భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో మూడు సరికొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. వీటిలో ఒక పికప్ ట్రక్కు మరియు రెండు తేలికపాటి వాణిజ్య వాహనాలు (లైట్ కమర్షియల్ వెహికల్) ఉన్నాయి. వాటి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

లైట్ వెయిట్ కమర్షియల్ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న టాటా మోటార్స్, దేశీయ సివి మార్కెట్‌లో యోధా 2.0 (Yodha 2.0), ఇంట్రా వి20 బై-ఫ్యూయల్ (Intra V20 Bi-fuel) మరియు ఇంట్రా వి50 (Intra V50) మోడళ్లను విడుదల చేసింది. వీటిలో టాటా యోధా 2.0 హార్డ్ కోర్ పికప్ ట్రక్కు కాగా మిగిలిన రెండు మోడళ్లు లైట్ కమర్షియల్ వెహికల్స్‌గా ఉంటాయి. ఈ పికప్ ట్రక్కులు కొత్త డిజైన్‌ను కలిగి ఉండి, పొడవైన డెక్, అత్యధిక పవర్-టు-వెయిట్ రేషియో, ఆధునిక ఫీచర్లు మరియు అధిక పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

ఈ కొత్త మోడళ్లలో టాటా యోధా 2.0 అత్యంత తెలివైన మరియు సౌకర్యవంతమైన పికప్ ట్రక్. వెర్షన్ 2.0 (టూ పాయింట్ ఓ)గా వచ్చిన ఈ కొత్త మోడల్ మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్‌ను 2020 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించారు. కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన అవాంతరాల కారణంగా దీని లాంచ్ వాయిదా పడుతూ వచ్చింది. కాగా, ఎట్టకేలకు ఇప్పుడు ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

టాటా యోధా 2.0 పికప్ ట్రక్ దాని మునుపటి యోధా కన్నా ఎన్నో రెట్లు మెరుగైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. సరికొత్త క్రోమ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్‌లు మరియు యోధా సిరీస్‌లో మొదటిసారిగా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్‌ల కోసం కొత్త స్క్వారీష్ హౌసింగ్‌ మరియు బంపర్ దిగువ పెద్ద ఎయిర్ డ్యామ్ వంటి మార్పులు ఉన్నాయి. అర్బన్, సెమీ-అర్బన్ మరియు గ్రామీణ మార్కెట్లలోని రవాణా అవసరాలను లక్ష్యంగా చేసుకుని కొత్త టాటా యోధా 2.0 ని అప్‌గ్రేడ్ చేశారు.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

యోధా 2.0 టాటా యొక్క సిగ్నేచర్ 'ట్రస్ట్ బార్' తో కఠినమైన భూభాగాలను సైతం సులువుగా పరిష్కరించగలదని కంపెనీ పేర్కొంది ఈ మోడల్ 4×4 (ఆల్-వీల్ డ్రైవ్) మరియు 4×2 (టూ-వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్‌లలో 1,200 కేజీలు, 1,500 కేజీలు మరియు 1,700 కేజీల పేలోడ్ సామర్థ్యంతో లభిస్తుంది. అలాగే, ఇది కస్టమర్ల ఎంపికను బట్టి సింగిల్ క్యాబ్ మరియు క్రూ క్యాబ్ అనే అదనపు సీటింగ్ కెపాసిటీతో కూడా లభిస్తుంది. ఇది 30 శాతం గ్రేడ్ సామర్థ్యంతో పాటు 2-టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

టాటా యోధా 2.0 పికప్ ట్రక్కులో శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏసి విత్ హీటర్ కలిగిన వేరియంట్ ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. అలాగే, ఏసితో కూడిన క్రూ క్యాబ్ ఈఎక్స్ వేరియంట్ ధర రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని అధీకృత టాటా కమర్షియల్ వెహికల్ డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

ఇక టాటా మోటార్స్ అందిస్తున్న బై-ఫ్యూయెల్ కమర్షియల్ వెహికల్ (రెండు రకాల ఇంధనాలతో నడిచే వాణిజ్య వాహనం) టాటా ఇంట్రా వి20 బై-ఫ్యూయెల్ మరియు ఇంట్రా వి50 పికప్ ట్రక్కులను ప్రధానంగా వ్యవసాయం, పౌల్ట్రీ మరియు పాడి పరిశ్రమల వంటి సేవలకు అలాగే FMCG సేవలు మరియు ఇ- డెలివరీ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ఇవి వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ రంగాలలో కస్టమర్‌లకు గరిష్ట లాభాలను అందించడానికి వీలుగా వాటి విభాగాలలో యాజమాన్యం యొక్క అతి తక్కువ మొత్తం ధరను అందజేస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

ఈ రెండింటిలో టాటా ఇంట్రా వి50 అధిక పేలోడ్ సామర్థ్యం, ​​మెరుగైన క్యాబిన్ సౌకర్యం, పొడవైన లోడ్ డెక్, అర్బన్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో అన్ని రకాల భూభాగాలపై నడిపేందుకు వీలుగా అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ వంటి అంశాలతో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇకపోతే, కొత్త ఇంట్రా వి20 పికప్ 1,000 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి బై-ఫ్యూయెల్ (పెట్రోల్ + సిఎన్‌జి) వాహనం అని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు గరిష్ట లాభాలను చేకూర్చేలా, తక్కువ నిర్వహణ వ్యయంతో తయారు చేయబడిందని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..

ఇంట్రా వి50 స్మార్ట్ పికప్ 1500కేజీల పేలోడ్ సామర్థ్యంతో అతిపెద్ద డెక్ పొడవును కలిగి ఉంటుంది. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది మరియు ఈ ఇంజన్ గరిష్టంగా 220 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇంట్రా వి20 విషయానికి వస్తే, దీని పేలోడ్ సామర్థ్యం 1000 కిలోలుగా ఉంటుంది మరియు ఇది పూర్తి ట్యాంక్ ఇంధనాలతో 700 కిలోమీటర్ల సుధీర్ఘమైన రేంజ్‌ను అందించే భారతదేశపు మొదటి బై-ఫ్యూయెల్ పికప్ ట్రక్కు. ఇది 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 106 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Tata motors launches yodha 2 0 intra v20 bi fuel and intra v50 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X