టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల రాజ్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors), త్వరలోనే భారత మార్కెట్లో అత్యంత సరసమైన చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Recommended Video

Tata Nexon EV Max తెలుగు రివ్యూ | రీజెన్ బ్రేకింగ్, సింగిల్-ఫుట్ డ్రైవింగ్, కొత్త ఫీచర్స్

టాటా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త టియాగో ఈవీ (Tata Tiago EV) గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

ఇటీవల జరిగిన ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దినోత్సవం సందర్భంగా, టాటా మోటార్స్, తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనం, టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారుగా ఉండబోతోందని ప్రకటించింది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ విభాగంలో టాటా టిగోర్ ఈవీ మరియు టాటా నెక్సాన్ ఈవీ లను విక్రయిస్తోంది. అలాగే, వాణిజ్య వినియోగదారుల కోసం టాటా ఎక్స్‌ప్రెస్-టి సెడాన్ (టాక్సీ ప్రయోజనాల కోసం) మరియు టాటా ఏస్ ఈవీ (వాణిజ్య రవాణా కోసం) లను కూడా అందిస్తోంది. కాగా, ఇప్పుడు తాజాగా, భారతీయలకు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును అందించే లక్ష్యంగా, తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోలో కూడా ఓ ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

టాటా టియాగో ఈవీ మొదటిసారిగా 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడింది. అయితే, కంపెనీ ఈ కారును కొంతకాలం పక్కకు పెట్టి, ముందుగా Nexon EV మరియు ఆ తర్వాత Tigor EV లను విడుదల చేసింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బలమైన డిమాండ్ ఉండటం మరియు తాము విడుదల చేసిన నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు అద్భుతంగా అమ్ముడపోతుండటం మరియు మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కారుకు ఉన్న డిమాండ్‌ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న టాటా మోటార్స్ ఎట్టకేలకు తమ టియాగో ఈవీని కూడా విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతానికి, టాటా మోటార్స్ తమ టియాగో ఈవీ (Tata Tiago EV) కి సంబంధించిన ఏ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది మాత్రం టాటా మోటార్స్ నుండి రాబోయే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు కావచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా కూడా ఉండనుంది. భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో టాటా మోటార్స్ కాకుండా హ్యుందాయ్, ఎమ్‌జి మోటార్ మరియు కియా వంటి ఇతర ప్యాసింజర్ కార్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నప్పటికీ, వాటి ధరలు రూ.20 లక్షలకు పైగానే ఉన్నాయి.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

కాగా, టాటా మోటార్స్ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లు కేవలం రూ.12.49 లక్షలు (టిగోర్ ఈవీ ఎక్స్ఈ వేరియంట్) నుండే ప్రారంభం అవుతాయి. టాటా అందించే కార్లు తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ, రేంజ్ విషయంలో కూడా ఎక్కడా రాజీపడవు. టాటా టిగోర్ ఈవీ పూర్తిగా చార్జ్ పై 300 కిమీ పైగా రేంజ్‌ను అందిస్తుండగా, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పూర్తి చార్జ్ పై 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుంది. టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ రేటింగ్‌ను దక్కించుకొని భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ సెడాన్‌గా మారింది. టాటా కార్లు చవకైనవే కావు, సురక్షితమైనవి కూడా అని ఇది నిరూపించింది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతం, టాటా విక్రయిస్తున్న టిగోర్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీలు రెండూ కూడా కంపెనీ యొక్క జిప్‌ట్రాన్ (Ziptron) టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. ఈ టెక్నాలజీపై రూపుదిద్దుకున్న కార్లు బ్యాటరీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ఎక్కువ రేంజ్‌ను అందించడంలో సహాయపడుతాయి. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ నుండి రాబోయే తదుపరి ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీ కూడా ఇదే జిప్‌ట్రాన్ టెక్నాలజీ ఆధారంగా తయారు కానుంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ కారు ధర సుమారు రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

టాటా టియాగో యొక్క హ్యాచ్‌బ్యాక్ వెర్షనే టాటా టిగోర్ అన్న సంగతి మనందరికీ తెలిసినదే. సాధారణంగా, పెట్రోల్/డీజిల్ వెర్షన్లలో ఈ రెండు మోడళ్లలో అనేక పరికరాలు మరియు విడిభాగాలు ఒకేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వెర్షన్ టిగోర్ ఈవీ మరియు టియాగో ఈవీలలో కూడా దాదాపు ఒకేరకమైన భాగాలు ఉండే అవకాశం ఉండొచ్చని అంచనా. టాటా టిగోర్ ఈవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును XE, XM, XZ+ మరియు XZ+ DT అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ రేంజ్‌ను (స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ వద్ద ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

టియాగో ఈవీ (Tata Tiago EV) రాకను ధృవీకరించిన టాటా.. భారత్‌లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ ‌టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. మా అంచనా ప్రకారం, టియాగో ఈవీలో కూడా ఇదే విధమైన బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌లను కంపెనీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే, దీని ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని కొన్ని ఫీచర్లను తగ్గించవచ్చు. టిగోర్ ఈవీ మాదిరిగానే టియాగో ఈవీ కూడా దాని పెట్రోల్ వెర్షన్ డిజైన్‌తో దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata tiago electric version confirmed launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X