నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యత్తమ మోడల్ ఏదంటే, ఎక్కువ మంది చెప్పే పేరు టాటా నెక్సాన్ (Tata Nexon). ఎస్‌యూవీ విభాగంలో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ యొక్క పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చిన మోడల్ టాటా నెక్సాన్. ఒకప్పుడు టాటా సుమో, టాటా సఫారీ ఎస్‌యూవీలు ఎంతగా ఈ బ్రాండ్‌కు పాపులారిటీని తెచ్చిపెట్టాయో, ఇప్పుడు నెక్సాన్ కూడా అంతే పాపులారిటీని తెచ్చిపెడుతోంది.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ తొలిసారిగా 2017లో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదేళ్ల కాలంలో కంపెనీ ఇప్పటి వరకూ 4 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. తాజాగా, టాటా మోటార్స్ ఫ్యాక్టరీలో తయారైన 4,00,000వ యూనిట్ టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కంపెనీ బయటకు విడుదల చేసింది. ఈ సందర్భంగా, టాటా నెక్సాన్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను కుడా విడుదల చేసింది. రానున్న పండుగ సీజన్‌లో ఈ కొత్త వేరియంట్ మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలదని కంపెనీ భావిస్తోంది.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎల్) ధర

టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎల్) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో కొత్త Tata Nexon XZ+(L) వేరియంట్ ధర రూ.11.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ కొత్త వేరియంట్ ను ప్రస్తుత టాటా నెక్సాన్ టాప్-స్పెక్ వేరియంట్ అయిన XZ+ వేరియంట్ కు ఎగువన ఉంచబడింది. కొత్త XZ+ (L) వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ఈ కొత్త వేరియంట్ స్పెషల్ డార్క్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎల్) ఫీచర్లు

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ప్రోడక్ట్ లైనప్‌ లో కొత్తగా జోడించిన ఈ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎల్) వేరియంట్‌ లో ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు లెథెరెట్ అప్‌హోలెస్ట్రీతో కూడిన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇది నెక్సాన్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ ఏసి వెంట్స్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఎల్) ఇంజన్స్

ఈ కొత్త వేరియంట్‌లో ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేయలేదు. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ 110 బిహెచ్‌పి శక్తిని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

టాటా నెక్సాన్ సేఫ్టీ ఫీచర్లు

ఈ కథనం మొదట్లో చెప్పుకున్నట్లుగా టాటా నెక్సాన్ ఎస్‌యూవీ సేఫ్టీ పరంగా చాలా సురక్షితమైన ఎస్‌యూవీ. కంపెనీ ఈ కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో కూడా 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుని, దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

భారత్‌లో టాటా నెక్సాన్ ప్రయాణం

టాటా నెక్సాన్ తొలిసారిగా 2017లో భారత మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నాల్గవ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. ఈ మోడల్ సగటున ప్రతినెలా 10-15 వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తోంది. టాటా నెక్సాన్ అమ్మకాల పరంగా నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలను అధిగమించింది. గడచిన ఏప్రిల్-ఆగస్టు 2022 మధ్య కాలంలో ఈ మోడల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఆధిక్యాన్ని కొనసాగించింది.

నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..

నెక్సాన్ మొదటి 1,00,000 మైలురాయిని చేరుకోవడానికి ఒక సంవత్సరం మరియు పది నెలల సమయం పట్టింది. కాగా అక్కడి నుండి 2,00,000 మైలురాయిని చేరుకోవడానికి ఒక సంవత్సరం మరియు పదకొండు నెలల సమయం పట్టగా, 3,00,000 మైలురాయిని చేరుకోవడానికి కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే పట్టింది. ఆ తర్వాత కేవలం ఏడు నెలల్లోనే తాజాగా మరో 1,00,000 యూనిట్ల మైలురాయిని చేరుకుని, మొత్తంగా 4,00,000 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అతివేగంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది.

Most Read Articles

English summary
Tata nexon production reaches 400000th unit milestonew new xz l variant launched details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X