Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ (Tata Altorz) లో కంపెనీ ఇప్పుడు ఓ ఆటోమేటిక్ (Automatic) వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలుచేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. టాటా ఆల్ట్రోజ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని, దీని లభ్యతను త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి. ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ఈ కారణంగా, టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన మొదట్లో ఇది కేవలం న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభ్యమయ్యేది. ఆ తర్వాత గతేడాది ఆరంభంలో కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను పరిచయం చేసింది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

న్యాచరల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్లు రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభ్యమయ్యేవి. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ టర్బో వెర్షన్ లో ఓ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్లో 1.2 లీటర్‌ త్రీ-సిలెండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 ఎన్‌ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. న్యాచురల్ ఇంజన్‌తో పోలిస్తే ఈ ఇంజన్ 28శాతం అదనపు శక్తిని మరియు 24 శాతం అదనపు టార్క్‌ను విడుదల చేస్తుంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ కేవలం 11.9 క్షణాల్లో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ తమ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఆల్ట్రోజ్ కారులో ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ గేర్‌బాక్స్ కారు ఇంజన్ యొక్క స్పోర్టీ క్యారెక్టర్‌కు సరిపోయేలా క్విక్-షిఫ్ట్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) రూపంలో ఉండే అవకాశం ఉంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

కొత్త టాటా ఆల్ట్రోజ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ ధర ప్రస్తుత మాన్యువల్ వేరియంట్ ధర కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇందులోని అధునాతన DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కారణంగా ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధర దాని మాన్యువల్ వేరియంట్ ధర కంటే సుమారు లక్ష రూపాయలు అందనంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారులో చేయబోయే మెకానికల్ మార్పుల కారణంగా దీని బరువు కూడా దాదాపు 20 కేజీలు పెరిగే అవకాశం ఉంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

ప్రస్తుతం, మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ కారును ఎనిమిది విభిన్న ట్రిమ్ మరియు మూడు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తున్నారు. వీటిలో రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ కారులోని బేస్ వేరియంట్లలో 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. ఇది 6,000rpm వద్ద 85bhp పవర్ ను మరియు 3,300rpm వద్ద 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

అయితే మరింత శక్తివంతమైన మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియంట్లలో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తున్నారు. ఇది 5,500rpm వద్ద 108bhp పవర్ ను మరియు 1,500 rpm వద్ద 140Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.5-లీటర్ 4-సిలిండర్ యూనిట్ ను ఉపయోగించారు. ఇది 4,000rpm వద్ద 90bhp పవర్ ను మరియు 1,250rpm వద్ద 200Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

ప్రస్తుతం, ఈ మూడు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించబడలేదు. టాటా ఆల్ట్రోజ్ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో iRA కనెక్టింగ్ టెక్నాలజీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ వంటి మరెన్నో ఉన్నాయి.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

అంతేకాకుండా, ఇందులో లెదర్‌సీట్లు, మల్టిపుల్ డ్రైవ్‌ మోడ్‌లు, డ్రైవర్‌ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే సౌలభ్యం, రియర్‌ సీటులో అమర్చిన ఆర్మ్‌రెస్ట్‌ , తగినన్ని పవర్ అవుట్‌లెట్‌, వన్‌టచ్‌ పవర్‌ విండోస్‌, క్రూయిజ్ కంట్రోల్‌, ఇంజన్‌ స్టార్ట్‌ అండ్‌ స్టాప్‌ బటన్‌, ఎక్స్‌ప్రెస్‌ కూల్‌ ఫంక్షన్‌ మొదలైనవి కూడా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి మరియు భారతదేశంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్.

Tata Altroz ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ వస్తోంది.. ధృవీకరించిన టాటా మోటార్స్!

టాటా ఆల్ట్రోజ్ యొక్క ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల కొరత దేశంలోని చాలా మంది పట్టణవాసులకు ద్వితీయ ఎంపికగా మారింది. ఆల్ట్రోజ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను ప్రారంభించడంతో, టాటా మోటార్స్ టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలదని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata altroz to get automatic gearbox soon launch confirmed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X