Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ప్రముఖ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ (Tata Motors) యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు మంచి ఆదరణ ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన కొనుగోలుదారులు ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ కారణంగా టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి వాహనాల తయారీలో నిమగ్నమై ఉంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ టియాగో (Tiago) హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ (Tigor) కాంపాక్ట్ సెడాన్లతో పాటు టాటా పంచ్ మైక్రో SUV ని కూడా సిఎన్‌జి మోడళ్లను విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. అయితే ప్రస్తుతం టాటా మోటార్స్ రాబోయే తన కొత్త టాటా టియాగో సిఎన్‌జి మోడల్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం, టాటా టియాగో సిఎన్‌జి మోడల్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున ఈ కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానుంది. టాటా టియాగో సిఎన్‌జి మోడల్ ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ కి గురయ్యింది. కావున త్వరలో ఇది మార్కెట్లో అడుగుపెట్టనుంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

కంపెనీ ఇటీవల తన కొత్త టాటా టియాగో సిఎన్‌జి యొక్క టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈ మోడల్ త్వరలో విడుదల అవుతుందని తెలిసింది. టాటా టియాగో సిఎన్‌జి మరియు టిగోర్ సిఎన్‌జి సాధారణ మోడల్ మాదిరిగానే అదే 1.2-లీటర్, ఆస్పిరేటెడ్, ఇన్‌లైన్-3 పెట్రోల్ ఇంజన్‌తో అందించబడతాయి. CNG ట్రిమ్‌లో 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా టిగోర్ మరియు టియాగో యొక్క CNG ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్‌ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్‌తో నడిచే మోడల్‌తో పోలిస్తే, CNG తో నడిచే టాటా టియాగో డిజైన్ మరియు స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే, CNG మోడల్ ప్రత్యేకంగా 'CNG' బ్యాడ్జ్‌ని కలిగి ఉండవచ్చు.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా టియాగో CNG మోడల్ మరియు టిగోర్ CNG వంటివి కేవలం ఎంపిక చేసిన ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, దీని ధర పెట్రోల్ మోడల్ కంటే రూ. 30,000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. Tiago CNG దేశీయ మార్కెట్లో మారుతి వ్యాగన్-R CNG, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ CNG మరియు రాబోయే స్విఫ్ట్ CNG వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ యొక్క Tata Altroz ​​మరియు Tata Nexon లు కూడా త్వరలో CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ రెండింటి యొక్క టెస్ట్ మోడల్‌లు అనేక సార్లు CNG కిట్‌లతో టెస్ట్ చేస్తున్నప్పుడు గుర్తించబడ్డాయి. కావున ఇవి కూడా త్వరలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

గతంలో మొబైల్ పరిశ్రమ గ్లోబల్ సెమీకండక్టర్ కొరతతో సతమతమవుతోంది.ఇప్పటికి కూడా ఈ సమస్య ఉంది, ఈ కారణంగా టాటా మోటార్స్ తన ప్రణాళికలను గతంలో 2022 కి వాయిదా వేసింది. కావున ఈ సంవత్సరం కంపెనీ కొత్త CNG మోడల్స్ మరియు అప్డేటెడ్ మోడల్స్ తీసుకురానుంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

గత సంవత్సరం టాటా మోటార్స్ టాటా పంచ్ (Tata Punch) అనే మైక్రో SUV విడుదల చేసింది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి ఆదరణ పొందుతోంది. కానీ ప్రస్తుతం ఇంధన ధరలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ కొత్త SUV ని కూడా కంపెనీ CNG వెర్షన్ లో తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కొత్త సంవత్సరంలో Tigor మరియు Tiagoలను CNGకి తీసుకువచ్చిన తర్వాత పంచ్ CNG కూడా మార్కెట్లో అడుగుపెట్టనుంది.

Tiago CNG బుకింగ్స్ ప్రారంభించిన Tata Motors: పూర్తి వివరాలు

టాటా పంచ్ ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే దేశీయ మార్కెట్లో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదలైన తరువాత దీని పరిధి దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ మైక్రో SUV ని మరింత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tata tiago cng bookings open engine features details
Story first published: Monday, January 3, 2022, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X