దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్' (Tata Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు రెండు కొత్త 'హారియర్' (Harrier) వేరియంట్లను విడుదల చేసింది. అవి ఒకటి హారియర్ XMAS కాగా, మరొకటి హారియర్ XMS వేరియంట్స్.

కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ రెండు వేరియంట్ల ధరలు మరియు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

టాటా మోటార్స్ యొక్క హారియర్ XMAS ధర రూ. 18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, హారియర్ XMS ధర రూ. 17.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండు వేరియంట్లు ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతాయి.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

టాటా హారియర్ XMS వేరియంట్ అనేది XM మరియు XT వేరియంట్‌ల మధ్య ఉంటుంది. అంతే కాకూండా ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే హారియర్ XMAS వేరియంట్ XMA మరియు XTA+ వేరియంట్‌ల మధ్య ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

కొత్త టాటా హారియర్ XMS మరియు XMAS వేరియంట్లు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కావున ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి వాటితోపాటు ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

నిజానికి పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పటివరకు హారియర్ యొక్క XT+ మరియు XTA+ వేరియంట్‌లలో అందుబాటులో ఉండేది. అయితే ఈ ఫీచర్ ఉండటం వల్ల ఈ వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 18.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన కొత్త వేరియంట్స్ (XMS మరియు XMAS) లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. కాగా ధరలు కూడా XT+ మరియు XTA+ వేరియంట్స్ కంటే కూడా రూ. 1 లక్ష తక్కువగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

టాటా హారియర్ లో ఇప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ కావాలనుకునే వారు, ఇప్పుడు XMS మరియు XMAS వేరియంట్స్ కొనుగోలుతో ఒక రూ. 1 లక్ష దాకా కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

కొత్త హారియర్ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ 4-సిలిండర్ క్రయోటెక్ బిఎస్6 డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 167.6 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

ఇక ఈ కొత్త వేరియంట్స్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, హారియర్ యొక్క మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ ఒక లీటరుకు 16.35 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అదే సమయమూ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్ ఒక లీటరుకు 14.6 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

టాటా హారియర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ డిస్క్ వైపింగ్, సెంట్రల్ లాకింగ్‌ వంటివి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో టాటా హారియర్ కొత్త వేరియంట్స్ లాంచ్.. తక్కువ ధర & లేటెస్ట్ ఫీచర్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో హారియర్ SUV ని విక్రయిస్తోంది. అయితే ఇప్పుడు మరో కొత్త వేరియంట్స్ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా తక్కువ ధర వద్ద లభించడం ఇక్కడ విశేషం. ఇప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ తో తక్కువ ధరకే ఈ రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఈ రానున్న విజయదశమి, దీపావళి సందర్భంగా కొనుగోలు చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata motors introducing all new harrier xmas and xms varients price and details
Story first published: Friday, September 16, 2022, 18:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X