గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

దేశీయ వాహన విభాగంలో రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు చేరుతున్నాయి. ఇందులో కార్లు, బైకులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అయితే భారతీయ మార్కెట్లో కొత్త లేటెస్ట్ కార్లు మరియు బైకులు విడుదలయ్యాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ యొక్క EQS, మారుతి గ్రాండ్ విటారా మరియు కవాసకి డబ్ల్యు175 మొదలైనవి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో గత వారం విడుదలైన ఈ కొత్త వాహనాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

టాటా టియాగో ఈవి (Tata Tiago EV):

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన కొత్త 'టియాగో ఈవి' ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్ అనే నాలుగు ట్రిమ్స్ అందుబాటులో ఉంది.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో ఈవి లేటెస్ట్ డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్స్ అందించింది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని, 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. టాటా టియాగో ఈవి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 (Mercedes Benz EQS 580):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ 'మెర్సిడెస్ బెంజ్' దేశీయ మార్కెట్లో ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ అనే ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

Mercedes-Benz EQS 580 ఎలక్ట్రిక్ కారులో 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తమ్ మీద ఇది 523 హెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara):

మారుతి సుజుకి గత వారంలో తన గ్రాండ్ విటారాను రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. విడుదలకు ముందే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

మారుతి గ్రాండ్ విటారా ఆధునిక డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. మారుతి గ్రాండ్ విటారా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175):

జపనీస్ టూవీలర్ బ్రాండ్ 'కవాసకి ఇండియా' (Kawasaki India) దేశీయ విఫణిలో 'కవాసకి డబ్ల్యు175' (Kawasaki W175) బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది స్టాండర్డ్ మరియు స్పెషల్ ఎడిషన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

కవాసకి డబ్ల్యు175 బైక్ 177 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కాగా ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. కవాసకి డబ్ల్యు175 గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

జావా 42 బాబర్‌ (Jawa 42 Bobber):

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకుల్లో 'జావా 42 బాబర్‌' విడుదలైంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ మరియు జాస్పర్ రెడ్ అనే మూడు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

కొత్త జావా 42 బాబర్‌ బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ యూనిట్ పొందుతుంది. ఇది 30.64 హెచ్‌పి పవర్ మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 (Hero Xtreme 160R Stealth Edition 2.0):

భారతీయ గత వారం 'హీరో మోటోకార్ప్' కొత్త 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ రెడ్ మరియు బ్లాక్ అనే రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

గతవారం టాప్ న్యూస్.. గ్రాండ్ విటారా నుంచి కవాసకి వరకు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 బైకులో 163 సిసి, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ బిఎస్6 ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 15.2 పిఎస్ పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Top car news of the week cars and bike details
Story first published: Sunday, October 2, 2022, 7:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X