ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త 'టాటా సఫారి డార్క్ ఎడిషన్' (Tata Safari Dark Edition) విడుదల చేసింది. దేశీయ విఫణిలో అడుగు పెట్టిన ఈ కారు ధర రూ. 19.05 లక్షలు. ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త ఎడిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త టాటా సఫారి డార్క్ ఎడిషన్ XT+/XTA+ మరియు XZ+/XZA+ ట్రిమ్‌లలో ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త కారు ఒబెరాన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇది కంపెనీ యొక్క ఇతర మోడళ్ల డార్క్ ఎడిషన్‌లో కూడా అందుబటులో ఉంటుంది. అయితే దాని ఫెండర్‌లు మరియు టెయిల్‌గేట్‌పై డార్క్ బ్యాడ్జ్‌లు చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో 18 ఇంచెస్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్ మరియు దాని ఇంటీరియర్‌లో ప్రీమియం బ్లాక్‌స్టోన్ డార్క్ థీమ్ ఇవ్వబడింది. దీనిలో డాష్‌బోర్డ్ స్పెషల్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌లో ఉంచబడింది. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉటుంది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

కొత్త టాటా సఫారి డార్క్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికొస్తే, దీనికి మొదటి మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్ల ఎంపికతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటివి ఇవ్వబడ్డాయి. అదే సమయంలో కంపెనీ దాని టాప్ మోడల్‌కు మరిన్ని ఫీచర్లు మరియు పరికరాలను అందించింది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

కంపెనీ యొక్క టాప్ మోడల్‌ ధర రూ. 22.51 లక్షలు వరకు ఉంటుంది. ఈ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 72,000 ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో అదనపు ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

టాటా సఫారి డార్క్ ఎడిషన్ 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి పొందుతుంది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

టాటా సఫారీ గత సంవత్సరం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. అయితే దీని అమ్మకాలు ఇప్పటికి 16,000 దాటాయి. ఈ SUV సఫారీ యొక్క గోల్డ్ ఎడిషన్ పరిచయం చేయబడక ముందే 6 నెలల్లో 10,000 మార్కును దాటింది. దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

డార్క్ ఎడిషన్ టాటా సఫారీకి సంబంధించిన మొదటి ప్రత్యేక ఎడిషన్ కాదు. కంపెనీ ఇంతకుముందు ఆల్ట్రోజ్, నెక్సాన్ EV వంటి అనేక మోడళ్లను డార్క్ అవతార్‌లో తీసుకువచ్చింది, అదే సమయంలో కంపెనీ ఇప్పుడు ఈ ప్రసిద్ధ SUV ని డార్క్ ఎడిషన్‌లో తీసుకువచ్చింది. అయితే ఈ ఎడిషన్ కంపెనీ యొక్క అమ్మకాలు పెంచడానికి చాలా వరకు దోహదపడుతుందని ఆశిస్తున్నాము.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

కొత్త టాటా సఫారి డార్క్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే పైన తెలిపిన ప్రత్యర్థి మోడల్స్ ఏవీ కూడా స్పెషల్ ఎడిషన్ లో అందుబటులో లేదు. కావున ఈ కొత్త టాటా సఫారీ డార్క్ ఎడిషన్ మంచి విజయం పొందుతుంది.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

టాటా సఫారి డార్క్ ఎడిషన్ ధర దాని స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా రూ. 20,000 నుండి రూ. 72,000 వరకు ఎక్కువ. అయితే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా, మంచి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారుకి తప్పకుండా మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాము.

ఎట్టకేలకు Tata Safari నుంచి డార్క్ ఎడిషన్ విడుదల: ధర రూ. 19.05 లక్షలు

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ తన టాటా హారియర్ ధరను ఇప్పుడు ఏకంగారూ. 500 నుంచి రూ. 10,000 వరకు పెంచింది. దేశీయ మార్కెట్లో వాహన ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగటం వల్ల తమ ఉత్పత్తుల ధరలు కూడా పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. అయితే ధరల పెరుగుదల తరువాత దీని టాప్ వేరియంట్ ధర రూ. 21.19 లక్షలు.

Most Read Articles

English summary
Tata safari dark edition launched price 19 05 lakh variant features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X