Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన టియాగో (Tiago) మరియు టిగోర్ (Tigor) యొక్క CNG మోడల్‌లను అధికారికంగా విడుదల చేసింది. Tiago మరియు Tigor యొక్క CNG వెర్షన్ యొక్క ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.09 లక్షలు మరియు రూ. 7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త CNG మోడల్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో CNG వేరియంట్లు 4 ట్రిమ్స్ లో అందుబటులో ఉంటాయి. అవి XE, XM, XT మరియు XT+ వేరియంట్స్. అదే సమయంలో కొత్త టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్లు 2 ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉన్నాయి. అవి XZ, మరియు XZ+ వేరియంట్స్.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వెర్షన్‌లు భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉన్నాయి. ఎందుకేనట ఈ వేరియంట్ల యొక్క స్టాండర్డ్ మోడల్స్ దాని గ్లోబల్-NCAP టెస్ట్ లో ఇప్పటికే 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. కావున ఇప్పుడు విడుదలైన ఈ కొత్త వేరియంట్స్ కూడా తప్పకుండా మంచి రేటింగ్ పొందుతాయని భావిస్తున్నాము.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతదేశంలో రోజురోజుకి CNG కార్లకు డిమాండ్ పెరుగుతున్నందున టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌లపై టాటా మోటార్స్ అధిక అంచనాలను కలిగి ఉంది. టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌లను ప్రారంభించడంతో, ఈ కార్ల నిర్వహణ ఖర్చులు గతంలో కంటే మరింత సరసమైనవిగా మారతాయి. కావున ఈ వేరియంట్లు తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఎప్పటికప్పుడు కఠినతరమైన ఉద్గార నిబంధనలు అమలవుతున్న కారణంగా, కొనుగోలుదారులు తప్పకుండా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా CNG వేరియంట్‌లను ఎంచుకుంటారు. కావున ఇవి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. CNG కార్లు చాలా తక్కువ కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి, కావున రానున్న రోజుల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

డిజైన్ వారీగా, టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌లు వాటి పెట్రోల్ మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే వాటినుంచి CNG వేరియంట్‌లు స్టాండర్డ్ వేరియంట్‌ల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి 'i CNG' బ్యాడ్జింగ్‌ను పొందుతాయి. కావున ఇవి ఇవి కొంత ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా టియాగో మరియు టాటా టిగోర్ రెండూ కూడా ఒకే 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో శక్తిని పొందుతున్నాయి. అయితే, ఈ పవర్‌ట్రెయిన్‌కు CNGతో అమలు చేయడానికి కొన్ని మార్పులు చేయబడతాయి. స్టాండర్డ్ వెర్షన్ 84.82 bhp మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగా, దాని CNG వేరియంట్ ఇంజిన్ మాత్రం 72 bhp ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా తక్కువ పవర్ అందిస్తుంది.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం, టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క పెట్రోల్-ఆధారిత వెర్షన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తున్నాయి. అయితే CNG వెర్షన్‌లు కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబటులో ఉంటాయి. అంతే కాకుండా, ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్ యొక్క అదనపు బరువును తట్టుకోవడానికి టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌ల సస్పెన్షన్‌ను కూడా టాటా మోటార్స్ రీ-ట్యూన్ చేసింది.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క సిఎన్‌జి వేరియంట్‌లు ఇతర సిఎన్‌జి కార్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తాయని తెలిసింది. టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్ హ్యుందాయ్ ఆరా వంటి వాటికి మరియు మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మరియు హ్యుందాయ్ శాంత్రో వంటి కొన్ని ఇతర CNG పవర్డ్ హ్యాచ్‌బ్యాక్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా మోటార్స్ నుండి వచ్చిన టాటా టియాగో మరియు టాటా టిగోర్ 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నందున, టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ SUV మరియు టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క CNG పవర్డ్ వేరియంట్‌లను కూడా పరిచయం చేస్తుందని ఆశిస్తున్నాము.

Tata Tiago మరియు Tigor ఇప్పుడు CNG వెర్షన్‌లో: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఏప్రిల్ 2021 నుండి నవంబర్ 2021 వరకు భారతదేశంలో మొత్తం 1.36 లక్షల కంటే ఎక్కువ CNG కార్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో టాటా మోటార్స్ ఇటీవలే హ్యుందాయ్‌ని అధిగమించి భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల అమ్మకందారుగా నిలిచింది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త CNG వేరియంట్‌లు తప్పకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి సహాయపడతాయి.

Most Read Articles

English summary
Tata tiago tigor cng india launch price 6 09 lakh details
Story first published: Wednesday, January 19, 2022, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X