బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ (Tata Tigor) లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త కలర్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. కొత్త టాటా టిగోర్ ఇప్పుడు బ్లాక్ కలర్ రూఫ్‌ తో కొత్త ఒపెల్ వైట్ బాడీ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ డ్యూయెల్ టోన్ పెయింట్ ఫినిషింగ్‌లో టిగోర్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదికాకుండా, మాగ్నెటిక్ రెడ్ బాడీ కలర్ మరియు బ్లాక్ రూఫ్ ఆప్షన్ లో కూడా టాటా టిగోర్ అందుబాటులో ఉంది.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

టాటా టిగోర్ మొత్తం రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటుగా మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందించబడుతుంది, ఇందులో డీప్ రెడ్, అరిజోనా బ్లూ మరియు డేటోనా గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా టిగోర్ దాని విభాగంలో బ్లాక్ రూఫ్ ఆప్షన్ ను పొందిన ఏకైక సెడాన్. ఈ కొత్త టిగోర్ లో కలర్ కొత్త ఆప్షన్ మినహా కంపెనీ ఈ కారులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

ఈ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ సెడాన్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు ఆటో-హెడ్‌లైట్ల వంటి మరెన్నో కంఫర్ట్ ఫీచర్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, సేఫ్టీ పరంగా చూస్తే ఈ చిన్న కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, మరియు రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి స్టాండర్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

టాటా టిగోర్ 1.2-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా టిగోర్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టిగోర్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. కస్టమర్లకు ఇందులో ప్యూర్ ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

టాటా టిగోర్‌లో కంపెనీ ఇటీవలే సిఎన్‌జి మోడళ్లను విడుజల చేసింది. తాజాగా ఇందులో 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' (Tigor XM iCNG) పేరిట మరో కొత్త వేరియంట్ ను కూడా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. సిఎన్‌జి వేరియంట్ లోని అదే 1.2 లీటర్ ఇంజన్ గరిష్టంగా 73 బిహెచ్‌పి శక్తిని మరియు 95 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, సిఎన్‌జి మోడల్ కేవలం స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

మార్కెట్లో సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ఎంట్రీ-లెవల్ టిగోర్ ఎక్స్‌ఎమ్ ఐసిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ వేరింయట్లో లభించే ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో 4-స్పీకర్లో కూడిన హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్ ఇవ్వబడ్డాయి. ఇంకా ఇందులో సగటు మైలేజ్, సీట్ బెల్ట్ రిమైండర్, గేర్ షిఫ్ట్ డిస్‌ప్లే మొదలైన సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

సేఫ్టీ విషయానికి వస్తే, టాటా టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి వేరియంట్ లో ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు డిస్ప్లే, ఆటో డోర్ లాక్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇది సిఎన్‌జి వేరియంట్ కావడంతో సాధారణ పెట్రోల్ టిగోర్ మోడల్‌లో లభించే 419-లీటర్ల బూట్ స్పేస్ తో పోలిస్తే, ఈ సిఎన్‌జి వేరియంట్లో వెనుక వైపు ట్యాంక్ చేరిన కారణంగా దీని బూట్ స్పేస్ 205-లీటర్లకు తగ్గించబడుతుంది. అదే సమయంలో, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 మిమీ వద్ద స్టాండర్డ్ మోడల్ కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

టాటా టిగోర్ సిఎన్‌జిలో 35-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ తో పాటుగా 60-లీటర్ల సిఎన్‌జి ఫ్యూయెల్ ట్యాంక్ కూడా ఉంటుంది. టాటా మోటార్స్ తమ ఎంట్రీ లెవల్ మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను ప్రవేశపెట్టిన తర్వాత, వాటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. టాటా టిగోర్ కోసం వస్తున్న మొత్తం బుకింగ్స్ లో దాదాపు 75 శాతం బుకింగ్స్ దాని ICNG వేరియంట్‌ ల నుండే వస్తున్నాయని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క CNG మోడల్స్ కి మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.

బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కొత్త టాటా టిగోర్.. డ్యూయెల్ టోన్‌లో మెరిసిపోతున్న సెడాన్..

టాటా కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో కంపెనీ గత నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. టాటా మోటార్స్ గడచిన జులై నెలలో మొత్తం 47,505 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాలు 2021 జులై నెలలో విక్రయించిన దాని కంటే 57 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఇప్పుడు మరింత సరసమైన ధరకే కొత్త సిఎన్‌జి మోడల్‌ను తీసుకురావడంతో రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata tigor sedan now available in black roof with opel white dual tone color option details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X