గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

టాటా మోటార్స్ గత కొంత కాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ వస్తోంది. దేశీయ మార్కెట్లో టాటా కార్లకు అన్ని వర్గాల కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్ తమ ఫరెవర్ రేంజ్ మోడళ్లను ప్రవేశపెట్టిన తర్వాత, కస్టమర్లు టాటా కార్లను కొనేందుకు బారులు తీరుతున్నారు. టాటా మోటార్స్ అమ్మకాల పరంగా ఇప్పటి వరకూ భారతదేశపు మూడవ అతిపెద్ద కార్ కంపెనీగా ఉంటే, గడచిన మే 2022 నెల అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్న హ్యుందాయ్‌ను వెనక్కు నెట్టి ఆ స్థాన్ని టాటా కైవసం చేసుకుంది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి చాలా ఏళ్లుగా మొదటి స్థానంలో ఉంటే, హ్యుందాయ్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. కాగా, టాటా మోటార్స్ ఈ జాబిజాలో ఇప్పటి వరకూ మూడవ స్థానంలో ఉండేది. అయితే, మే 2022 నెలలో 43,341 యూనిట్ల వాహనాలను విక్రయించడం ద్వారా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సమయంలో హ్యుందాయ్ 42,293 కార్లను విక్రయించింది. అంటే, గత నెలలో హ్యుందాయ్ విక్రయించిన వాహనాల కంటే టాటా మోటార్స్ 1,048 యూనిట్లు ఎక్కువ వాహనాలను విక్రయించింది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

టాటా మోటార్స్ విక్రయించిన మొత్తం 43,341 యూనిట్ల వాహనాల్లో 3,454 యూనిట్లు ఎలక్ట్రిక్ వాహనాలే కావడం గమనార్హం. ప్రస్తుతం, టాటా మోటార్స్ ఈవీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసినదే. గత ఏడాది ఇదే సమయంలో (మే 2021 నెలలో) టాటా మోటార్స్ కేవలం 15,181 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే, ఈ సమయంలో కంపెనీ వార్షిక అమ్మకాలు 185 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

అమ్మకాల పరంగా హ్యుందాయ్‌ను టాటా మోటార్స్ అధిగమించడం ఇది రెండోసారి. మొదటిసారిగా డిసెంబర్ 2021 టాటా మోటార్స్ ఈ విజయం సాధించింది. టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని మోడల్‌లకు ఈ ఘనత వర్తిస్తుంది. అయితే, ఇక్కడ మనం టాటా నెక్సాన్‌ గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ ఓ తిరుగులేని మోడల్ గా మరియు కస్టమర్ల మొదటి ఎంపికగా కొనసాగుతోంది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

టాటా నెక్సాన్ ప్రతినెలా స్థిరమైన అమ్మకాలతో దాని సెగ్మెంట్‌లో బెస్ట్ సెల్లర్‌గా ఉంది. అంతే కాకుండా, టాటా నెక్సాన్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే, టాటా మోటార్స్ ఇటీవలే టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) పేరుతో ఓ లాంగ్-రేంజ్ వెర్షన్‌ను రూ. 17.74 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) విడుదల చేసింది. కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పూర్తి ఛార్జింగ్‌ పై 437 కిమీ రేంజ్ ను ఇస్తుందని సర్టిఫై చేయబడింది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

ఇది టాటా నెక్సాన్ ఈవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్ కంటే 125 కిమీ ఎక్కువ. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో ఉపయోగించిన పెద్ద 40.5 kWh బ్యాటరీ ప్యాక్ కారణంగా, అధిక రేంజ్ సాధ్యమైంది. అయితే, ఇందులోని కొత్త బ్యాటరీ ప్యాక్ వలన ఈ కారు బరువు దాదాపు 100 కిలోలు పెరిగింది. అయినప్పటికీ, ఈ కారులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 143 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెరిగిన బరువుకు అనుగుణంగా టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారులో సస్పెన్షన్ మరియు బ్రేక్‌లను కూడా అప్‌గ్రేడ్ చేసింది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దేశీయ విపణిలో ఈ కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ రెండు వేరియంట్లు (XZ+ మరియు XZ+ Lux) కూడా రెండు రకాల చార్జర్ (3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌) ఆప్షన్లతో లభిస్తాయి. లాంగ్ రేంజ్ వెర్షన్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇప్పుడు ప్రత్యేకమైన ఇంటెన్సిటీ-టీల్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో, స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో అందించబడే ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లుకు అదనంగా మరిన్ని సేఫ్టీ ఫీచర్లు జోడించబడ్డాయి. వీటిలో I-VBAC (ఇంటెలిజెంట్ - వాక్యూమ్-లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.

గుడ్ జాబ్ టాటా.. భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా టాటా మోటార్స్..!

దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు ఇలా ఉన్నాయి:

* టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ (3.3 కివా చార్జర్) : రూ.17.74 లక్షలు

* టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ (7.2 కివా చార్జర్) : రూ.18.24 లక్షలు

* టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ (3.3 కివా చార్జర్) : రూ.18.74 లక్షలు

* టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ (7.2 కివా చార్జర్) : రూ.19.24 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

Most Read Articles

English summary
Tata motors takes 2nd spot again becomes india s second biggest car maker in may 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X