స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల భారతదేశంలో కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు విషయంలో రేంజ్ గురించి చింతించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో ఓ లాంగ్ రేంజ్ వెర్షన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ నెక్సాన్ ఈవీతో పాటుగా కంపెనీ లాంగ్ రేంజ్ వెర్షన్ నెక్సాన్ ఈవీని కూడా విక్రయిస్తోంది. ఈ రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్‌తో పాటుగా పలు ఇతర అంశాల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - ఎలక్ట్రిక్ మోటార్, పెర్ఫార్మెన్స్

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరియు స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ రెండూ కూడా ఒకే పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సాయంతో పనిచేస్తాయి. అయితే, వాటి విభిన్న బ్యాటరీ ప్యాక్స్ కారణంగా వాటి పెర్ఫార్మెన్స్ కూడా వేరుగా ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీలోని ఈ మోటార్ గరిష్టంగా 127 bhp శక్తిని మరియు 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్టాండర్డ్ మోడల్ నెక్సాన్ ఈవీ కేవలం 9.3 సెకండ్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 120 కిమీ (టాప్ స్పీడ్) వేగంతో పరుగులు తీస్తుంది.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

ఇక కొత్తగా వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విషయానికి వస్తే, ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 bhp శక్తిని మరియు 250 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే, దీని పవర్, టార్క్ వరుసగా 14 bhp మరియు 5 Nm పెరిగింది. పెరిగిన అవుట్‌పుట్ కారణంగా, కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం 9 సెకండ్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వేగాన్ని గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - బ్యాటరీ మరియు రేంజ్

స్టాండర్డ్ టాటా నెక్సాన్ ఈవీ తొలిసారిగా 2020 లో ప్రారంభించబడింది. అప్పటి నుండి ఈ మోడల్‌లో కంపెనీ 30.2 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌తో అందిస్తోంది. ఇది పూర్తి చార్జ్ పై ARAI సర్టిఫైడ్ 312 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. కాగా, కొత్తగా విడుదల చేయబడిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో పెద్ద 40.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ లో పెరిగిన ఈ 10.3 kWh సామర్థ్యం కారణంగా, ఇది పూర్తి చార్జ్ గరిష్టంగా 437 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

అంటే, స్టాండర్డ్ టాటా నెక్సాన్ ఈవీతో పోల్చుకుంటే, ఈ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ అదనంగా 125 కిలోమీటర్ల ఎక్కువ రేంజ్ ను అందిస్తుంది. అయితే, ఇందులో బ్యాటరీ ప్యాక్ యొక్క పెరిగిన పరిమాణం కారణంగా, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే 100 కిలోగ్రాముల ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. అంతేకాకుండా, పెరిగిన బ్యాటరీ సామర్థ్యం కారణంగా కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ తగ్గి 195 మిమీకి చేరుకుంది.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - ఛార్జింగ్ వేగం

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో 30.2 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది మరియు 3.3 kW AC ఛార్జింగ్ మరియు ఫాస్ట్ DC ఛార్జింగ్‌ లను సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను సాధారణ 3.3 kW హోమ్ ఛార్జర్‌తో చార్జ్ చేస్తే, ఇది పూర్తిగా చార్జ్ అవడానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. అదే దీనిని వేగవంతమైన డిసి ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు, ఇది కేవలం 1 గంట వ్యవధిలోనే 10-80 శాతం రీఛార్జ్ అవుతుంది.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

కాగా, కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో చార్జింగ్ సమయం వేరేలా ఉంటుంది. ఇందులో మరింత పెద్ద 40.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి, దీనిని స్టాండర్డ్ 3.3 kW వాల్ చార్జర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇది పూర్తిగా చార్జ్ కావడానికి సుమారు 15-16 గంటల సమయం పడుతుంది. అలాగే, కంపెనీ ఇందులో ఇంటివద్దనే ఫాస్ట్ చార్జింగ్ అందించడం కోసం 7.2kW హోమ్ ఛార్జింగ్ ఆప్షన్ ను కూడా అందిస్తోంది. ఈ చార్జర్ తో బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి 6-7 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ డిసి ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం 56 నిమిషాల్లోనే ఇది 10-80 శాతం నుండి ఛార్జ్ అవుతుంది.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - రీజెన్

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కూడా రీజనరేషన్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుంది, ఇది ప్రయాణంలో బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది, కానీ ఇందులో దీనిని సర్దుబాటు చేసే ఆప్షన్ లేదు. కాగా, కొత్తగా వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో 4 రకాల రీజెన్ మోడ్‌లు ఉన్నాయి. ఇది మోడ్ 0లో రీజెన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది, అయితే మోడ్ 3 దానిని పూర్తి స్థాయిలో పవర్ ను అందిస్తుంది. మోడ్‌ 1 మరియు మోడ్ 2 లు వివిధ స్థాయిల రీజెన్‌లను కలిగి ఉంటాయి.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - ఫీచర్లు

టాటా నెక్సాన్ ఈవీ అనేక రకాల ఫీచర్లతో లభిస్తుంది. కాగా, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఈ ఫీచర్లు మరిన్ని ఎక్కువగా లభిస్తాయి. ఈ కొత్త వేరియంట్లో కూల్డ్ ఫ్రంట్ సీట్లు మరియు గ్లోవ్‌బాక్స్, డిస్ప్లేతో కూడిన జ్యువెల్డ్ గేర్ నాబ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అదనపు ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. అలాగే, ఇందులో స్మార్ట్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, ఆటో హిల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీకి మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మధ్య తేడాలు ఏమిటి?

Nexon EV Max Vs Nexon EV - ధరలు

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం రెండు ట్రిమ్ ఆప్షన్లతో 2 చార్జర్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో XZ+ మరియు XZ+ లక్స్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ ఈ రెండింటినీ ఆప్షనల్ 7.2kW ఛార్జర్‌తో అదనంగా 50,000 ఖర్చుతో అందిస్తోంది. మార్కెట్లో ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 17.74 లక్షలు మరియు రూ. 18.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర సుమారు రూ. 1.5 లక్షలు ఎక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Standard tata nexon ev vs tata nexon ev max range battery specifications features comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X