హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

భారత ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్ (Harrier) లో కంపెనీ కొత్తగా మరో మూడు వేరియంట్లను పరిచయం చేసింది. హారియర్ ఎస్‌యూవీని కొనాలనుకునే వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను అందించాలనే లక్ష్యంతో, టాటా మోటార్స్ హారియర్ కోసం ఎక్స్‌జెడ్ఎస్, ఎక్స్‌జెడ్ఎస్ డ్యూయల్-టోన్ మరియు ఎక్స్‌జెడ్ఎస్ డార్క్ ఎడిషన్ అనే మూడు కొత్త వేరియంట్‌లను పరిచయం చేసింది. వీటి ధరలు రూ.20 లక్షల నుంచి రూ.21.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

టాటా హారియర్ లో కొత్తగా వచ్చిన XZS, XZS Dual-Tone మరియు XZS Dark Edition డార్క్ ఎడిషన్ వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Variant Price
XZS ₹20.00 Lakh
XZAS DT ₹20.20 Lakh
XZS Dark Edition ₹20.30 Lakh
XZAS DT ₹21.50 Lakh
XZAS Dark Edition ₹21.60 Lakh
XZAS ₹21.30 Lakh
హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

ఈ కొత్త వేరియంట్లలో లో-ఎండ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఫీచర్లతో పాటుగా, పానోరమిక్ సన్‌రూఫ్, ఆర్17 డ్యూయల్-టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, సర్దుబాటు చేయగల లంబార్ సపోర్ట్‌తో కూడిన 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు అదనంగా లభిస్తాయి. ఇంతకు ముందు, ఈ ఫీచర్లన్నింటినీ కోరుకునే కస్టమర్లు టాప్-స్పెక్ XZ+ లేదా ZXA+ వేరియంట్‌లను ఎంచుకోవాల్సి ఉండేది.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

అయితే, హారియర్ కొత్త వేరియంట్‌లు వెంటిలేటెడ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్లు మరియు iRA కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కోల్పోతాయి. ఈ ఫీచర్లు కావాలనుకుంటే, XZ+, ZXA+ మరియు కాజిరంగా ఎడిషన్‌ లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. హారియర్ కొత్త వేరియంట్‌లతో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ ఫీచర్లలో జెనాన్ హెచ్‌ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు మొదలైనవి ఉన్నాయి.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

ఇక ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, కొత్త టాటా హారియర్ లోపలి భాగంలో పెద్ద 8.8 ఇంచ్ ఫ్లోటింగ్ ఐలాండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, జెబిఎల్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్ మరియు పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

సేఫ్టీ విషయానికి వస్తే, టాటా హారియర్ కొత్త వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆఫ్-రోడ్ ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్‌లు, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, పెరిమెట్రిక్ అలారం సిస్టమ్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మొదలైన అధునాతన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

ఇంజన్ పరంగా ఈ కొత్త వేరియంట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం టాటా హారియర్ ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జత చేయబడి ఉంటుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

ఇదిలా ఉంటే, టాటా తమ పాపులర్ హారియర్ ఎస్‌యూవీలో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. బహుశా ఇది 150 హెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే కొత్త 1.5 లీటర్ పెట్రోల్ మోటారు కావచ్చని సమాచారం. ఈ ఇంజన్ కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ 2023 లో విడుదల కావచ్చని అంచనా. ఇది అధునాతన డ్రైవర్ అసిస్టెడ్ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

హారియర్‌లో 3 కొత్త వేరియంట్లను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు మరింత సరసమైన ధరకే..

ఇదిలా ఉంటే, టాటా హారియర్ (Tata Harrier) మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ ఇటీవలే రెండు కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. టాటా హారియర్ ఇప్పుడు రాయల్ బ్లూ (Royal Blue) మరియు ట్రాపికల్ మిస్ట్ (Tropical Mist) అనే రెండు కొత్త ఎక్స్టీరియర్ కలర్లలో లభిస్తుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ ఇప్పటికే అందిస్తున్న ఇతర కలర్ ఆప్షన్లతో పాటుగా అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కోసం కంపెనీ అందిస్తున్న ఇతర కలర్ ఆప్షన్లలో ఓర్కస్ వైట్, కాలిప్సో రెడ్ మరియు డేటోనా గ్రేలు కూడా ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tata motors introduces 3 new variants in harrier now gets more features at lower price
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X