Just In
- 14 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 16 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 18 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
- 20 hrs ago
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
Don't Miss
- News
Atmakur Bypoll Results 2022:మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమేనా..?
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
పెరిగిన పెట్రోల్ ధరలకు చింతిస్తున్నారా.. అయితే ఇదే మీకు చక్కని పరిష్కారం
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రత్యేకించి టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను పెట్రోల్/డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. అయితే, చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లను కొనాలన్న ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మనదేశంలో సరైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన వారంతా వెనుకంజ వేస్తున్నాయి. కానీ, మనదేశంలో పూర్తి చార్జ్ పై ఎక్కువ రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. కాబట్టి, గరిష్టంగా ఒక రోజులో 250-300 కిమీ దూరం ప్రయాణించే కస్టమర్లు ఎలాంటి సందేహం లేకుండా ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో ఒక దానిని కొనుగోలు చేయవచ్చు.

1. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)
చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విడుదల చేసిన మొట్టమొదటి మరియు ఏకైక ఎలక్ట్రిక్ వాహనం ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV). ఈ ఎలక్ట్రిక్ కారులో 50.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 461 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో ఉపయోగించిన పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) గరిష్టంగా 176 bhp శక్తిని మరియు 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, MG ZS EV ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 8.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక ఛార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారుని 7.4 kW ఏసి ఛార్జర్ ఉపయోగించి పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 9 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. అదే, 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 60 నిమిషాలలోనే 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

2. హ్యుందాయ్ కోనా (Hyundai Kona)
ఎమ్‌జి జెడ్ఎస్ మాదిరిగానే హ్యుందాయ్ కోనా (Hyundai Kona) కూడా ఈ కొరియన్ కార్ బ్రాండ్ నుండి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇతర హ్యుందాయ్ వాహనాల మాదిరిగానే, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా అనేక ఫీచర్లతో లభిస్తుంది. పూర్తి చార్జ్ పై హ్యుందాయ్ కోనా యొక్క ARAI సర్టిఫైడ్ రేంజ్ 452 కిమీగా ఉంటుంది. ఈ కారులో కూడా ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) ఉంటుంది. ఇది గరిష్టంగా 136 bhp పవర్ ను మరియు 395 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పెద్ద 39.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను 50kW DC ఛార్జర్ ఉపయోగించి పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 57 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అయితే, స్టాండర్డ్ AC ఛార్జర్‌ని ఉపయోగించి పూర్తిగా ఛార్జ్ చేయడానికి మాత్రం సుమారు 6 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే, హ్యుందాయ్ ఇప్పుడు తమ రెండవ ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ అయానిక్ 5 ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

3. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max)
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే భారతదేశంలో వ్యక్తిగత ఈవీ విభాగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను కలిగి ఉంది. కాగా, ఈ వాటాను మరింత పెంచుకునేందుకు కంపెనీ ఇందులో ఇటీవలే ఓ కొత్త లాంగ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులోని 40.5 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఇది పూర్తి చార్జ్ పై ARAI సర్టిఫై చేసిన 437 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్తగా విడుదలైన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ బ్యాటరీ ప్యాక్ లో చేసిన మార్పుల కారణంగా, దీని ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఇప్పుడు మరింత ఎక్కువ పవర్ మరియు టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 143 bhp శక్తిని మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ కారుతో పాటుగా రెండు రకాల చార్జర్ ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో 7.2 kWh AC ఛార్జర్‌ని ఉపయోగించి నెక్సాన్ ఈవీ మ్యాక్స్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ సమయాన్ని 50kW DC ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 56 నిమిషాలకు తగ్గించవచ్చు.

4. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ (Volvo XC40 Recharge)
స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో అందిస్తున్న ఎక్స్‌సి40 రీఛార్జ్ (Volvo XC40 Recharge) ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. కంపెనీ, ప్రస్తుతం ఈ కారును పూర్తిగా విదేశాలలో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా, దీని ధర కూడా ప్రీమియం రేంజ్ లోనే ఉంటుంది. స్టాండర్డ్ గ్యాసోలీన్ వెర్షన్ XC40 ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌సి40 మోడల్ ను తయారు చేసింది.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ పెద్ద 78 kWh బ్యాటరీ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 419 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో మొత్తం రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి గరిష్టంగా 402 bhp శక్తిని మరియు 660 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. పెర్ఫార్మెన్స్ విషయానికి, ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ కారణంగా వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరకుంటుంది.

5. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి (Mercedes-Benz EQC)
ఈ జాబితాలో ఐదవది మరియు లగ్జరీ మోడల్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి గడచిన 2020లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఇది ఈ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ నుండి భారతదేశంలో విక్రయించబడుతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారులో కూడా పెద్ద 85 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పూర్తి ఛార్జ్ పై 414 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసిలో కూడా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 408 bhp శక్తిని మరియు 765 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 5.1సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ, 50kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 90 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అదే, 7.5 kW AC ఛార్జర్‌తో అయితే సుమారు 10 గంటల సమయం పడుతుంది.