోనే ఉంటాయి, అలాగే ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్లు కూడా నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇంటాయి. ఇవి యాదృచ్ఛికంగా మునుపటి-తరం స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 మోడల్‌లో ఉపయోగించిన వీల్స్ మాదిరిగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు 1.5 టిఎస్ఐ వేరియంట్‌ను కొనుగోలు చేసినట్లయితే, ఇందులోని బ్రేక్ కాలిపర్లు ప్రత్యేకమైన రెడ్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

స్పెషల్ ఎడిషన్‌ను హైలైట్ చేసేందుకు ఈ కారు ముందు భాగంలో ఫ్రంట్ ఫెండర్‌లపై 'మోంటే కార్లో' బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. అలాగే, టెయిల్‌గేట్‌పై 'స్కోడా' మరియు 'కుషాక్' అక్షరాలు కూడా నలుపు రంగులోనే కనిపిస్తాయి. కారు యొక్క రూఫ్ మొత్తం బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది మరియు టెయిల్‌గేట్ స్పాయిలర్ డ్యూయల్-టోన్ రెడ్ మరియు బ్లాక్ ఫినిషింగ్‌ను పొందుతుంది. స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ రెడ్ అండ్ బ్లాక్ మరియు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్‌లో మాత్రమే లభిస్తుంది.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ స్పెషల్ ఎడిషన్ స్కోడా కుషాక్ డ్యూయెల్ టోన్ థీమ్‍‌తో ఎక్స్టీరియర్ డిజైన్‌లో ఎక్కువ బ్లాక్ ఎలిమెంట్స్‌తో మంచి ప్రీమియం అప్పీల్‌ను కలిగి ఉంటుంది. ఇక లోపలి భాగానికి వస్తే, స్టాండర్డ్ స్కోడా కుషాక్‌లో గ్రే-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఉంటుంది. కాగా, ఈ కొత్త స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్‌లో కొత్త డ్యూయల్-టోన్ రెడ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో ఎలాంటి మార్పు ఉండదు, కాకపోతే ఇందులో కలర్ ఆప్షన్లు మాత్రం మారాయి.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు నాలుగు డోర్‌లపై కొత్త ఎరుపు రంగు ఇన్సర్ట్‌లు కనిపిస్తాయి. అన్ని సీట్లపై రెడ్ కలర్ స్టిచింగ్ కనిపిస్తుంది మరియు హెడ్‌రెస్ట్‌లపై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ మరియు 'మోంట్ కార్లో' ఇన్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త రెడ్ అండ్ బ్లాక్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. ఇంకా ఇందులో 'మోంట్ కార్లో' అని చెక్కబడిన డోర్ స్కఫ్ ప్లేట్‌లను కూడా పొందుతుంది. ఇవీ స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో చేయబడిన కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

ఇక ఇందులో చేసిన ఫీచర్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, మోంట్ కార్లో థీమ్‌కు తగినట్లుగా స్కోడా ఇందులో రెడ్ గ్రాఫిక్స్‌తో కూడిన 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించింది. ఇందులో కొత్త అల్యూమినియం పెడల్స్‌ లభిస్తాయి. కంపెనీ ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను స్టైల్ వేరియంట్‌పై ఆధారపడి రూపొందించిన నేపథ్యంలో, ఇందులోని అన్ని ఇతర ఫీచర్లు అలాగే ముందుకు తీసుకెళ్లబడుతాయి.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

ఈ ఫీచర్ల జాబితాలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 10 ఇంచ్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రెడ్ యాంబియంట్ లైటింగ్, సబ్ వూఫర్‌తో కూడిన ఆరు-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్కోడా కుషాక్ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, ఎమ్‌జి ఆస్టర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఇంజన్ ఆప్షన్లను గమనిస్తే, ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని చిన్న ఇంజన్ 115 హెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ గేర్‍‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా, పెద్ద ఇంజన్ 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ విడుదల: ధర రూ.16 లక్షలు, ఇందులో స్పెషల్ ఏంటంటే..?

స్కోడా కుషాక్ మోంట్ కార్లో ఎడిషన్ వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

- స్కోడా కుషాక్ మోంట్ కార్లో 1.0 మ్యాన్యువల్ - రూ.15.99 లక్షలు

- స్కోడా కుషాక్ మోంట్ కార్లో 1.0 ఆటోమేటిక్ - రూ.17.69 లక్షలు

- స్కోడా కుషాక్ మోంట్ కార్లో 1.5 మ్యాన్యువల్ - రూ.17.89 లక్షలు

- స్కోడా కుషాక్ మోంట్ కార్లో 1.5 ఆటోమేటిక్ - రూ.19.49 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq monte carlo launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X