2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఎట్టకేలకు 2022 జూన్ నెల అమ్మకాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ అందించిన నివేదికల ప్రకారం 2021 జూన్ కంటే కూడా 2022 జూన్ అమ్మకాలు 82 శాతం పెరిగాయని తెలుస్తోంది. టాటా మోటార్స్ యొక్క అమ్మకాలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

కంపెనీ విడుదల చేసిన అమ్మకాల గణాంకాల ప్రకారం, 2022 జూన్ నెలలో మొత్తం 79,606 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే 2021 అమ్మకాలు కేవలం 43,704 యూనిట్లు మాత్రమే. కావున అమ్మకాల పరంగా కంపెనీ మునుపటి సంవత్సరం కంటే 82 శాతం వృద్ధిని నమోదుచేయగలిగింది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

కమర్షియల్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే గత సంవత్సరం 2021 జూన్ లో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి మొత్తం 22,100 యూనిట్లు అని తెలిసింది. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య 34,409 కి చేరింది. అంటే కమర్షియల్ వాహనాల అమ్మకాలలో కూడా కంపెనీ 69 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

ఇక ప్యాసింజర్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే.. 2022 జూన్ నెలలో మొత్తం 45,197 యూనిట్లు అని తెలిసింది. అదే గత ఏడాది ఈ అమ్మకాల సంఖ్య కేవలం 24,110యూనిట్లు మాత్రమే అని తెలిసింది. అంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 87 శాతం పెరిగాయి.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

2021 జూన్ నెలతో పోలిస్తే జూన్ 2022 లో పెట్రోల్ మరియు డీజిల్ కార్ల విక్రయాలు 78 శాతం పెరిగి 41,690 యూనిట్లకు చేరుకోగా, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 433 శాతం పెరిగి 3,507 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం మీద కంపెనీ అమ్మకాలు 2021 కంటే 2022 లో మరింత మెరుగ్గా ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

2022 మొదటి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గరిష్టంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడమే. అంతే కాకూండా మే 2022లో లాంచ్ భారతీయ మార్కెట్లో విడుదలైన టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ కూడా కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి సహకరించింది. ఇది మాత్రమే కాకుండా టాటా నెక్సాన్ ఈవి స్టాండర్డ్ మోడల్ కూడా అమ్మకాల వృద్ధికి బాగానే దోహదపడింది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ 2022 జులై 01 నుంచి తన వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కావున కంపెనీ ఇందులో భాగంగానే ఇప్పుడు వాణిజ్య వాహనాల ధరలను 1.5 శాతం నుంచి 2.5 శాతం పెంచింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వాహన తయారీకి కావలసిన ముడిసరుకుల ధరలు పెరగటమే. ఈ కారణంగానే కంపెనీ నిరంతరం తమ ఉత్పత్తుల ధరలను పెంచడం జరుగుతోంది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

2021 లో కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం కరోనా విజృంభణ. ఈ సమయంలో సెమి కండక్టర్ చిప్ కొరతను కూడా కొంత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఉత్పత్తి మరియు ఎగుమతులు పూర్తిగా తగ్గాయి. అయితే ఆ తరువాత కార్న్ కొంత తగ్గుముఖం పట్టిన తరువాత అమ్మకాలు మెల్ల మెల్లగా వృద్ధి చెందటం ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ యొక్క అమ్మకాలు బాగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

టాటా మోటార్స్ రానున్న రోజుల్లో దేశంలో సెమీకండక్టర్ చిప్ తయారీలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటీవల, ఆటోమేకర్ సెమీకండక్టర్ల డిజైన్, డెవెలప్ మరియు ఉత్పత్తి కోసం జపాన్ యొక్క సెమీకండక్టర్ కంపెనీ, రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. టాటా గ్రూప్‌కు అనుబంధ సంస్థ అయిన తేజాస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ మరియు రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ మధ్య కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

4G నుండి 5G మరియు ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (O-RAN) కోసం టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లలో ఉపయోగించే రేడియో యూనిట్ల సెమీకండక్టర్ సొల్యూషన్‌లతో సహా తదుపరి తరం వైర్‌లెస్ నెట్‌వర్క్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి రెనెసాస్ మరియు తేజాస్ నెట్‌వర్క్స్ తో కలిసి ముందుకు సాగుతుంది. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో సెమీకండక్టర్ చిప్ కొరత దాదాపు తీరినట్లే అని స్పష్టంగా తెలుస్తోంది.

2022 జూన్ అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్: సేల్స్ వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టాటా మోటార్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అమ్మకాల్లో మునుపటి సంవత్సరం కంటే మంచి పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేయడం మరియు అప్డేట్ చేయడం వల్ల కంపెనీ యొక్క అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా రానున్న రోజుల్లో కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందనే ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Tata motors june 2022 sales details
Story first published: Saturday, July 2, 2022, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X