Just In
- 11 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 12 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 16 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 19 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Harrier పై రూ. 10,000 పెంచిన Tata Motors: పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో 2022 ప్రారంభంలోనే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలు అమాంతం పెంచాయి. అయితే ఈ నేపద్యంలో భాగంగానే ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) తన టాటా హారియర్ ధరను కూడా పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ నివేదికల ప్రకారం, టాటా మోటార్స్ తన టాటా హారియర్ ధరను ఇప్పుడు ఏకంగారూ. 500 నుంచి రూ. 10,000 వరకు పెంచింది. దేశీయ మార్కెట్లో వాహన ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగటం వల్ల తమ ఉత్పత్తుల ధరలు కూడా పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. అయితే ధరల పెరుగుదల తరువాత దీని టాప్ వేరియంట్ ధర రూ. 21.19 లక్షలు.

అయితే కంపెనీ యొక్క టాటా హారియర్ యొక్క బేస్ వేరియంట్ XE, XT, XT+ మరియు XT+ కామో వంటి మోడల్స్ పైన ఎలాటి ధరలు పెంచలేదని తెలిపింది. దీని ధర రూ.14.39 లక్షల నుండి ప్రారంభించబడింది. ఇందులోని XM వేరియంట్ ధర రూ. 500 పెరిగింది. అదే సమయంలో XT + డార్క్ ధర రూ. 10,000 పెరిగి రూ. 18.14 లక్షలకు చేరుకుంది. అదేవిధంగా కంపెనీ యొక్క XZ, XZ DT, XZ+, XZ+ DT XZ+ Dark ధరలు కూడా ఇప్పుడు రూ. 5000 వరకు పెరిగాయి. ఇందులో ఇప్పుడు మాన్యువల్ టాప్ వేరియంట్ ధర రూ. 19.94 లక్షలకు చేరుకుంది.

టాటా హారియర్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ విషయానికి వస్తే, దీని XMA వేరియంట్ ధర రూ. 3500 పెరిగి రూ. 17.09 లక్షలకు చేరుకుంది. అదే సమయంలో XZA, XZA DT, XZA+ మరియు XZA+ DT ధరల కూడా దాదాపు రూ. 8,000 పెరిగాయి. ఇందులోని XTA+ డార్క్ మరియు XZA+ డార్క్ ధరలు కూడా రూ. 10,000 వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత దాని ఆటోమేటిక్ వేరియంట్ యొక్క టాప్ మోడల్ ధర రూ. 21.19 లక్షలకు చేరింది. ఇప్పటికే కంపెనీ ఈ మోడల్ ధరలు 2021 ఆగస్టు 2021 లో ఒక సారి పెంచడం జరిగింది.

ఇదిలా ఉండగా టాటా హారియర్ మరియు సఫారి SUV లు ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్ వెల్వెట్ గ్రీన్‌లో తీసుకురాబడతాయి.ఈ రెండూ కూడా బ్లాక్ రైనో బ్యాడ్జ్‌లను పొందుతాయి. అయితే ఈ కలర్ ఆప్సన్ లిమిటెడ్ ఎడిషన్‌గా కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దీని ఇంటీరియర్‌ను డ్యూయల్ టోన్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ కొత్త రంగు ఎంపిక క్యమో గ్రీన్ కంటే కొంచెం తేలికగా ఉండవచ్చు.

టాటా హారియర్ మరియు టాటా సఫారీలను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో అందించడానికి కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ తమ టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్లలో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కావున ఇవి త్వరలో ఈ దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు ఈ కొత్త 2022 సంవత్సరంలో గత సంవత్సరం 2021 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 66,307 యూనిట్లుగా తెలిసింది.

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2020 డిసెంబర్ నెల అమ్మకాల (53,430) కంటే కూడా 2021 డిసెంబర్ నెల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. టాటా మోటార్స్ ఏకంగా 24 వృద్ధిని నమోదు చేయగలిగింది. దీన్ని బట్టి చూస్తే 2020 కంటే 2021 కంపెనీకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలలో 2,255 యూనిట్లు ఎలక్ట్రిక్ వాహనాలు కాగా, 35,299 ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. ఇందులో టాటా టిగోర్ EV అమ్మకాలు మంచి పురోగతిని చూపాయి. అంతే కాకుండా కంపెనీ గత సంవత్సరం టాటా పంచ్ అనే మీరో SUV విడుదల చేసింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి ఇది గణనీయంగా దోహదపడింది.

టాటా మోటార్స్ యొక్క 2021 డిసెంబర్ నెల విక్రయాల గురించి 'టాటా మోటార్స్ లిమిటెడ్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ 'శైలేష్ చంద్ర' మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో ఒక వైపు కరోనా సంక్షోభం, మరో వైపు సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి ప్రజలకు కంపెనీపైన ఉన్న నమ్మకమే ప్రధాన కారణం అని తెలిపారు.

అంతే కాకూండా, 2021 వ సంవత్సరంలో టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు పెరిగాయి. ఇది 2020 కంటే కూడా మంచి పురోగతి, అయితే ఈ 2022 కొత్త సంవత్సరంలో కూడా కంపెనీ మరింత మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నామన్నారు.