బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

టాటా మోటార్స్ ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా మార్కెట్ లీడర్ స్థానంలో కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. టాటా మోటార్స్ సరసమైన ధరలకే ఇటు ప్రైవేట్ మరియు ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల పట్ల కొనుగోలుదారులు కూడా ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తాజాగా, ఈ కంపెనీకి ఓ భారీ ఆర్డర్ లభించింది. బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుండి 10,000 యూనిట్ల టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ కోసం టాటా మోటార్స్ ఆర్డర్ పొందింది.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

ఈ కొత్త ఒప్పందంలో భాగంగా టాటా మోటార్స్ తమ టిగోర్ ఈవీ (Tata Tigor EV) ఆధారంగా తయారు చేసిన టాటా ఎక్స్‌ప్రెస్-టి (Tata XPRES-T EV) యొక్క 10,000 యూనిట్లను బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Blusmart Electric Mobility) కి డెలివరీ చేయనుంది. బ్లూస్మార్ట్ ఇప్పటికే టాటా మోటార్స్ నుండి ఆర్డర్ చేసిన 3,500 ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది అదనంగా ఉంటుంది. ఇంత పెద్ద ఆర్డర్‌తో, భారత ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్య స్థానం మరింత సుస్థిరం అవుతుందని భావిస్తున్నారు.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ అందిస్తున్న కార్లు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ బ్రాండ్ చిన్న కారు ప్రియుల నుండి పెద్ద ఎస్‌యూవీలను కోరుకునే వారి వరకూ వివిధ విభాగాలలో వాహనాలను అందిస్తోంది. ఈ బ్రాండ్ చిన్న ప్రయాణీకుల వాహనాల నుండి, అతిపెద్ద వాణిజ్య వాహనాల వరకు ఆటోమొబైల్ మార్కెట్లో దాదాపు అన్ని విభాగాలను కవర్ చేస్తూ, అత్యంత వైవిధ్యమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంది.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

టాటా మోటార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ విభాగంలో చక్కగా రాణిస్తోంది. ఈ కంపెనీ తొలిసారిగా 2018 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో టాటా టిగోర్ ఈవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఆ సమయంలో ఇది ప్రొడక్షన్‌కి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది మరియు త్వరలోనే ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ఆ తర్వాత 2019 లో టాటా టిగోర్ ఈవీ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, మొదట్లో టాటా టిగోర్ ఈవీ కేవలం ఫ్లీట్ ఆపరేటర్లకు (టాక్సీ మాదిరిగా వాణిజ్య వినియోగం ఉపయోగించే వారి కోసం) మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇది ఆ సమయంలో ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేది.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

ఆ టాటా టిగోర్ ఈవీ విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అందరూ అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఫ్లీట్ ఆపరేటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం అనాలోచిత నిర్ణయంగా భావించారు. అయితే, ఇప్పుడు ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ నాచ్‌బ్యాక్ కోసం ఇంత పెద్ద ఆర్డర్‌లు ఇవ్వడంతో ఇది అద్భుతమైన నిర్ణయం అని అంటున్నారు. గడచిన 2020లో టాటా నెక్సాన్ ఈవీ విడుదలైంది, ఇది నేటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం దాని సరమైన ధర.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

టిగోర్ ఈవీ ధర పట్ల కస్టమర్లు సంచృప్తి చెందినప్పటికీ, దాని రేంజ్ విషయంలో మాత్రం అసహనం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ టిగోర్ ఈవీని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది మరియు దీనిని వ్యక్తిగత కొనుగోలుదారులకు కూడా అందుబాటులోకి ఉంచింది. ఇందుకోసం టాటా మోటార్స్ 2021లో, టిగోర్ ఈవీ లైనప్‌ను రెండు వేర్వేరు బ్రాండ్‌లుగా మార్చింది. వాటిలో ఒకటి Tigor EV, ఇది ప్రైవేట్ ప్యాసింజర్ వాహన వినియోగం కోసం కేటాయించబడింది. కాగా, రెండవది XPRES-T, ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబడింది.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

ఎలక్ట్రిక్ నాచ్‌బ్యాక్ కోసం టాటా మోటార్స్ బహుళ భారీ ఆర్డర్‌లను పొందడంతో టాటా ఎక్స్‌ప్రెస్-టి గొప్ప విజయాన్ని సాధించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గడచిన ఏప్రిల్ 2022 నెలలో, టాటా మోటార్స్ 5,000 యూనిట్ల XPRES-Tని లిథియం అర్బన్ టెక్నాలజీస్‌కు డెలివరీ చేయడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 3,500 యూనిట్ల ఎక్స్‌ప్రెస్-టి కార్లకు ఆర్డర్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్ మరో 10,000 యూనిట్లకు ఆర్డర్ చేసింది.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ (Tata XPRES-T EV) గురించి క్లుప్తంగా..

టాటా ఎక్స్‌ప్రెస్-టి విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది మరియు ఈ వేరియంట్‌ల మధ్యలో అతిపెద్ద వ్యత్యాసం ఏంటంటే, వాటి బ్యాటరీ ప్యాక్స్ మరియు పూర్తి చార్జ్ పై అవి అందించే రేంజ్. బేస్ వేరియంట్లలో 16.5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది మరయు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. కాగా, టాప్-ఎండ్ వేరియంట్లలో 21.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది పూర్తి చార్జ్ పై 213 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇవి రెండూ కూడా ARAI సర్టిఫై చేసిన రేంజ్‌లు, వాస్తవ పరిస్థితుల్లో ఇవి వేరుగా ఉండొచ్చు.

బ్లూస్మార్ట్ నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్..

ఈ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే, అనేక నగరాల్లోని ఫ్లీ డిపోలు ఫాస్ట్ ఛార్జర్‌లను కలిగి ఉన్నాయి మరియు ఈ రెండు మోడల్‌లు కూడా వాటికి అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు వేరియంట్లను ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, 0-80 శాతం ఛార్జింగ్ చేయడానికి వరుసగా 90 నిమిషాలు మరియు 110 నిమిషాల సయమం పడుతుంది. అంతే కాకుండా, Tata XPRES-T ఎలక్ట్రిక్ కారును 15A ప్లగ్ ద్వారా కూడా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఈబిడి వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata motors gets 10000 evs order from blusmart electric mobility
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X