భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్యాసింజర్ రేంజ్ కార్లను ఇప్పుడు పొరుగుదేశమైన భూటాన్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ మేరకు భూటాన్ దేశంలో టాటా ప్యాసింజర్ వాహనాల యొక్క ఏకైక అధీకృత పంపిణీదారుగా ఉన్న సామ్‌డెన్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఈ కూటమితో, టాటా నేపాల్‌లో టియాగో, టిగోర్, నెక్సన్, ఆల్ట్రోజ్, హారియర్ మరియు సఫారీలతో సహా పూర్తి రేంజ్ టాటా కార్లను పరిచయం చేసింది.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

భూటాన్ లో విడుదలైన అన్ని టాటా కార్లు కూడా BS6 కంప్లైంట్ నిబంధనలకు లోబడి ఉంటాయి మరియు కంపెనీ యొక్క పాపులర్ 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారు చేయబడ్డాయి. అక్కడి మార్కెట్లో టాటా టియాగో (Tata Tiago) ప్రారంభ ధర రూ. 7.34 లక్షల భూటానీస్ ఎన్‌యూలు కాగా, టాటా టిగోర్ (Tata Tigor) ధర రూ. 7.99 లక్షల ఎన్‌యూలుగా ఉంది.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

అలాగే, టాటా నెక్సాన్ (Tata Nexon) కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ​​హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు వరుసగా రూ. 10.55 లక్షల ఎన్‌యూలు మరియు రూ. 8.95 లక్షల ఎన్‌యూలుగా ఉన్నాయి. ఇకపోతే, మిడ్-సైజ్ ఎస్‌యూవీని అయిన టాటా హారియర్ (Tata Harrier) ధర రూ. 18.38 లక్షల ఎన్‌యూలు మరియు కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా సఫారీ (Tata Safari) ధర రూ. 24.42 లక్షల ఎన్‌యూలుగా ఉన్నాయి.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

ఈ సందర్భంగా టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తమ సంస్థ వృద్ధి వ్యూహానికి భూటాన్ ముఖ్యమైన మార్కెట్ అని చెప్పుకొచ్చారు. ఇక్కడి మార్కెట్లో తమ కొత్త తరం బిఎస్6 ప్యాసింజర్ వాహనాలను ప్రారంభించడంతో, తాము మార్కెట్లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది దేశంలో 5-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి కారు.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

అలాగే, టాటా ఆల్ట్రోజ్ కూడా దాని విభాగంలో 5-స్టార్ GNCAP సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఏకైక హ్యాచ్‌బ్యాక్. ఇకపోతే, టాటా టిగోర్ మరియు టియాగో కార్లు అడల్ట్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

టాటా మోటార్స్ బ్రాండ్ కి సంబందించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ జనవరి 19, 2022 వ తేదీ నుండి భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ధరలు 0.9 శాతం పెరిగాయి. అయితే, జనవరి 19 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. టాటా మోటార్స్ ఇప్పుడు దాని ఉత్పత్తి శ్రేణికి ధర మార్పులను వెల్లడించింది, ఇందులో టిగోర్ ఈవీ మినహా మిగిలిన అన్ని మోడళ్లు ఉన్నాయి.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, దాని ధరలో అత్యంత గణనీయమైన పెరుగుదల కనిపిచింది. కంపెనీ ఇప్పుడు ఈ కారు ధరలను సుమారు రూ. 22,000 వరకు పెంచింది. అలాగే, NRG వెర్షన్ ధరలు కూడా రూ. 5,500 వరకూ పెరిగాయి. అదే సమయంలో హారియర్ మరియు సఫారీలు కూడా వాటి పాత ధరలతో పోల్చుకుంటే సుమారు రూ. 15,000 వరకు పెరిగాయి. టాటా మోటార్స్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన కాంపాక్ట్ కారు టాటా పంచ్ లో క్రియేటివ్ వేరియంట్‌ ధరను రూ. 10,100 తగ్గించారు. కాగా, మిగిలిన అన్ని వేరియంట్‌ల ధరలను మాత్రం ఇప్పుడు రూ. 15,900 మేర పెంచారు.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

ఇక టాటా ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క బేస్ టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ. 2,000 మేర పెరిగింది, ఇతర టర్బో-పెట్రోల్ వేరియంట్‌ల ధరలు రూ. 8,000 వరకు తగ్గించబడ్డాయి. ఆల్ట్రోజ్ యొక్క అన్ని ఇతర వేరియంట్‌లు రూ. 15,000 వరకు ధర పెంపును పొందాయి. అలాగే, టాటా నెక్సాన్ మరియు టిగోర్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఇప్పుడు వరుసగా రూ. 13,000 మరియు రూ. 15,000 వరకూ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

భూటాన్ మార్కెట్లో Tata Tiago మరియు Tata Tigor కార్ల విడుదల, వివరాలు

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ యొక్క అన్ని వేరియంట్‌లు దాదాపు రూ. 5,000 ధరల పెంపును అందుకున్నాయి. అయితే, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త తరం టిగోర్ ఈవీ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ గడచిన జనవరి 19న భారతదేశంలో టియాగో మరియు టిగోర్ మోడళ్లలో iCNG వేరియంట్‌లను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో టాటా టియాగో ఐసిఎన్‌జి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.10 లక్షలు కాగా, టిగోర్ ఐసిఎన్‌జి ధర రూ.7.70 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata tiago and tata tigor launched in bhutan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X