కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) మార్కెట్లో విక్రయిస్తున్న తమ 7-సీటర్ ఎస్‌యూవీ టాటా సఫారీ (Tata Safari)లో ఇటీవలే XMS మరియు XMAS అనే రెండు కొత్త వేరియంట్‌లను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ రెండు కొత్త వేరియంట్ల ధరలు వరుసగా రూ. 17.97 లక్షలు మరియు రూ. 19.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. అయితే, మీరు ఇందులో కొత్త సఫారి XMS వేరియంట్‌ను ఎందుకు కొనుగోలు చేయాలనే 10 కారణాలను వివరించే కొత్త టీవీ ప్రకటనను టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసింది. ఆ కారణాలేంటో మనం కూడా చూసేద్దాం రండి.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

టాటా సఫారీ లైనప్‌లో కొత్తగా XMS మరియు XMAS వేరియంట్‌లను చేర్చడంతో కంపెనీ ఈ మోడల్ లైనప్‌ను విస్తరించింది మరియు కొనుగోలుదారులకు మరిన్ని ఎక్కువ ఆప్షన్లను అందించింది. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే, సుమారు రూ. 1.17 లక్షలు అధిక ధర కలిగిన ఈ ప్రీమియం వేరియంట్‌లో కంపెనీ అధనంగా పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌ల వంటి మరెన్నో ఫీచర్లను అందించింది. ఆ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

1. OMEGARC ప్లాట్‌ఫామ్

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క డి8 (D8) ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకోబడిన OMEGARC (ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిషియెంట్ గ్లోబల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్‌పై కొత్త సఫారీని నిర్మించింది. దీని ఛాసిస్ మోనోకోక్ నిర్మాణాన్ని కలిగి ఉండి, చాలా తేలికగా ఉంటుంది. అదే సమయంలో ఇది మెరుగైన బిల్డ్ క్వాలిటీని కూడా కలిగి ఉంటుంది. అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, తేలికైన నిర్మాణం మరియు మెరుగైన భద్రత యొక్క అదనపు ప్రయోజనాల వలన కస్టమర్లు టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్‌ను ఎంచుకునేలా చేస్తాయని కంపెనీ తెలిపింది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

2. సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

టాటా సఫారీ ఎస్‌యూవీలో కొత్తగా వచ్చిన XMS వేరియంట్ ఇప్పుడు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ అధునాతన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టిప్‌ట్రానిక్ ఫంక్షన్‌తో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తూ, మీ రోజువారీ సిటీ డ్రైవ్‌లను సులభతరం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకించి, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలలో ప్రయాణించే వారికి ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పనితీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

3. క్రయోటెక్ 170 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్

టాటా సఫారీ దాని తోబుట్టువైన టాటా హారియర్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ లోని 2.0 లీటర్ ఫియట్ క్రియోటెక్ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లతో జత చేయబడి ఉంటుంది. టాటా సఫారిలోని ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ అన్ని రకాల భూభాగాలపై డ్రైవ్ చేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

4. పానోరమిక్ సన్‌రూఫ్

టాటా సఫారీ యొక్క లేటెస్ట్ వేరియంట్లయిన XMS మరియు XMAS లు ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతాయి. ఇవి చూడటానికి ఓ కన్వర్టబల్ కారును నడుపుతున్న అనుభూతిని అందిస్తాయి. భారతీయ వాతావరణ పరిస్థితుల్లో దీని ఉపయోగం మరియు దాని ప్రాక్టికాలిటీ వివాదాస్పదమైన అంశమే అయినప్పటికీ, ఎస్‌యూవీలోని ఈ ఫీచర్ మాత్రం చాలా మందికి బాగా నచ్చుతుంది. ప్రత్యేకించి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణాలు చేసే వారు దీనిని ఎక్కువగా ఇష్టపడుతారు.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

5. ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్

సంగీత ప్రియులను అలరించడం కోసం టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ ఇప్పుడు 8 స్పీకర్లతో కూడిన హార్మన్ ఆడియో సిస్టమ్ తో లభిస్తుంది. సఫారీలోని ఈ కొత్త ఆడియో సిస్టమ్ మీ చెవులకు ఇంపైన సంగీతాన్ని అందిస్తుంది. ఈ సౌండ్ సిస్టమ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా మెరుగ్గా అనిపిస్తుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

6. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే

ప్రస్తుతం, అనేక కార్లలో ఎక్కువగా ప్రస్థావించబడే ఫీచర్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ. ప్రస్తుత టెక్ యుగంలో కార్లలో ఈ ఫీచర్ ఓ వరం లాంటిది. స్మార్ట్‌ఫోన్లు నేరుగా కారుకి కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఫోన్లతో చేయగలిగే అనేక పనులను కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో చేయవచ్చు.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

7. బహుళ డ్రైవ్ మోడ్‌లు

టాటా సఫారీ కేవలం సిటీ ప్రయాణాలకు మాత్రమే కాదు, చిన్నపాటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందుకోసం కంపెనీ వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లను కూడా ఈ ఎస్‌యూవీలో అందిస్తోంది. టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్‌లో ఎకో, సిటీ మరియు స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. డ్రైవర్ ఎంచుకునే డ్రైవ్ మోడ్‌ని కారులోని ఇంజన్ పనితీరు మారుతూ ఉంటుంది. ఇందులో స్పోర్ట్ మోడ్‌లో ఇంజన్ పనితీరు గరిష్టంగా ఉంటుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

8. 7-ఇంచ్ ఫ్లోటింగ్ ఐలాండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్లో మిమ్మల్ని ప్రధానంగా ఆకట్టుకునే మరొక ఫీచర్, క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఆధునిక కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఈ డిస్‌ప్లే యూనిట్ క్యాబిన్ లోపల అనేక విధులను నిర్వర్తిస్తుంది. సంగీతం వినడానికి, మ్యాప్స్ నావిగేట్ చేయడానికి, కాల్స్ రిసీవ్ చేయడానికి మరియు అనేక ఇతర విధులు నిర్వర్తించడానికి ఇది ఉపయోగపుడుతుంది. ఈ స్క్రీన్ రెజల్యూషన్ కూడా కళ్లకు చాలా ఇంపుగా ఉంటుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

9. రివర్స్ పార్కింగ్ కెమెరా

కారును బ్యాకప్ (రివర్స్) చేసేటప్పుడు మరియుపార్క్ చేసేటప్పుడు ఉపయోగపడేందుకు వీలుగా టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇరుకైన ప్రదేశాలలో కారును పార్క్ చేసే వారికి లేదా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ (Tata Safari XMS) వేరియంట్ కొనడానికి గల టాప్ 10 కారణాలు..

10. రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు

టాటా సఫారీ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్‌లో మరొక ఉపయోగకరమైన ఫీచర్, అందులో ఉండే రెయిన్ సెన్సింగ్ వైపర్ సిస్టమ్. వర్షం రావడాన్ని గుర్తించి, డ్రైవర్ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా వైపర్లు ఆన్ అవ్వడం ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. వర్షాకాలంలో మరియు విండ్‌షీల్డ్ పై నీరు పడినప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవే కాకుండా, టాటా సఫారీలో అనేక ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి.

Most Read Articles

English summary
Tata motors explains top 10 key features of new safari xms variant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X