కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ గురించి వెల్లడించిన టాటా మోటార్స్.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టియాగో ఈవి లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ బుకింగ్స్ గురించి గానీ, బుకింగ్ ప్రైస్ గురించి గానీ, టెస్ట్ డ్రైవ్స్ గురించి గానీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఈ వివరాలన్నీ వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త టాటా టియాగో ఈవి యొక్క బుకింగ్స్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఇక ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క టెస్ట్ డ్రైవ్స్ విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే కస్టమర్లు ఈ డిసెంబర్ నెలలో టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన టాటా టియాగో ఈవి మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ప్రస్తుతం కంపెనీ వెల్లడించిన ధరలు కేవలం 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ కారు కొనాలనుకులే కస్టమర్లు ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

అయితే ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం, టాటా టియాగో టాప్ వేరియంట్ అయిన XZ+ టెక్ లక్స్ వేరియంట్ కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇప్పటికీ 500 కంటే ఎక్కువ అనధికార బుకింగ్స్ కూడా స్వీకరించినట్లు ముంబై డీలర్షిప్ వర్గాల ద్వారా తెలిసింది.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించబడింది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి IP67 రేటింగ్‌ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త టియాగో ఈవి సిటీ మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్‌లు మరియు 4 రీజెన్ మోడ్‌లను కలిగి ఉంది.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టాటా టియాగో ఈవి 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని, 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పరిధి వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

కొత్త టాటా టిగోర్ ఈవీ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 15A, 3.3kW AC మరియు 7.2kWh AC ప్లగ్ పాయింట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టియాగో ఈవి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. లోపలి భాగంలో బ్లూ యాక్సెంట్స్ చూడవచ్చు. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి కూడా ఉన్నాయి.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

టాటా టియాగో EV డిజైన్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్ బ్లూ కలర్ తో ఉంటుంది. ఎడమవైపు ఉన్న హెడ్‌లైట్‌ పైన 'EV'కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త టియాగో ఈవీ బుకింగ్స్ రేపే స్టార్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్ వాహనం విభాగంలో ముందజలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారుని సరసమైన ధర వద్ద విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అయితే బుకింగ్స్ ప్రారంభం కావడానికి ఇక కేవలం కొన్ని గంటలు మాత్రమే వేచి ఉండాలి, కావున ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో త్వరలోనే తెలిసిపోతుంది. అప్పటి వరకు ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata tiago ev bookings to open from 10th october details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X