హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

ప్రస్తుతం, భారతదేశంలో అగ్రగామి ప్యాసింజర్ కార్ కంపెనీల జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ ద్వితీయ స్థానంలో మరియు టాటా మోటార్స్ తృతీయ స్థానంలో ఉంది. అయితే, గత కొంత కాలంగా టాటా మోటార్స్ అద్భుతమైన అమ్మకాల పనితీరును కనబరుస్తోంది. టాటా మోటార్స్ విడుదల చేస్తున్న కొత్త కార్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది, దీంతో కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

టాటా మోటార్స్ ఇప్పుడు భారతదేశపు ద్వితీయ అగ్రాగమి కార్ కంపెనీగా అవతరించేందుకు కావల్సిన అన్ని అర్హతలను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కార్ విభాగంలో ఇప్పటికే భారతదేశపు నెంబర్ వన్ కంపెనీగా ఉన్న టాటా మోటార్స్, ట్రెడిషనల్ ప్యాసింజర్ కార్స్ విభాగంలో కూడా అగ్రస్థానాలపై కన్నేసింది. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో హ్యుందాయ్ అమ్మకాలను ఓవర్‌టేక్ చేసి, రెండవ స్థానంలో నిలిచిన టాటా మోటార్స్, శాస్వతంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

గడచిన సెప్టెంబర్ 2022 నెలలో టాటా మోటార్స్ దేశీయ విపణిలో మొత్తం 47,654 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2021 నెలలో) విక్రయించిన 25,730 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత నెలలో మొత్తం అమ్మకాలలో 85 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా, గడచిన నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో 49,700 వాహనాలను విక్రయించింది. గత నెలలో టాటా మోటార్స్, హ్యుందాయ్‌కి చాలా దగ్గర పోటీ ఇచ్చింది.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

సెప్టెంబర్ 2022 నెలలో మారుతి సుజుకి మొత్తం 1.55 లక్షల వాహనాలను విక్రయించి మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ 49,700 యూనిట్లతో ద్వితీయ స్థానంలో మరియు టాటా మోటార్స్ 47,654 యూనిట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. రాబోయే నెలల్లో టాటా మోటార్స్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, టాటా మోటార్స్ గడచిన నెలలో భారతదేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీని ఆవిష్కరించింది. ఇది మరికొద్ది నెలల్లోనే (జనవరి 2023లో) అమ్మకానికి రానుంది.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీ కార్లకు ఇప్పటికే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అలాంటి, అతి తక్కువ ధరకే (రూ. 8.49 లక్షలకే) ఓ టాటా ఎలక్ట్రిక్ కారు లభిస్తే, ఇక ఆ మోడల్ అమ్మకాలు ఏ రీతిలో ఉండబోతాయో చెప్పనవసరం లేదు. కంపెనీ అమ్మకాల గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్‌ల రికార్డు అమ్మకాల నేపథ్యంలో కంపెనీ గత నెలలో 47,654 నెలవారీ అమ్మకాలను సాధించిందని తెలిపారు.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

ఇటీవల టియాగో ఈవీని ప్రారంభించడంతో కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త మార్గాలను తెరిచిందని మరియు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రిటైల్ విక్రయాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పండుగ సీజన్‌లో సరఫరా మెరుగుపడుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్లో టియాగో ఈవీ ధరలు రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

గత నెలలో కేవలం అంతర్గత దహన ఇంజన్ (పెట్రోల్/డీజిల్) కార్ల అమ్మకాలను గమనిస్తే, ఇవి 43,999 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2021లో ఇవి కేవలం 24,652 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో పెట్రోల్/డీజిల్ కార్ల అమ్మకాలు 78.48 శాతం వృద్ధి చెందాయి. ఇక, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల విషయానికి వస్తే, గత సెప్టెంబర్‌లో మొత్తం 3,655 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించబడ్డాయి. ఇవి సెప్టెంబర్ 2021లో విక్రయించిన 1,078 ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే, 239.05 శాతం వృద్ధి చెందాయి.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, గత ఏడాది సెప్టెంబర్‌లో విక్రయించిన 30,258 యూనిట్ వాణిజ్య వాహనాలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 9 శాతం పెరిగి 32,979 యూనిట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 నెలలో దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ మొత్తం వాహనాల (ప్రయాణీకులు మరియు వాణిజ్య) విక్రయాలు 80,633 యూనిట్లుగా నమోదయ్యాయి, ఇది సెప్టెంబర్ 2021 నెల అమ్మకాల కంటే 44 శాతం అధికం. గత నెలలో, టాటా మోటార్స్ యోధా 2.0, ఇంట్రా వి20 సిఎన్‌జి మరియు ఇంట్రా వి50 అనే మూడు పిక్-అప్ వాహనాలను విడుదల చేసింది.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

అక్టోబర్ 10వ తేదీ నుండి టాటా టియాగో ఈవీ బుకింగ్స్..

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే విడుదల చేసిన తమ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ కోసం అక్టోబర్ 10, 2022వ తేదీ నుండి బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం రూ.8.49 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. అంతేకాకుండా, ఇది పూర్తి చార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిరింది. టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో 7 వేరియంట్లలో విడుదల చేయబడింది.

హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!

టాటా టియాగో ఈవీ పరిచయ ధరలు మొదటి 10,000 యూనిట్ల బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని, ఆ తర్వాత నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. టియాగో ఈవీ డెలివరీలను జనవరి 2023 నుండి ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్లు 19.2kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుండగా, టాప్-స్పెక్ వేరియంట్లు 24kWh బ్యాటరీ ప్యాక్‌తో లభ్యం కానున్నాయి. బేస్ వేరియంట్లు పూర్తి చార్జ్ పై 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుండగా, టాప్-స్పెక్ వేరియంట్లు పూర్తి ఛార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Tata motors sold 47654 unit cars in september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X