Just In
- 13 hrs ago
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- 15 hrs ago
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- 18 hrs ago
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- 19 hrs ago
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
2022 నవంబర్ అమ్మకాలు విడుదల చేసిన టాటా మోటార్స్: పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' 2022 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. ఈ అమ్మకాలు 2021 నవంబర్ నెల కంటే ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2022 నవంబర్ 73,467 వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో కమర్షియల్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే 2021 నవంబర్ నెలలో 58,073 యూనిట్లను మాత్రమే మార్కెట్లో విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 2021 నవంబర్ కంటే 2022 నవంబర్ లో 27 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. అయితే మొత్తమ్ వార్షిక వృద్ధి 54.60 శాతం ఎక్కువ ఉంది.

2021 నవంబర్ నెలలో కమర్షియల్ వాహనాల అమ్మకాలు మునుపటికంటే 10 శాతం అతగ్గుదలను నమోదు చేశాయి. అదే సమయంలో కంపెనీ గత నెలలో 46,037 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఇందులో కార్లు మరియు ఎస్‌యువిలు ఉన్నాయి. అయితే ఈ అమ్మకాలు నవంబర్ 2021 లో 29,778 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మకాలు కూడా 2022 నవంబర్ నెలలో 54.6 శాతం పెరుగుదలను పొందాయి.
టాటా మోటార్స్ 2022 అక్టోబర్ నెలలో 45,217 వాహనాలను విక్రయించింది. కావున ఈ అమ్మకాలు గత నెల కంటే కూడా 1.18 శాతం తక్కువ. అంతే కాకూండా కంపెనీ గత నెలలో 388 ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే కాలంలో అంటే 2021 నవంబర్ నెలలో కేవలం 169 యూనిట్లను ఎగుమతి చేసింది. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 129.58 శాతం పెరిగాయి.
ఇక ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని పరిశీలించినట్లైతే గత నెల కంపెనీ 4,277 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఈ అమ్మకాలు 2021 నవంబర్ కంటే 154.63 శాతం ఎక్కువ. అంటే నవంబర్ 2021 లో కంపెనీ 1,660 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. అదే సమయంలో కంపెనీ 2022 అక్టోబర్ నెలలో 4,451 యూనిట్లను విక్రయించింది. దీనితో పోలిస్తే 2022 నవంబర్ అమ్మకాలు 3.9 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
టాటా మోటార్స్ (Tata Motors) యొక్క కమర్షియల్ వాహన అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ 2021 నవంబర్‌లో 32,245 యూనిట్ల ను విక్రయించింది. అయితే 2022 నవంబర్ నెలలో 29,053 యూనిట్లను విక్రయించింది. ఇందులో ఎగుమతి చేసిన కమర్షియల్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మకాలు 2021 నవంబర్ కంటే 10 శాతం తక్కువ. అంటే 2022 నవంబర్ అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
దేశీయ మార్కెట్లో మాత్రం టాటా మోటార్స్ 27,430 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ విక్రయించగలిగింది. అదే 2021 నవంబర్ నెలలో దేశీయంగా 28,295 యూనిట్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి చూసినా దేశీయ మార్కెట్లో కమర్షియల్ వాహన అమ్మకాలు 2022 నవంబర్ లో 3 శాతం తగ్గాయి. అదే సమయంలో ఇంటర్మీడియట్, తేలికపాటి వాణిజ్య వాహనాలు, కార్గో మరియు పికప్ ట్రక్కుల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి.
టాటా మోటార్స్ అమ్మకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ వాహన తయారీ దిగ్గజమైన టాటా మోటార్స్ యొక్క కార్ల అమ్మకాలు 2021 నవంబర్ కంటే మెరుగుపడ్డాయి, అయితే కమర్షియల్ వాహనాల అమ్మకాలలో మాత్రం ఆశించిన ఫలితాలను తీసుకోలేకపోయింది. అయితే ఈ నెలలో మంచి అమ్మకాలను పొందుతుందా.. లేదా అనేది వచ్చే నెలలో తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.