కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో గడచిన సెప్టెంబర్ 2022 నెలలో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. గడచిన నెలలో భారతదేశంలో మొత్తం 3,54,947 కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2022లో భారతదేశంలో మొత్తం కార్ల విక్రయాలు 91.32 శాతం పెరిగాయి. ఆగస్టు 2022 నెలతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు కూడా 8.11 శాతం పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

భారతీయ కార్‌మేకర్‌లు గత నెలలో హోల్‌సేల్ మార్కెట్‌లో మొత్తం 3,54,947 కార్లను విక్రయించారు, మారుతి సుజుకి మరోసారి మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల్లో 40 శాతానికి పైగా వాటాను దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య సమీప పోటీ సాగుతోంది. కాగా, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్లు ఇలా ఉన్నాయి:

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

1 - మారుతి సుజుకి- 1,48,380 యూనిట్లు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,48,380 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. సెప్టెంబర్ 2021లో విక్రయించిన 63,111 యూనిట్లతో పోలిస్తే గత నెలలో వార్షిక అమ్మకాలు 135.11 శాతం (85,269 యూనిట్లు) పెరిగాయి. అదే ఆగస్టు 2022 నెలతో పోలిస్తే, కంపెనీ నెలవారీ విక్రయాలు 10.59 శాతం (14,214 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

2 - హ్యుందాయ్ - 49,700 యూనిట్లు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గత నెలలో భారతదేశంలో మొత్తం 49,700 కార్లు మరియు ఎస్‌యూవీలను విక్రయించింది. సెప్టెంబర్ 2021 నెలలో విక్రయించిన 33,087 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో హ్యుందాయ్ వార్షిక అమ్మకాలు 16,613 యూనిట్లు (50.21 శాతం) పెరిగాయి. ఆగస్టు 2022 నెలలో విక్రయించిన 49,510 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 190 యూనిట్లు (0.38 శాతం) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

3 - టాటా మోటార్స్ - 47,654 యూనిట్లు

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మొత్తం గత నెలలో 47,654 యూనిట్లను విక్రయించి హ్యుందాయ్‌కు సమీప పోటీని ఇచ్చింది. సెప్టెంబర్ 2021 నెలలో టాటా మోటార్స్ విక్రయించిన 21,924 యూనిట్లతో పోలిస్తే గత నెలలో కంపెనీ వార్షిక అమ్మకాలు 85.21 శాతం (21,924 యూనిట్లు) పెరిగాయి. కాగా, ఆగస్ట్ 2022 నెలలో టాటా మోటార్స్ విక్రయించిన 47,166 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 488 యూనిట్లు లేదా 1.03 శాతం పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

4 - మహీంద్రా - 34,508 యూనిట్లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా, కొత్తగా విడుదల చేస్తున్న ఎస్‌యూవీలతో బలమైన అమ్మకాలను కనబరుస్తోంది. సెప్టెంబర్ 2022 నెలలో మహీంద్రా మొత్తం 34,508 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. కాగా, సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 12,863 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 168.27 శాతం (21,645 యూనిట్లు) పెరిగాయి. కాగా, ఆగస్ట్ 2022 నెలలో విక్రయించిన 29,852 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 15.6 శాతం (4,656 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

5 - కియా - 25,857 యూనిట్లు

హ్యుందాయ్ అనుబంధ కంపెనీ, కొరియన్ కార్ బ్రాండ్ కియా కూడా ప్రస్తుతం భారతదేశంలో బలమైన ఆటోమొబైల్ బ్రాండ్‌‍‌గా అవతరిస్తోంది. ఈ కంపెనీ ప్రోడక్ట్ లైనప్‌లో తక్కువ మోడళ్లు ఉన్నప్పటికీ, వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటోంది. సెప్టెంబర్ 2022లో కియా భారతదేశంలో మొత్తం 25,857 వాహనాలను విక్రయించింది. సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 14,441 యూనిట్లతో పోలిస్తే కియా వార్షిక అమ్మకాలు 79.05 శాతం (11,416 యూనిట్లు) పెరిగాయి. అలాగే, ఆగస్టు 2022 నెలలో విక్రయించిన 23,332 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 15.84 శాతం (3,535 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

