ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహన వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అనునిత్యం పెరుగుతున్న ఇంధన ధరలనే చెప్పాలి. అయితే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపుతారు. కావున దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV):

ప్రముఖ చైనీస్ వాహన తయారీ సంస్థ 'ఎంజి మోటార్స్' (MG Motors) భారతీయ మార్కెట్లో విడుదల చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ 'ఎంజి జెడ్ఎస్ ఈవి' (MG ZS EV). ఎంజి జెడ్ఎస్ ఈవి అనేది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ వెహికల్. MG ZS EV కార్ 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 176 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ SUV కేవలం 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

ఎంజి జెడ్ఎస్ ఈవి గరిష్టంగా 461 కి.మీ రేంజ్ అందిస్తుందని 'ఏఆర్ఏఐ' ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. ఎంజి జెడ్ఎస్ ఈవి 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌ ద్వారా కేవలం 9 గంటల కంటే తక్కువ సమయంలో 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేయబడుతుంది. అదే సమయంలో ఇది 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా కేవలం 60 నిముషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

హ్యుందాయ్ కోనా (Hyundai Kona):

హ్యుందాయ్ కోనా (Hyundai Kona) అనేది భారత మార్కెట్లో విడుదలైన హ్యుందాయ్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. హ్యుందాయ్ కోనాలో 39.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంతే కాకుండా ఇది 'పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్' ను కలిగి ఉంటుంది. ఇది 136 బిహెచ్‌పి పవర్ మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

హ్యుందాయ్ కోనా ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 452 కిమీ రేంజ్ అందిస్తుందని 'ఏఆర్ఏఐ' ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ SUV 50 కిలోవాట్ డిసి ఛార్జర్‌ ద్వారా కేవలం 57 నిముషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకుంటుంది. అయితే స్టాండర్డ్ ఏసీ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ (Tata Nexon EV Max):

భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో కొత్త టాటా మోటార్స్ కొత్త 'నెక్సాన్ ఈవి మాక్స్' విడుదల చేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా నెక్సాన్ ఈవి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఈవి మాక్స్ విడుదలతో మార్కెట్లో ఇది మరింత బలోపేతం అవుతుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

'టాటా నెక్సాన్ ఈవి మాక్స్' ప్రారంభ ధర రూ. 17.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ 143 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9 సెకన్లలో 0-100కిమీ/గం నుండి వేగాన్ని అందుకోగలదని మరియు గరిష్ట వేగం గంటకు 140 కిమీ వరకు ఉంటుందని తెలిపింది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

టాటా నెక్సాన్ ఈవి మాక్స్ ఒక పుల్ ఛార్జ్ తో గరిష్టంగా 437 కిలోమీటర్ల పరిధి అందిస్తుందని 'ఏఆర్ఏఐ' ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో 300 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే అవకాశం ఉంటుంది.

నెక్సాన్ ఇవి మాక్స్ 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈవి మ్యాక్స్ ను 0 నుంచి 100% ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అదే విధంగా 7.2 కిలోవాట్ ఛార్జర్ ద్వారా పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక మరింత వేగవంతమైన ఛార్జింగ్ పొందటానికి ఇప్పుడు 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు కేవలం 56 నిముషాల్లోపు 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ (Volvo XC40 Recharge):

వోల్వో కంపెనీ యొక్క ఎక్స్‌సి40 రీఛార్జ్ అనేది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేయబడుతుంది. ఇది దాని స్టాండర్డ్ ఎక్స్‌సి40 పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నించి ఉంటుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ 78 కిలోవాట్ బ్యాటరీ బ్యాక్‌తో వస్తుంది. ఇది 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్‌ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్ పైన దాదాపు 419 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి (Mercedes-Benz EQC):

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో 2020 లో ఈక్యూసి అనే ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ప్రవేశపెట్టింది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV. ఈ ఎలక్ట్రిక్ SUV 85 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 408 బిహెచ్‌పి పవర్ మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ EQC కేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 414 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ని 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్‌ ఉపయోగించి కేవలం 90 నిముషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే 7.5 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌ ద్వారా పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి 10 గంటల సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Top 5 highest range electric cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X