సంవత్సరం చివరిలో కూడా తగ్గని జోరు.. మళ్ళీ పెరిగిన 'టాటా నెక్సాన్' ధరలు

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' యొక్క 'నెక్సాన్' ఎనలేని ప్రజాదరణ పొందుతున్న మోడల్. పటిష్టమైన భద్రతా ఫీచర్స్ కలిగి ఉన్న కారణంగా ఎక్కువమంది ఈ SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు, కాగా కంపెనీ ఈ SUV ధరలను మరోసారి రూ.18,000 వరకు పెంచేసింది.

టాటా మోటార్స్ తన నెక్సాన్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే జనవరి, జులై నెలలలో పెంచింది. ఇప్పుడు మూడవ సారి కూడా ధరలను పెంచినట్లు తెలిపింది. ఇందులో పెట్రోల్, డీజిల్ మోడల్స్ ఉన్నాయి. కంపెనీ ఈ SUV ధరలను కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా రూ.18,000 పెంచింది. అయితే ఇందులో చాలా మోడల్స్ ధరలు రూ.10,000 పెరిగాయి. మరి కొన్ని వేరియంట్స్ ధరలు రూ 9,000 వరకు పెరిగాయి.

మళ్ళీ పెరిగిన టాటా నెక్సాన్ ధరలు

ధరల పెరుగుదల తరువాత టాటా నెక్సాన్ పెట్రోల్ బేస్ (XE) వేరియంట్ ధరలు రూ.10,000 పెరుగుదలను పొంది రూ.7.70 లక్షలకు చేరింది. కాగా XZA+ (P) జెట్ వేరియంట్ ధర కూడా రూ.12.88 లక్షలకు చేరింది. అయితే XZA+ (P) మరియు XZ+ (P) వంటి వాటి ధరలు రూ.18,000 పెరుగుదలను పొందాయి. అదే సమయంలో XMA (S) వేరియంట్ రూ.6,000 పెరుగుదలను పొందింది. XZ+ (L) డ్యూయెల్ టోన్ ధరలు రూ.9,000 పెరిగాయి.

టాటా నెక్సాన్ యొక్క డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ డీజిల్ వేరియంట్ ధరలు కనిష్టంగా రూ.10,000, గరిష్టంగా రూ.18,000 పెరిగాయి. కావున ఇప్పుడు నెక్సాన్ XM డీజిల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.10,000 పెరుగుదలను పొంది రూ.10 లక్షలకు చేరింది. రూ.10,000 పెరుగుదల పొందిన వేరియంట్స్ లో XM (S), XM+ (S), XZ, XZ+ డ్యూయెల్ టోన్ వేరియంట్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే XZA+ (P) మరియు XZA+ (P) డ్యూయెల్ టన్న ధరలు రూ.18,000 పెరుగుదలను పొందాయి.

టాటా నెక్సాన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఐఆర్‌ఎ కనెక్టెడ్ కార్ టెక్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.

టాటా నెక్సాన్‌ను రెండు ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 110 హెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్ లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి.

టాటా నెక్సాన్ మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో మంచి భద్రతా ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లను ఇందులో ఉంటాయి.

టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో కూడా 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుని, దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇప్పుడు పెరిగిన ధరలు అమ్మకాలమీద ఏమైనా ప్రభావం చూపుతాయా.. లేదా అనేది తెలియాల్సిన విషయం.

Most Read Articles

English summary
Tata nexon price hike again details
Story first published: Thursday, December 1, 2022, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X