6 - టొయోటా - 15,378 యూనిట్లు

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా ఇటీవలే భారత మార్కెట్లో సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను విడుదల చేయడంతో కొత్త కస్టమర్లను తనవైపుకు ఆకర్షించుకుంది. గత నెలలో టయోటా మొత్తం 15,378 యూనిట్లను విక్రయించడంతో మరోసారి 6వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2021 నెలలో టొయోటా విక్రయించిన 9,284 యూనిట్లతో పోల్చితే, గత నెలలో కంపెనీ వార్షిక అమ్మకాలు 65.64 శాతం (6,094 యూనిట్లు) పెరిగాయి. అదే, ఆగస్టు 2022 నెలలో విక్రయించిన 14,959 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 2.80 శాతం (419 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

7 - హోండా - 8,714 యూనిట్లు

జపాన్‌కు చెందిన హోండా ప్రస్తుతం తన లైనప్‌లో పరిమిత మోడళ్లను కలిగి ఉన్నప్పటికీ, అమేజ్ మరియు సిటీ సెడాన్లకు వస్తున్న డిమాండ్ కారణంగా, గడచిన సెప్టెంబరు 2022 నెలలో 8,714 యూనిట్లను విక్రయించి 7వ స్థానాన్ని ఆక్రమించింది. సెప్టెంబర్ 2021 నెలలో హోండా విక్రయించిన 6,765 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో హోండా విక్రయాలు 28.81 శాతం (1,949 యూనిట్లు) పెరిగాయి. అదే, ఆగస్ట్ 2022 నెలలో విక్రయించిన 7,769 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 12.16 శాతం (945 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

8. రెనో - 7,623 యూనిట్లు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గత నెలలో 7,623 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి 8వ స్థానంలో నిలిచింది. రెనో అందిస్తున్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మరియు కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఈ బ్రాండ్ నుండి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సెప్టెంబర్ 2021 నెలలో రెనో విక్రయించిన 73,26 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 4.05 శాతం (297 యూనిట్లు) పెరిగాయి. అదే, ఆగస్టు 2021 నెలలో విక్రయించిన 7,012 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 8.71 శాతం (611 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

9. - ఫోక్స్‌వ్యాగన్ - 4,103 యూనిట్లు

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఈసారి అనూహ్యంగా టాప్ 10 కార్ బ్రాండ్ల జాబితాలోకి ప్రవేశించింది. గత నెలలో ఈ కంపెనీ మొత్తం 4,103 యూనిట్లను వాహనాలను విక్రయించి 9వ స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 2021 నెలలో ఫోక్స్‌‌వ్యాగన్ విక్రయించిన 2,563 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 60.09 శాతం (1,540 యూనిట్లు) పెరిగాయి. అదే, ఆగస్టు 2022 నెలలో విక్రయించిన 2,051 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 99.95 శాతం (2,052 యూనిట్లు) పెరిగాయి.

కార్ కంపెనీలకు కలిసొచ్చిన పండుగ సెంటిమెంట్.. గత నెలలో ఇవే టాప్ 10 కార్ బ్రాండ్స్..

10. ఎమ్‌జి మోటార్స్ - 3,808 యూనిట్లు

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ గత నెలలో 3,808 యూనిట్లను విక్రయించి ఈ జాబితాలో చివరి స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 2022 నెలలో ఎమ్‌జి మోటార్ విక్రయించిన మొత్తం 3,241 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 17.49 శాతం (567 యూనిట్లు) పెరిగాయి. అయితే, ఆగస్ట్ 2022 నెలలో విక్రయించిన 3,823 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు స్వల్పంగా 0.39 శాతం (15 యూనిట్లు) తగ్గాయి.

Most Read Articles

English summary
Top 10 best selling car brands in september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X