హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జపనీస్ కార్ బ్రాండ్ హోండా (Honda) తమ ఐదవ తరం సిటీ సెడాన్‌లో ఓ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ "హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ" (Honda City e:HEV) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ హైబ్రిడ్ కారును కేవలం ఒకే ఒక వేరియంట్ (ZX) లో మాత్రమే విడుదల చేయనుంది. అంతేకాకుండా, ఈ హైబ్రిడ్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

హోండా ప్రస్తుతం, భారత మార్కెట్లో తమ నాల్గవ తరం సిటీ సెడాన్ (పాత మోడల్)తో పాటుగా ఐదవ తరం సిటీ సెడాన్ కారును కూడా విక్రయిస్తోంది. ఈ లేటెస్ట్ ఫిఫ్త్ జనరేషన్ సిటీ సెడాన్ లోని టాప్-ఎండ్ వేరియంట్ ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ మేడ్ ఇన్ ఇండియా హోండా సిటీ ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ కారును తయారు చేసింది. మరి ఈ ఎగ్జిక్యూటివ్ హైబ్రిడ్ సెడాన్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆ టాప్ 7 విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

1. Honda City e:HEV - స్టాండర్డ్ మోడల్‌కి, ఈ హైబ్రిడ్ మోడల్‌కి డిజైన్ మారిందా?

హోండా సిటీ ఇ-హెచ్ఈవీ హైబ్రిడ్ కారును టాప్-ఎండ్ (ZX) వేరియంట్ ఆధారంగా తయారు చేసిన నేపథ్యంలో, ఇది చాలా ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఎక్కువ క్రోమ్ ఎలిమెంట్స్ దీనికి మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తాయి. ఇది హైబ్రిడ్ కారు అని సూచించేందుకు ముందు భాగంలోని హోండా లోగోను బ్లూ యాక్సెంట్స్‌తో హైలైట్ చేశారు. ఇతర అంశాలలో రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, డిఫ్యూజర్ వంటి ఎలిమెంట్‌తో రివైజ్ చేయబడిన రియర్ బంపర్ మరియు బూట్‌ డోరుపై కొత్త లిప్ స్పాయిలర్ వంటి డిజైన్ మార్పులను ఇందులో గమనించవచ్చు.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

2. Honda City e:HEV - ఇందులో కొత్త ఫీచర్లు ఏమైనా ఉన్నాయా?

హోండా సిటీ ఇ-హెచ్ఈవీ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కంపెనీ ఈ హైబ్రిడ్ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సరౌండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్, పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ ఫుల్-కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, వాక్ అవే ఆటో లాక్, హోండా స్మార్ట్ కనెక్ట్ యాప్‌ సాయంతో పనిచేసే కనెక్ట్ చేయబడిన కార్ టెక్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

3. Honda City e:HEV - ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా?

సేఫ్టీ విషయంలో హోండా సిటీ ఇ-హెచ్ఈవి ఇతర సిటీ సెడాన్ కార్ల కన్నా ఓ అడుగు ముందంజలో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త హైబ్రిడ్ కారును హోండా సెన్సింగ్ టెక్నాలజీతో అందిస్తోంది. ఇది ఇతర ప్రీమియం కార్లలో అందిస్తున్న ఏడిఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్) వంటి టెక్నాలజీ. ఇందులో ఆటో హై బీమ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో ABS, EBD, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో బ్రేక్ హోల్డ్, లేన్ వాచ్ కెమెరా, మల్టీ-యాంగిల్ రియర్‌వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

4. Honda City e:HEV - పవర్‌ట్రైన్ (ఇంజన్) శక్తివంతమైనదా?

మనదేశంలో లభిస్తున్న కొన్ని కార్లలో మైల్డ్ హైబ్రిడ్-టెక్నాలజీ ఉంటుంది, కానీ ఇది అంత ప్రభావితమైనది కాదు. హోండా తమ సిటీ హైబ్రిడ్ కారులో అందిస్తున్న హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ చాలా సమర్థవంతమైనది. ఇది సరళమైన ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్)ను కలిగి ఉంటుంది. కొత్త హోండా సిటీ ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఫ్రంట్ యాక్సిల్స్‌లో అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ఓ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

హోండా సిటీ ఇ-హెచ్ఈవి లోని 1.5 లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే 97 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 127 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గణాంకాలు స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువగా ఉంటాయి. అయితే, ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో భాగంగా, ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 253 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫ్రంట్ యాక్సిల్‌ అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్లు అదనపు బూస్ట్‌ను అందించడానికి మరియు స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మోడ్‌లో కారును ముందుకు నడపడానికి సహకరిస్తాయి.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

5. Honda City e:HEV - చార్జింగ్ అవసరమా?

హోండా సిటీ ఇ-హెచ్ఈవిలో ఉపయోగించిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ప్రత్యేకంగా చార్జ్ చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కాదనే చెప్పాలి. ఎందుకంటే, ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కాదు, బిల్ట్-ఇన్ హైబ్రిడ్. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవిని నేరుగా ఏదైనా పవర్ సోర్స్‌కి ప్లగ్ చేయనవసరం లేదు, ఈ హైబ్రిడ్ సెడాన్ బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ టెక్నిక్‌ని ఉపయోగించి తనంతట తానుగా బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకుంటుంది. అంటే, ఇందులోని అదనపు బ్యాటరీ ప్యాక్‌ని చార్జ్ చేయడానికి ఎలాంటి బాహ్య ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదన్నమాట. స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ప్యాడిల్స్‌ను ఉపయోగించి బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ తీవ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

6. Honda City e:HEV - మైలేజ్ ఎంతిస్తుంది?

ఇక అసలు విషయమైన మైలేజ్ దగ్గరకు వస్తే.. ఈ హైబ్రిడ్ కారులోని సమర్థవంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కారణంగా, ఇది స్టాండర్డ్ మోడల్ కన్నా మెరుగైన మైలేజీని అందిస్తుంది. ఈ హైబ్రిడ్ సెటప్‌తో కొత్త హోండా సిటీ ఇ:హెచ్ఈవీ ప్రతి లీటరుకు 26.5 కిమీ మైలేజీని అందించగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, కస్టమర్లు ఈ కారును పెట్రోల్ ఇంజన్ ఆన్ చేయకుండా, పూర్తి ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా డ్రైవ్ చేయవచ్చు. పూర్తి చార్జ్‌తో ఉన్న బ్యాటరీ సాయంతో హోండా సిటీ ఇ:హెచ్‌ఇవి ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో గంటకు 40 కిమీ వేగంతో నడపవచ్చు. అయితే, ప్యూర్ ఈవీ మోడ్‌లో రేంజ్ ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) గురించి తెలుసుకోవాల్సిన టాప్7 విషయాలు

7. Honda City e:HEV - ధర ఎంత ఉంటుంది?

హోండా సిటీ ఇ-హెచ్ఈవీ హైబ్రిడ్ కారు ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం, ఈ కొత్త Honda City e:HEV కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది తెలుస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్ కావడంతో, భారత మార్కెట్లో కంపెనీ దీనిని రూ. 18 లక్షల నుండి రూ. 19 లక్షల రేంజ్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఖచ్చితమైన ధరను కంపెనీ మే 2022 నెలలో వెల్లడించనుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Top 7 things to know about honda city ehev hybrid car design features engine range and more
Story first published: Saturday, April 16, 2022, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X