Just In
- 15 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 16 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 19 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
- 20 hrs ago
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- News
Atmakur Bypoll Results 2022:మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమేనా..?
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
అప్పుడే యాపారం మొదలెట్టేశారు.. స్కోడా స్లావియాలో ఫీచర్ల తగ్గింపు, ధరల పెంపు..! గుర్రుమంటున్న కస్టమర్లు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో (Skoda Auto) గడచిన ఫిబ్రవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు. అయితే, ఈ కారు కోసం వెయిట్ చేస్తున్న కస్టమర్లను నిరుత్సాహపరచేలా కంపెనీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో అందిస్తున్న 10-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ స్థానంలో కంపెనీ ఇప్పుడు 8 ఇంచ్ ఇన్ఫోటైమెంట్ ను అందిస్తోంది. దీనికి తోడును ఈ కారు ధరలను కూడా పెంచింది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. కస్టమర్లంతా స్కోడా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ, ట్విట్టర్ పోస్టులు పెడుతున్నారు. తమ ట్వీట్స్ లో స్కోడా ఆటో బాస్ జాక్ హోలిస్ ని కూడా ట్యాగ్ చేస్తున్నారు. అయితే, ఇందులో కొన్ని ట్వీట్ లకు జాక్ హోలిస్ ఓపికగా సమాధానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీ-కండక్టర్ చిప్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, డౌన్‌గ్రేడ్ చేయబడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చవకదేమీ కాదని, యూరప్ మార్కెట్లో కస్టమర్లు దీనిని చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పారు.

అంతేకాకుండా, ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ థర్డ్ పార్టీకి చెందినది కాదని, ఇదొక గ్లోబల్ యూనిట్ అని, చిప్ కొరత కారణంగా కస్టమర్ల బుకింగ్స్ మరింత ఆలస్యం కాకుండా చూసేందుకు, వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాక్ హోలిస్ వివరించారు. వైర్లెస్ చార్జింగ్ ఆప్షన్ తొలగించారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జాక్ హోలిస్ ఆ ఫీచర్ ను తొలగించలేదని సమాధానం ఇచ్చారు.

స్కోడా ర్యాపిడ్ సెడాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన స్కోడా కుషాక్, ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. స్కోడా స్లావియా మార్కెట్లో విడుదలైన మొదటి నెలలోనే 10,000 మందికి పైగా కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్నారు. స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) మరియు 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇందులో యాక్టివ్ వేరియంట్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో వస్తుంది, కాగా మిగిలిన అన్ని వేరియంట్లు 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇప్పుడు ఈ కారులో రివైజ్ చేయబడిన ఫీచర్ల విషయానికి వస్తే, స్కోడా స్లావియా యొక్క టాప్-స్పెక్ వేరియంట్లు ఇప్పుడు 10 ఇంచ్ టచ్ స్క్రీన్కు బదులుగా చిన్న 8 ఇంచ్ స్క్రీన్‌ను పొందుతాయి. స్కోడా యొక్క సేల్స్ టీమ్ ద్వారా దీని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవచ్చని జాక్ హోలిస్ తన ట్విట్టర్ తెలిపారు.

స్కోడా స్లావియా విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును ప్రత్యేకించి భారత మార్కెట్ కు అనుగుణంగా ఉండేలా డిజైన్ చేసింది. ఇందులో ముందు వైపు స్కోడా యొక్క సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్, L-ఆకారపు ప్రొజెక్టర్ హెడ్‌లైట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, షార్ప్ సైడ్ బాడీ లైన్స్ మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి

ఇంటీరియర్స్ లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన క్యాబిన్ లేఅవుట్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంటెండ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు స్కోడా కనెక్ట్ యాప్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా స్లావియా సెడాన్ ను కంపెనీ రూ. 10.69 లక్షల పరిచం ప్రారంభ ధరతో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఇదే ధరతో విక్రయించబడుతోంది. స్కోడా స్లావియా 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 10.69 లక్షల నుండి రూ. 15.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండగా, 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 16.19 లక్షల నుండి రూ. 17.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. వచ్చే నెల నుండి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.