Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

మారుతి సుజుకి ఇండియా దేశంలో కేవలం కార్ల తయారీలోనే కాకుండా, సిఎన్‌జి కార్ల విక్రయాల్లో కూడా అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసినదే. మనదేశంలో అత్యధిక సంఖ్యలో సిఎన్‌జి కార్ మోడళ్లను విక్రయిస్తున్న మొదటి సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). కంపెనీ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన చిన్న కారు కొత్త తరం సెలెరియో (Celirio CNG)లో కూడా కంపెనీ తాజాగా ఓ సిఎన్‌జి వెర్షన్ ను పరిచయం చేసింది. ఇంజన్ పవర్ తో సంబంధం లేకుండా అధిక మైలేజీని కోరుకునే కస్టమర్లకు సిఎన్‌జి కార్లు చాలా చక్కటి ఆప్షన్ గా ఉంటాయి.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

మనదేశంలో సిఎన్‌జి ఇంధన లభ్యత గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది. దీంతో కార్ల తయారీదారులు కూడా కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తమ ఉత్పత్తులలో సిఎన్‌జి కార్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా, మరొక దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) కూడా సిఎన్‌జి కార్ల విభాగంలో అడుగుపెట్టింది. కంపెనీ విక్రయిస్తున్న టియాగో (Tiago CNG) హ్యాచ్‌బ్యాక్ లో టాటా మోటార్స్ ఓ సిఎన్‌జి వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసింది.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

మారుతి సుజుకి తమ కార్లలో అందిస్తున్న సిఎన్‌జి టెక్నాలజీ పేరు ఎస్-సిఎన్‌జి (S-CNG). అలాగే, టాటా మోటార్స్ తమ కార్లలో ఆఫర్ చేస్తున్న సిఎన్‌జి టెక్నాలజీ పేరు ఐ-సిఎన్‌జి (i-CNG). మరి ఈ కథనంలో కొత్తగా వచ్చిన టియాగో ఐ-ఎస్‌జి కారు ఈ విభాగంలోని సెలెరియో ఎస్-సిఎన్‌జి కారుతో ఏ విధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎక్స్టీరియర్:

మారుతి సుజుకి తమ కొత్త తరం సెలెరియో ఎస్-సిఎన్‌జి కారును మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారు చేసింది. ఇందులో ముందు భాగంలో క్రోమ్ హైలైట్‌లతో కూడిన కొత్త రేడియంట్ గ్రిల్ మరియు రీడిజైన్ చేసిన పెద్ద హెడ్‌ల్యాంప్ యూనిట్స్, డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్ మరియు అందులోనే అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు సైడ్ మిర్రర్స్, పెద్ద 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో చూడొచ్చు. మారుతి సుజుకి సెలెరియో పొడవు 3,695mm, వెడల్పు 1,655mm మరియు ఎత్తు 1,555mm గా ఉంటుంది.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇక టాటా టియాగో ఐ-సిఎన్‌జి విషయానికొస్తే, ఇది కంపెనీ గత 2020 ప్రారంభంలో విడుదల చేసిన టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది. ఈ కారు ముందు భాగంలో ట్రై-యారో డిజైన్ తో కూడిన ఫ్రంట్ గ్రిల్‌, ఫ్రంట్ బానెట్ కి దిగువన పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేసిన స్ట్రైప్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సన్నటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా టియాగో ఐ-సిఎన్‌జి పొడవు 3,765mm, వెడల్పు 1,677mm మరియు ఎత్తు 1,535mm గా ఉంటుంది. ఈ కారు యొక్క అదనపు ఫీచర్లు ఏంటంటే, డ్యూయల్-కలర్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో కూడిన బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇంటీరియర్స్

కొత్తగా విడుదలైన మారుతి సుజుకి సెలెరియో ఎస్-సిఎన్‌జి మోడల్ కారు యొక్క మొత్తం ఇంటీరియర్ క్యాబిన్ ప్రీమియం క్వాలిటీ లుక్ కోసం నలుపు రంగులో డిజైన్ చేయబడి ఉంటుంది. సెలెరియో యొక్క మిడ్-వేరియంట్ అయిన విఎక్స్ఐ వేరియంట్ ఆధారంగా, కొత్త సెలెరియో ఎస్-సిఎన్‌జి వేరియంట్ ను ప్రవేశపెట్టారు. ఈ వేరియంట్‌లో ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ మరియు ఎలక్ట్రిక్ రియర్ వ్యూ మిర్రర్‌లు వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

సెలెరియో ఎస్-ఎస్-సిఎన్‌జి వేరియంట్ లో 60:40 స్ప్లిట్ రియర్ సీట్, డే అండ్ నైట్ ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, రియర్ పార్సెల్ షెల్ఫ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక టాటా టియాగో ఐ-ఎస్-సిఎన్‌జి మోడల్ విషయానికొస్తే, ఇది స్టాండర్డ్ టియెగో యొక్క XZ మరియు NRG వేరియంట్‌లు మినహా మిగిలిన అన్ని ఇతర వేరియంట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, క్యాబిన్ లోపల ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ ట్రిమ్‌ ఆప్షన్ లభిస్తుంది. టాటా టియాగో ఐ-ఎస్-సిఎన్‌జి కారు లోపల సంగీతం కోసం 8 స్పీకర్లతో కూడిన హార్మన్-గోర్డాన్ సౌండ్ సిస్టమ్, వినోదం కోసం 7 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టివిటీ అయిన సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియో, ఆటో-యాక్సెప్టింగ్ మరియు 8-వే ఆటోమేటిక్ కంట్రోల్ డ్రైవ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇంజన్

మారుతి సుజుకి సెలెరియో ఎస్-ఎస్-సిఎన్‌జి మోడల్ 1.0 లీటర్, 3 సిలిండర్, కె10సి ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 5,300 rpm వద్ద 56 bhp శక్తిని మరియు 3,400 rpm వద్ద 82.1 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

Tata Tiago i-CNG వర్సెస్ Maruti Celerio S-CNG: రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇక టాటా టియాగో ఐ-ఎస్-సిఎన్‌జి విషయానికి వస్తే, ఇది సెలెరియో కన్నా పెద్ద 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 rpm వద్ద 72 bhp శక్తిని మరియు 3,500 rpm వద్ద 95 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, సెలెరియో సిఎన్‌జి వెర్షన్ కన్నా టియాగో సిఎన్‌జి వెర్షన్ ఇంజన్ పవర్, టార్క్ గణాంకాల పరంగా చాలా శక్తివంతమైనది గా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata tiago tigor i cng vs maruti suzuki celerio s cng comparison
Story first published: Saturday, January 22, 2022, 15:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X