కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో కొత్త 'టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్' (Tata Nexon EV Max) లాంచ్ చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ ఎలక్ట్రిక్ కార్ ప్రారంభ ధర రూ. 17.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త EV ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందించబడింది. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త TVC విడుదల చేసింది. ఇందులో ఈ కొత్త EV కి సంబంధించిన మరింత సమాచారం మీరు తెలుసుకోవచ్చు.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ ఇప్పుడు ఇంటెన్సీ టీల్ అనే కొత్త కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంది. అంతే కాకుండా డేటోనా గ్రే మరియు ప్రిస్టీన్ వైట్ కలర్ లో కూడా ఇది లభిస్తుంది. ఈ కొత్త ఈవీ లో ఎలక్ట్రిక్ బ్లూ ఎలిమెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్థాయి. ఇందులో హ్యాలోజన్ హెడ్ లాంప్ మరియు ఫాగ్ లాంప్ ఉంది. అదే విధంగా దీని కింది భాగంలో ట్రై యారో డిజైన్ కూడా మీరు చూడవచ్చు.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

టాటా నెక్సాన్ ఈవీ మొత్తమ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎక్స్జెడ్ ప్లస్ మరియు ఎక్స్జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్లు. ఇవి రెండు ఛార్జింగ్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. అవి 3.3 కిలోవాట్ మరియు 7.2 కిలోవాట్. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఈవి యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 19.24 లక్షలు.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

ఇందులో ఇప్పుడు 40.5 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్క ఛార్జ్ తో గరిష్టంగా 437 కిమీ మైలేజ్ అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో తక్కువ రేంజ్ అందిస్తుంది. ఇందులో బ్యాటరీ ప్యాక్ మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, కావున ఈ కారు బరువు కూడా దాదాపు 100 కేజీలు ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ మునుపటికంటే కూడా తక్కువగా ఉంటుంది.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

స్టాండర్డ్ టాటా నెక్సాన్ EV 312 కిమీ సర్టిఫైడ్ రేంజ్ కలిగి ఉంది. నెక్సాన్ EV మ్యాక్స్ ఇప్పుడు దాని స్టాండ్ర్డ్ మోడల్ కంటే 116 కి.మీ.ల దూరాన్ని అందిస్తుంది. కొత్త Nexon EV Max దాని 105 kW ఎలక్ట్రిక్ మోటార్ నుండి 143 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా.. ఇది కేవలం 9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV కోసం కంపెనీ అందించే 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో 7.2 కిలోవాట్ ఛార్జర్ ద్వారా పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ ఛార్జర్స్ ఇంట్లో లేదా ఆఫీసులలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

కొత్త Nexon EV Max I-VBAC, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో ESP (ఇంటెలిజెంట్-వాక్యూమ్-లెస్ బూస్ట్ మరియు యాక్టివ్ కంట్రోల్) ని పొందుతుంది. మొత్తం మీద ఇది మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది.

కొత్త 'Nexon EV Max' TVC విడుదల చేసిన టాటా మోటార్స్: మీరు చూసారా..!!

ఈ కొత్త SUV యొక్క ఎక్స్టీరియర్ లో ఎక్కువ మార్పులు జరగలేదు. అయితే ఇంటీరియర్ లో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఇంటీయోరల్ లో కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ లోని ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఎయిర్ ఫ్యూరిఫైర్ మరియు గేర్ న్యాబ్ వంటివి ఉన్నాయి. రియర్ సీటింగ్ కూడా దాదాపు మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata nexon ev max first tvc released shows all its features details
Story first published: Saturday, May 14, 2022, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X