అమ్మకాల్లో దూసుకెళ్తున్న 'స్కోడా కుషాక్'.. సంవత్సరానికే 28,000 దాటిన సేల్స్

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో విడుదల చేసిన తన మిడ్-సైజ్ ఎస్‌యువి 'కుషాక్' (Kushaq) అద్భుతమైన స్పందన పొందుతోంది. దేశీయ మార్కెట్లో విడుదలై ఇప్పటికి సంవత్సర కాలమయినా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే రోజురోజుకి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎస్‌యువి ఇప్పటికి 28,000 కంటే ఎక్కువ అమ్మకాలను పొందినట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

భారతీయ మార్కెట్లో 'స్కోడా కుషాక్' (Skoda Kushaq) 2021 జూన్ నెలలో విడుదలైంది. అప్పటి నుంచి కూడా ఇది మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క ఈ ఎస్‌యువి ప్రతి నెల సగటున 2,386 యూనిట్ల విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగా అతి తక్కువ కాలంలోనే కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

స్కోడా కుషాక్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పుడు దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 17.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. కంపెనీ ఈ ఎస్‌యువి ధరలను ఇంతకు ముందే రూ. 3,000 పెంచడం జరిగింది. కావున ఈ ఎస్‌యువి ప్రారంభ ధరలు ఇప్పుడు రూ. 10.79 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

స్కోడా కుషాక్ 2022 జూన్ నాటికి మొత్తం 28,629 యూనిట్ల విక్రయాలను పొందగలిగి అమ్మకాల్లో గొప్ప రికార్డ్ సృష్టించింది. కుషాక్‌ అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మరియు LED టెయిల్ లైట్లు ఇవ్వబడ్డాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో బోనెట్ వంటివి ఉన్నాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

రియర్ ప్రొఫైల్ లో విలోమ L ఆకారంలో ఉండే LED టైల్ లైట్స్ మరియు పైభాగంలో స్టాప్ లైట్ పొందుతుంది. ఇవి కాకుండా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ మరియు బిగ్ రియర్ బంపర్ ఇవ్వబడ్డాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ వంటివి కూడా స్టాండర్డ్ గా అందించబడ్డాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్‌ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

స్కోడా కుషాక్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది, కావున ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటివి ఉన్నాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

ఇదిలా ఉండగా స్కోడా ఆటో (Skoda Auto) దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్కోడా కుషాక్ (Skoda Kushaq) లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. స్కోడా కుషాక్ మోంట్ కార్లో (Skoda Kushaq Monte Carlo) పేరుతో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడల్ కుషాక్‌తో పోల్చుకుంటే, ఈ ప్రత్యేకమైన మోంట్ కార్లో ఎడిషన్ అదనపు ఫీచర్లను మరియు స్పెషల్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ కుషాక్‌లో కనిపించే అన్ని క్రోమ్ మరియు సిల్వర్ ఎలిమెంట్‌లను ఈ మోంట్ కార్లో ఎడిషన్ కుషాక్‌లో పూర్తి నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

అంతే కాకుండా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో 'స్కోడా కుషాక్' (Skoda Kushaq) యొక్క కొత్త వేరియంట్ 'కుషాక్ ఎన్ఎస్ఆర్' (Kushaq NSR) విడుదల చేసింది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి తోడ్పడతాయి.

అమ్మకాల్లో రారాజు స్కోడా కుషాక్.. అమ్మకాల్లో అప్పుడే మోగించిన విజయభేరి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో స్కోడా కుషాక్ ఎంత ఆదరణ పొందుతుందో, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ యొక్క ఈ మోడల్ ప్రతి నెల అమ్మకాలలోనూ మంచి పురోగతిని పొందుతోంది. మార్కెట్లో విడుదలైన కేవలం సంవత్సరంలో 28,000 యూనిట్ల అమ్మకాలను దాటవేయగలిగింది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Skoda kushaq sales 28629 units in one year details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X