భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

2022 జులై నెలలో భారతీయ మార్కెట్లో కొన్ని ఆధునిక కార్లు విడుదలయ్యాయి. ఇవన్నీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి. ఇంతకీ దేశీయ మార్కెట్లో గత నెలలో ఏ కార్లు విడుదలయ్యాయి, వాటి ధరలు ఏంటి మరియు వాటి ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

2022 మారుతి వితారా బ్రెజ్జా (2022 Maruti Vitara Brezza):

మారుతి సుజుకి కంపెనీ గత నెలలో దేశీయ మార్కెట్లో తన '2022 బ్రెజ్జా' (2022 Brezza) విడుదల చేసింది. ఈ ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), కాగా టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 13.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే ఈ ఎస్‌యువి 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యువి నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి LXi, VXi, ZXi మరియు ZXi+. ఈ SUV లో 1.5-లీటర్, కె15సి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇది మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

సిట్రోయెన్ సి3 (Citroen C3):

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో తన సి5 విడుదల చేసిన తరువాత సి3 అనే చిన్న SUV ని గత నెలలో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ SUV ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.06 లక్షలు. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

సిట్రోయెన్ సి3 అనేది కంపెనీ యొక్క ఇండియన్ ప్రొడక్ట్. ఇది నాలుగు మోనో-టోన్ మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ రెండూ వరుసగా.. 81 బిహెచ్‌పి పవర్ & 115 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 108 బిహెచ్‌పి పవర్ & 190 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తాయి.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

2022 మారుతి ఎస్-ప్రెస్సో (2022 Maruti S-Presso):

మారుతి సుజుకి గత నెలలోనే తన 2022 ఎస్-ప్రెస్సో కూడా విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేటెడ్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధరలు రూ. 4.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇది మొత్తం 6 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులో స్టాండర్డ్, LXi, VXi, VXi+, VXi(O) AGS మరియు VXi+(O) AGS వేరియంట్లు ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కె10సి (K10C) పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ 998 సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ జెట్ మరియు డ్యూయల్ వివిటి టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ (Nissan Magnite Red Edition):

నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ మార్కెట్లో తన విజయవంతమైన మోడల్ 'మాగ్నైట్' యొక్క 'రెడ్ ఎడిషన్' ను 2022 జులై నెలలో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 7,86,500 .

ఈ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి XV మ్యాన్యువల్ ఎడిషన్, టర్బో మ్యాన్యువల్ ఎడిషన్ మరియు టర్బో XV సివిటి ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 7,86,500  (XV మ్యాన్యువల్ ఎడిషన్), రూ. 9,24,500  (టర్బో మ్యాన్యువల్ ఎడిషన్) మరియు రూ. 9,99,900 (టర్బో XV సివిటి ఎడిషన్). ఈ కొత్త ఎస్‌యువి రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఒనిక్స్ బ్లాక్ మరియు స్టార్మ్ వైట్ కలర్స్.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ లో రెండు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 71 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 98 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge):

స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) భారతీయ మార్కెట్లో ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్‌సి40 రీచార్జ్' (XC40 Recharge) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

వోల్వో కంపెనీ విడుదల చేసిన తన మొదటి ఎలక్ట్రిక్ కారు కోసం 2022 జులై 27 న 11 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. అయితే బుకింగ్స్ ప్రారభించిన కేవలం 2 గంటల్లోనే మొత్తం కంపెనీ యొక్క కార్లు అమ్ముడైపోయాయి.

భారతీయ మార్కెట్లో గత నెలలో (2022 జులై) విడుదలైన కార్లు: వివరాలు

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇది ఒక పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 418 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Top cars launched in july citroen c3 new brezza volvo xc40 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X