Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త మోడల్ స్కోడా స్లావియా (Skoda Slavia). స్కోడా కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ ను ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభించింది. డెలివరీలు 2022 మార్చి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ స్లావియా యొక్క ఇంటీరియర్ డిజైన్ వెల్లడించే ఒక వీడియో విడుదలైంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందా.. రండి.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇప్పుడు విడుదలైన స్కోడా స్లావియా యొక్క ఇంటీరియర్ తెలిపే వీడియోలో ముందుగా మీ దృష్టిని ఇందులోని టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఆకర్షిస్తుంది. ఇది స్కోడా కుషాక్ నుండి తీసుకోబడింది, ఇందులో మ్యూజిక్ మరియు కాల్‌ల కోసం బటన్‌లు ఉంటాయి. స్టీరింగ్ వీల్‌లోని నాబ్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. కావున ఇద్ ఈ కారుకి మరింత ప్రీమియం రూపాన్ని ఇస్తుంది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇది 7 స్పీడ్ DSGతో వచ్చే టాప్ స్పెక్ మోడల్ కాబట్టి, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్ ఇవ్వబడింది. దీని 8 ఇంచెస్ TFT స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ పనిని నిర్వహిస్తుంది. ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిస్‌ప్లే ప్రీమియం మరియు ఫ్యాన్సీగా కనిపించే డిస్టెన్స్ టు ఎంప్టీ, కరెంట్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఫ్యూయల్ లెవెల్, ఓడోమీటర్, స్పీడోమీటర్ వంటి అనేక సమాచారాన్ని అందిస్తుంది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇందులోని డ్యాష్‌బోర్డ్ హార్డ్ టచ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది మరియు మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంచబడింది. ఇది 10-ఇంచెస్ యూనిట్ మరియు స్మార్ట్‌ఫోన్‌కు మొత్తం కనెక్టివిటీ ఎంపికలను అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే ఉన్నాయి. సౌండ్ కోసం హై క్యాలిటీ స్పీకర్లు కూడా అందించబడ్డాయి. టాప్ వేరియంట్‌లో సబ్-వూఫర్ కూడా ఇవ్వబడింది.

ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద సెంటర్ AC వెంట్‌లు మరియు దాని క్రింద ఎయిర్ కండిషనింగ్ కోసం నియంత్రణలు ఉన్నాయి. ACని నియంత్రించడానికి బటన్, నాబ్ లేదా స్లైడర్ లేదు, దీనికి హాప్టిక్ టచ్ ప్యానెల్ ఉంది. AC కంట్రోల్ ప్యానెల్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మంచి టచ్ రెస్పాన్స్‌ని కలిగి ఉంటాయి కావున ఉపయోగించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

సెంటర్ కన్సోల్ ప్రీమియం మరియు గేర్ లివర్ కొత్త లెదర్ బూట్‌ను పొందుతుంది. గేర్ లివర్‌తో కూడిన పియానో ​​బ్లాక్ ప్యానెల్ సెడాన్ యొక్క అనేక ఫీచర్స్ కంట్రోల్ చేసే కొన్ని బటన్‌లను కలిగి ఉంది. డ్యాష్‌బోర్డ్‌కు రెండు వైపులా ఉన్న AC వెంట్‌లు వృత్తాకారంలో ఉంటాయి మరియు ఇది యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందుతుంది. ఇదే డ్యూయల్ టోన్ వెనుక భాగంలో కూడా కనిపిస్తుంది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

కొత్త స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త స్లావియా ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించ్చలేదు. అయితే ఈ సెడాన్ విడుదల సమయంలో ధర అధికారికంగా వెల్లడవుతుంది. ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

Slavia ఇంటీరియర్ వెల్లడించే వీడియో రిలీజ్ చేసిన Skoda: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త సెడాన్ మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే కంపెనీ యొక్క స్కోడా కుషాక్ కూడా అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన SUV గా అవతరించింది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia interior details revealed video
Story first published: Friday, January 21, 2022, 8:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X