టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. సెప్టెంబర్ 9న జరిగిన ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవం (World EV Day) సందర్భంగా టాటా టియాగో ఈవీ ప్రకటనతో టాటా మోటార్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది టాటా నుండి రాబోయే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా మార్కట్లో సంచలనం సృష్టించనుంది.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

టాటా మోటార్స్ ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ మరియు ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఎక్స్‌ప్రెస్-టి ఈవీలను విక్రయిస్తోంది. ఇవి కాకుండా వాణిజ్య వాహన విభాగంలో కూడా టాటా మోటార్స్ పలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

ఈవీ సెగ్మెంట్లో కొత్తగా భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారుగా పేర్కొనబడేన టాటా టియాగో ఈవీని విడుదల చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని టాటా మోటార్స్ యోచిస్తోంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

తాజాగా, టాటా టియాగో ఈవీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ లీక్ అయ్యాయి. రాబోయే టాటా టియాగో ఈవీ కూడా టాటా టిగోర్ ఈవీకి సమానమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా, టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) క్రూయిజ్ మోడ్ మరియు వన్-పెడల్ డ్రైవ్ మోడ్‌ను కలిగి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మెరుగైన బ్యాటరీ సంరక్షణ కోసం బలమైన పునరుత్పత్తి (స్ట్రాంగ్ రీజనరేషన్ టెక్నాలజీ) సాయంతో టాటా మోటార్స్ ఇందులో వన్ పెడల్ డ్రైవ్ మోడ్‌ని సాధ్యం చేయనుంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

టాటా టిగోర్ ఈవీతో పోల్చుకుంటే, టాటా టియాగో తేలికపాటి నిర్మాణం కారణంగా ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ చాలా శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నాయి. అంతేకాకుండా, ఇందులోని బ్యాటరీ ప్యాక్ టిగోర్ ఈవీ కన్నా అధిక రేంజ్‌ను కూడా ఆఫర్ చేయగలదని సమాచారం. కొత్త బ్యాటరీ సంరక్షణ ఫీచర్లు మరియు తక్కువ బరువు కారణంగా, రాబోయే Tata Tiago EV అనువైన పరిస్థితుల్లో పూర్తి చార్జ్ పై 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని ఆశిస్తున్నారు.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) మోడల్ అధునాతనమైన 350V Ziptron EV సిస్టమ్‌తో పనిచేస్తుంది మరియు ఇది 26 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, టాటా టిగోర్ ఈవీలో 170 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 74 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సాధారణ 15A ప్లగ్ పాయింట్ ద్వారా చేస్తే సుమారు 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

టాటా టిగోర్ ఈవీ XE, XM, XZ+ మరియు XZ+ DT అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ రేంజ్‌ను (స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ వద్ద ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. కాగా, టియాగో ఈవీ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ టిగోర్ ఈవీలో ఉపయోగించిన అదే IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ లను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, దీని ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని కొన్ని ఫీచర్లను తగ్గించే అవకాశం ఉంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

ప్రస్తుతం, మార్కెట్లో టాటా టిగోర్ ఈవీ శ్రేణి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 12.49 లక్షల (బేస్ XE ట్రిమ్ కోసం) నుండి ప్రారంభమై రూ. 13.64 లక్షల (టాప్-ఎండ్ XZ+ DT ట్రిమ్ కోసం) వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో, టాటా నుండి రాబోయే చిన్న టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ ధర సుమారు రూ.10 లక్షల రేంజ్‌లో ఉంటుందని అంచనా వేయబడింది. ఈ కొత్త మోడల్ టాటా మోటార్స్‌కు ఈవీ విభాగంలో తిరుగులేని శక్తిగా అవతరించేందుకు ఎంతగానో సహాయపడనుంది. భారతదేశంలో టాటా టియాగో ఈవీ ఏకైక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తుంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో చాలా మంది కార్ కొనుగోలుదారులు ఖరీదైన పెట్రోల్, డీజిల్ కార్లను వదిలి ప్రకృతి సాన్నిహిత్యమైన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారుకు మారిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి, టాటా టియాగో ఈవీ యొక్క లాంచ్ మెట్రో నగరాల్లో మొత్తం అమ్మకాలను పుష్కలంగా పెంచడానికి మరియు భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో టాటా మోటార్స్ ఆధిపత్యాన్ని పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్‌తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?

టాటా మోటార్స్ ఇప్పటికే భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో 87 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో సింహభాగాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ ఈవీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనంగా టాటా నెక్సాన్ ఈవీ అగ్రస్థానంలో ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పూర్తి చార్జ్ పై 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Tata motors to launch tiago ev with one pedal drive mode details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X